FRI
-
అరటిపండ్లతో బజ్జీ ఎప్పుడైనా ట్రై చేశారు?
అరటికాయ బజ్జీల గురించి విని ఉన్నాం. కానీ అరటి పండుతో కూడా బజ్జీలు వేసుకోవచ్చట. ఇదేంటి పండుతో బజ్జీనా..!అనుకోకండి. చక్కగా బజ్జీలు చేసి తినేయొచ్చట. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఇద్దరు అమ్మాయిలు చక్కగా అరటి గెలను కోసుకొచ్చి ఆయిల్లో డీప్ ఫ్రై చేశారు. వారు గెలతో సహా ఆయిల్లో వేయించారు. ఆ తర్వాత ఆ గెలను ఆయిల్ నుంచి తీసేసి చక్కగా పళ్లు, గెలను వేరు చేశారు. ఆ తర్వాత ఒక్కో అరటి పండును వొలిచి చక్కగా ఓ పాలిథిన్ పేపర్పే పెట్టి మెదిపి దాన్ని ముందుగానే కలిపి ఉంచుకున్న పిండి బేటర్‌లో ముంచి చక్కగా బజ్జీలు మాదిరిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే అరటి పండ్ల బజ్జీ రెడీ..!.అబ్బా ఇలా కూడా అరటిపండ్లతో బజ్జీలు చేసుకోవచ్చా అని అనిపిస్తోంది కదూ..!. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి చూడండి. View this post on Instagram A post shared by Crispyfoodstation (@crispyfoodstation) (చదవండి: రాజ్యసభ ప్రసంగంలో సుధామూర్తి ప్రస్తావించిన సర్వైకల్ వ్యాక్సినేషన్ ఎందుకు? మంచిదేనా?) -
కొత్త ఠాణాలకు ఎఫ్ఐఆర్ అధికారం
న్యాయశాఖ ఆమోదంతో మార్గం సుగమం ఉత్తర్వులు జారీ చేసిన హోంశాఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త జిల్లాలతో పాటే ఏర్పాటైన 92 నూతన పోలీసు స్టేషన్లకు ఎఫ్ఐఆర్ నమోదు చేసే అధికారం ఎట్టకేలకు లభించనుంది. ఈ అంశంపై పోలీసు శాఖ చేసిన ప్రతిపాదనలకు న్యాయశాఖ గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో సబ్ ఇన్స్పెక్టర్లు కొత్తగా ఏర్పడిన పోలీస్స్టేషన్ల పేరిటే ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు అవకాశం లభించనుంది. ఇప్పటివరకు పాత ఠాణాల్లోనే... గతేడాది దసరాకు కొత్త పోలీసు స్టేషన్లు ఏర్పాటై నప్పటికీ వాటి పరిధిలో జరిగిన నేరాలకు సంబం ధించిన కేసులను ఇప్పటివరకు పాత పోలీసు స్టేషన్ల పేరిటే రిజిస్టర్ చేయాల్సి వచ్చింది. దీని వల్ల కొత్త, పాత పోలీసు స్టేషన్ల మధ్య పరిధి వివాదంతోపాటు న్యాయపరంగా సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని ఉన్నతాధికారులు ప్రభుత్వానికి తెలిపారు. దీంతో హోంశాఖ ఎఫ్ఐ ఆర్ నమోదు ఉత్తర్వులను అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు పంపించినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. పాత కేసులు బదిలీ అవుతాయా? పాత పోలీసు స్టేషన్ల పేరుతో మూడున్నర నెలలుగా నమోదవుతున్న కేసులను కొత్త పోలీసు స్టేషన్ల పేరిట బదిలీ చేసుకోవాలా లేదా అవే పోలీసు స్టేషన్ల పరిధితో చార్జిషీట్లు దాఖలు చేయాలా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. నూతనంగా ఏర్పడిన జిల్లాల్లోని కోర్టుల పరిధిలోకి కేసులను బదిలీ చేసుకుంటే సరిపోతుందన్న అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు. -
బాలికపై లైంగికదాడి
న్యూస్‌లైన్ : ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై అదే ప్రాంతానికి చెందిన యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం పశ్చిమ ఢిల్లీలో చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. సఫ్దర్‌జంగ్ ఎన్‌క్లేవ్‌లో నివాసంలో 12వ తరగతి చదువుతున్న బాలిక కుటంబ సభ్యులతో కలిసి ఉంటుంది. ఉదయాన్నే తల్లిదండ్రులు బయటకు వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇది గమనించిన బాలుడు ఉదయం 10 గంటల సమయంలో బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో పొరుగింటికి చెందిన మరో బాలిక అతడిని పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఈ మేరకు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేశారు. బాధితురాలికి వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం సఫ్ధర్‌జంగ్ పోలీసులు ఎఫ్ఐర్ నమోదు చేశారు. విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. -
‘ఆప్’ నేత కుమార్ విశ్వాస్‌పై ఎఫ్ఐఆర్ నమోదు
అమేథీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్‌పై, సిందుర గ్రామ్ ప్రధాన్‌పై శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో ఎఫ్ఐఆర్ నమోదైంది. కాగా అల్లర్లో తమ పార్టీ కార్యకర్తలు ఎవరూ పాల్గొనలేదని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అల్లర్లకు కారణమంటూ ఆప్ నేత చేసిన ఆరోపణలను కాంగ్రెస్ కొట్టిపారేసింది. ఈ విషయమై కమ్రౌలీ పోలీస్ స్టేషన్ అధికారి ఏపీ తివారీ మాట్లాడుతూ.. ఆప్ నేత కుమార్ విశ్వాస్‌తోపాటు ఆ పార్టీకి చెందిన 65 మందిపై కేసు నమోదు చేశాం. అంతేకాక సిందుర గ్రామ్ ప్రధాన్‌పై, అతని అనుచరులు 20 మందిపై కూడా కేసులు నమోదయ్యాయని చెప్పారు.