ఇంటర్ విద్యార్థినిపై కీచక లెక్చరర్ అకృత్యం... | Teacher raped inter girl student cheated to marriage her | Sakshi
Sakshi News home page

ఇంటర్ విద్యార్థినిపై కీచక లెక్చరర్ అకృత్యం...

Published Tue, Mar 17 2015 3:34 AM | Last Updated on Sat, Sep 2 2017 10:56 PM

ఇంటర్ విద్యార్థినిపై కీచక లెక్చరర్ అకృత్యం...

ఇంటర్ విద్యార్థినిపై కీచక లెక్చరర్ అకృత్యం...

ఒంగోలు(ప్రకాశం): గురువే ప్రత్యక్ష దైవం అంటారు. అలాంటి పవిత్రమైన ఆ గురువు స్థానానికి తీరని మచ్చను తెచ్చాడో కీచక లెక్చరర్. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే.. దారితప్పి ప్రవర్తించాడు. పాఠాలు చెప్పాల్సిన పంతులు ఇంటర్ విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురిచేశాడు. విద్యార్థిని నిరాకరించడంతో ఇంటర్ ప్రాక్టికల్స్లో ఫెయిల్ చేస్తానంటూ బెదిరించి రూమ్కు తీసుకెళ్లి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. దాంతో ఆమె తనను పెళ్లిచేసుకోవాలంటూ లెక్చరర్ను నిలదీసింది. అందుకు మొదట్లో పెళ్లికి సరేనన్న.. చివరకు లెక్చరర్ మోహం చాటేశాడు.. అతడి మాటలు నమ్మిన విద్యార్థిని చివరకు మోసపోయానని తెలుసుకుంది.

ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని లింగసముద్రం మండలంలో వెలుగుచూసింది. అయితే తనకు న్యాయం చేయాలంటూ విద్యార్థిని పోలీసులను ఆశ్రయించింది. కీచక లెక్చరర్పై ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు పట్టించుకోలేదంటూ బాధితురాలు వాపోయింది. ఫిర్యాదు చేసినా కూడా  పోలీసులు లెక్చరర్ను అరెస్ట్ చేయలేదంటూ విద్యార్థినీ ఆవేదనను వెలిబుచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement