ఏఎన్‌యూ అధ్యాపకుడికి అంతర్జాతీయ అవార్డు
ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎంహెచ్‌ఆర్‌ఎం విభాగాధిపతి, యూనివర్సిటీ సెంటర్ ఫర్ హెచ్‌ఆర్డీ కో–ఆర్డినేటర్ డాక్టర్ నాగరాజుకు అంతర్జాతీయ ఉత్తమ పరిశోధన పత్రం అవార్డు లభించింది. ఏఎన్‌యూ రిజిస్ట్రార్ ఆచార్య కే జాన్‌పాల్ అవార్డును శనివారం అందజేశారు. టాంజానియా దేశంలోని యూనివర్సిటీ ఆఫ్ ముజిమ్బీచిన, యూనివర్సిటీ ఆఫ్ జాన్‌జిబార్‌లు సంయుక్తంగా ‘ బిజినెస్ అండ్ మేనేజ్‌మెంట్ ఇన్ ఎమర్జింగ్ మార్కెట్స్ ’ అనే అంశంపై ఇటీవల నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఏఎన్‌యూ నుంచి డాక్టర్ నాగరాజు పాల్గొన్నారు. ఆయన ‘ ద రోల్ ఆఫ్ నాలెడ్జ్ మేనేజ్‌మెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ ఐఐసీటీస్ ఫర్ ససై ్టనబుల్ డెవలప్‌మెంట్ కమ్యూనికేషన్ యాన్ ఎంపరికల్ స్టడీ) అనే అంశంపై పరిశోధన పత్రాన్ని సమర్పించారు. దీనికి ఉత్తమ పరిశోధన పత్రం అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నాగరాజును విభాగ అధ్యాపకులు డాక్టర్ తులసీదాస్, యూనివర్సిటీ అధికారులు అభినందించారు.