WWII
-
వందేళ్ల బామ్మకి గౌరవ డాక్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ పట్టా
రెండో ప్రపంచ యుద్ధం నాటి సమయంలోని వ్యక్తులను స్మరించుకుంటూ ..నాటి నుంచి ఇప్పటి వరకు మనుగడ సాధించి ఉన్న ఎందర్నో గౌరవించి సత్కరించాం. ఆ సమయంలో వారు చూపించిన తెగువ, ప్రదర్శించిన శక్తి యుక్తులను ప్రశంసించాం కూడా. అచ్చం అలానే ఒక్కడోక బామ్మ నాటి సమయంలోని ఒక ఉక్కు పరిశ్రమను కాపాడి అందరిచే ప్రశంసలు అందుకుంది. పైగా ఆమె నిస్వార్థ కృషికి గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది యూకే ప్రభుత్వం. వివరాల్లోకెళ్తే....యూకేకి చెందిన వందేళ్ల వృద్ధురాలు రెండో ప్రపంచ యుద్ధంలో ఉక్కు పరిశ్రమను కూలిపోకుండా కాపాడింది. ఆమె యుక్త వయసులో ఆ ఉక్కు పరిశ్రమలో పనిచేసినప్పుడూ..పురుషుల కంటే తక్కువ వేతనంతో ఇతర మహిళలతో కలిసి పనిచేసింది. ఆమె 72 గంటల వారాలు విధులు నిర్వర్తించేది. ఆ వృద్ధురాలి పేరు కాథ్లీన్ రాబర్ట్స్. తనతోపాటు పనిచేసిన వారిలో బతికి ఉన్న ఏకైక వ్యక్తి ఆ బామ్మ. సంక్షోభం, ఆర్థిక పతనం వంటి విపత్కర సమయాల్లో తన దేశం కోసం అంకితభావంతో పనిచేసింది. కాథ్లీన్ బృందం గనులు, ప్లాంట్లలోని భారీ యంత్రాలు, క్రేన్లను నిర్వహించేవారు. పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్న పట్టించుకోకుండా నిరాటంకంగా పనిచేశారు. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా ఎప్పుడూ ఎటు నుంచి వైమానిక దాడులు జరుగుతాయోనన్న భయంతో హెల్మట్లు ధరించి మరీ విధులు కొనసాగించేవారు. కొన్నాళ్ల తర్వాత విధుల నుంచి తొలగింపబడ్డారు. ఐతే కాథ్లీన్ మౌనంగా ఊరుకోలేదు. ఉక్కుమహిళల వారసత్వాన్ని కాపాడేందుకు ఏడేళ్లు ప్రచారం చేసింది. చివరికి 70 ఏళ్ల తర్వాత ఆమె రచనలు షెఫిల్డ్ విశ్వవిద్యాలయం గుర్తించింది. క్యాథిలిన్ని ఉక్కు కార్మికురాలిగా, ప్రచారకురాలిగా ఆమె చేసిన కృషికి గుర్తింపు లభించడంతో ఆమె గౌరవ డాక్టర్ ఆఫ్ ఇంజనీరింగ్‌ని అందుకుంది. ఈ మేరకు కాథ్లీన్ మాట్లాడుతూ...తనకు ఈ గౌవర డిగ్రీ ఇవ్వనున్నారని తెలిసి ఆశ్చర్యపోయాను. యుద్ధ ప్రయత్నానికి సహకరించిన ఉక్కుమహిళలందరి తరుఫున ఈ గౌరవ డాక్టరేట్‌ని తీసుకోవడం సంతోషంగా ఉంది. చాలా గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఆమె విద్యార్థులకు ఒక విజ్ఞప్తి చేశారు. "మీరు ప్రతీది పుస్తకం నుంచి నేర్చుకోలేరు. కేవలం అనుభవంతోనే కొన్నింటిని తెలుసుకోగలరు అని అన్నారు. అలాగే అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ మీ కలలను సాకారం చేసుకోండి" అని సూచించారు. (చదవండి: ఏడాది వయసు కొడుకుతో ఈ రిక్షా నడుపుతున్న మహిళ: వీడియో వైరల్) -
కబురు వచ్చింది
ఏం చేయాలన్నా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటున్నారు రాధికా ఆప్టే. పరిసర ప్రాంతాలను క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకిలా? అంటే.. ఓ సినిమా కోసం. అందులో ఆమె గూఢచారి అవతారం ఎత్తనున్నారు. ఒక యుద్ధ రహస్యాలను సేకరించే పని చేయనున్నారు. ప్రస్తుతం అందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారామె. హాలీవుడ్లో పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన లిడియా డీన్ పిల్చెర్ దర్శకత్వంలో రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఓ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో ఉమెన్ క్యారెక్టర్స్ స్ట్రాంగ్‌గా ఉంటాయట. ఇందులో స్టానా కాటిక్, సారా మేగాన్ థామస్‌లతో పాటు రాధికా ఆప్టే నటించనున్నారు. లైనస్ రోచే, రోసిఫ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక బ్రిటిష్ ఆఫీసర్ ఇద్దరు అమ్మాయిలను స్పైలుగా ఫ్రాన్స్ పంపిస్తాడు. ఆ తర్వాత ఈ ఇద్దరు అమ్మాయిలు వార్ సీక్రెట్స్‌ను ఎలా సేకరించారు? ఈ మిషన్‌లో వారు ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఏంటి? అన్నదే సినిమా కథనంగా ఉంటుందట. వైర్లెస్ ఆపరేటర్‌ను యూజ్ చేయడంలో మంచి ప్రతిభ ఉండి, ఇండియన్ యాక్సెంట్ ఉన్న నూర్ ఇనయాత్ ఖాన్ పాత్రలో రాధికా ఆప్టే కనిపించనున్నారు. హిందీ, తమిళ, తెలుగులోనూ నటించిన రాధికాకు ఇప్పుడు హాలీవుడ్ నుంచి కబురొచ్చిందన్నమాట. ప్రియాంకా చోప్రా, దీపికా పదుకోన్ హాలీవుడ్ చిత్రాలు చేస్తున్నారు. ఇప్పుడు రాధికా ఆప్టే. ముందు ముందు ఇంకెంతమందో? -
'కంఫర్ట్ ఉమెన్'కు పరిష్కారం
ఏళ్ళ సమస్యకు తెరపడింది. రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి 'కంఫర్ట్ ఉమెన్' సమస్యకు పరిష్కారం దిశగా ఒప్పందం కుదిరింది. దక్షిణ కొరియా, జపాన్ లు తీవ్ర చర్చల అనంతరం అడుగు ముందుకేశాయి. యుద్ధ సమయంలో దక్షిణకొరియా నుంచి మహిళలను బలవంతంగా వ్యభిచార గృహాల్లోకి తరలించిన జపాన్ సైన్యం.. వారిని కంఫర్ట్ ఉమెన్ గా పిలిచేవారు. అయితే ఆ దారుణ కాండకు జపాన్ బాధ్యత వహించాలంటూ దశాబ్దాలుగా కొనసాగుతున్న డిమాండ్ కు ప్రస్తుతం పరిష్కారం కుదిరింది. కంఫర్ట్ ఉమెన్ సమస్యపై ఇరు దేశాలు ప్రత్యేక ఒప్పందాలు చేసుకున్నాయి. గతంలో దక్షిణ కొరియాకు క్షమాపణలు చెప్పిన జపాన్ కొన్నాళ్ళపాటు చర్చలు జరిపినా... ఆ తర్వాత స్థబ్దత ఏర్పడింది. ఇటీవల దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గియాన్ హై... జపాన్ ప్రధాని షింజో అబేతో సమావేశమై తిరిగి చర్చలను పునరుద్ధరించడంతో ఏళ్ళ సమస్యకు చరమగీతం పాడింది. జపాన్ తన ఒప్పందం మేరకు బాధ్యతలను నిర్వర్తిస్తే ఈ సమస్యకు ఇదే చివరి ఒప్పందంగా భావిస్తున్నట్లు సౌత్ కొరియా విదేశాంగ మంత్రి యున్ బైయుంగ్ సే తెలిపారు. జపనీస్ విదేశాంగ మంత్రి ఫ్యుమియో కిషిడాతో చర్చల అనంతరం ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ దళాలు బానిసలుగా చేసుకున్న మహిళలకు (కంఫర్ట్ ఉమెన్) నష్ట పరిహారంగా ఓ బిలియన్ 'ఎన్' లను అందించేందుకు జపాన్ అంగీకరించినట్లు కిషిడా తెలిపారు. నిజానికి ఇది నష్ట పరిహారం కాదని, మహిళల గౌరవాన్నినిలబెట్టేందుకు, వారి మానసిక గాయాలను నయం చేసేందకుగా చెప్పాలని కిషిడా అన్నారు. జపనీస్ సైనిక ప్రమేయంతో జరిగిన కంఫర్ట్ ఉమెన్ సమస్య జపాన్ ప్రభుత్వం బాధ్యతగా పరిగణించిందని ఆయన వివరించారు. బాధితులకు జపాన్ ప్రధాని షింజో అబె క్షమాపణలను తెలపడమే కాక పశ్చాత్తాపాన్నికూడ వ్యక్తం చేసినట్లు కిషిడా తెలిపారు. దక్షిణ కొరియా, జపాన్ ల మధ్య కుదిరిన ఈ ఒప్పందం భవిష్యత్తు లో ఇరు దేశాలమధ్య నూతన శకంగా మారుతుందని కిషిడా అన్నారు. ఈ ఒప్పందం తమ దేశానికి లాభం చేకూర్చడంతోపాటు.. శాంతి, స్థిరాత్వాలను అందించేందుకు దోహద పడుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు ఒప్పందంలో భాగంగా జపనీస్ రాయబార కార్యాలయానికి ముందు కంఫర్ట్ ఉమెన్ కు సాక్ష్యంగా ఉన్న విగ్రహాన్ని సంబంధిత ఎన్జీవోలు సంప్రదింపుల ద్వారా తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి బైయున్ సే అన్నారు. సంవత్సరాంతంలో చర్చలు విజయవంతమవ్వడం, 50వ వార్షికోత్సవం దౌత్య సంబంధాలను మెరుగుపరచడం ఎంతో గర్వంగా ఉందని ఆయన అభిప్రాయ పడ్డారు. జపాన్ ప్రధాని షింజో అబే ఆగస్టులో చేసిన ఓ ప్రసంగంలో రెండో ప్రపంచ యుద్ధం ఎంతో బాధాకరమని, భవిష్యత్ తరాలను ఈ సమస్య ఇబ్బంది పెట్టకూడదన్నారని, అది దృష్టిలో ఉంచుకొనే ఈ సంబంధాలను మెరుగు పరచుకొన్నట్లు బైయున్ తెలిపారు. ప్రస్తుతం ఈ ఒప్పందం విషయాన్ని జపాన్ ప్రధాని షింజో అబే, దక్షిణ కొరియా అధ్యక్షుడు పార్క్ గియాన్ హై తో ఫోన్లో చర్చించినట్లు తెలుస్తోంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సుమారు 200,000 మంది మహిళలు... అందులోనూ ముఖ్యంగా కొరియా మహిళలు జపాన్ బానిసలుగా మారినట్లు అంచనా.