Monsoon Healthy Diet: వర్షాకాలంలో జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్లు వంటివి సహజం. మరి ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా వర్షపు జల్లులు ఆస్వాదించాలంటే రోగనిరోధక శక్తిని మరింతగా పెంచుకోవాలి. ఇందుకోసం ఏం చేయాలి? ఈ 5 రకాల పండ్లు తింటే మంచి ఫలితం ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
వానా కాలంలోని అసలైన మజాను ఆస్వాదించేందుకు అప్పుడప్పుడూ వేడి వేడి ఛాయ్.. పకోడీలు, బజ్జీలు లాగించినా తరచుగా వీటిని మాత్రం తినడం మరిచిపోవద్దని చెబుతున్నారు.
జామూన్
అల్ల నేరేడు పండ్లంటే ఇష్టపడని వారు అరుదు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేయడంలో తోడ్పడుతుంది. ఇందులోని కొలాజెన్ కాంతివంతమైన మెరిసే చర్మానికి కారణమవుతుంది. విటమిన్ బి, సీతో పాటు కాల్షియం, ఐరన్ కలిగి ఉంటుంది జామూన్.
యాపిల్
రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన పనే లేదంటారు.యాపిల్‌లో ఉండే ఆరోగ్య కారకాలు అలాంటివి మరి! ఇందులో విటమిన్ సీ, ఫ్లావనాయిడ్స్ అధికం. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో తోడ్పడతాయి.
దానిమ్మ
దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు మెండు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలనుకున్న వారు దానిమ్మ పండ్లు తింటే సరి. నిజానికి డిటాక్సిఫికేషన్(శరీరంలో విష పదార్థాలు తొలగించడం)లో గ్రీన్ టీ తాగడం కంటే.. దానిమ్మ తినడం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని సెలబ్రిటీ న్యూట్రీషనిస్ట్ ల్యూక్ కౌటినో చెబుతున్నారు.
అరటిపండు
అందరికీ అందుబాటు ధరలో ఉంటే అరటిపండులో విటమిన్ బీ6 ఎక్కువ. ఇది రోగ నిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయడంలో తోడ్పడుతుంది. ఇక అరటిపండును నేరుగా తినడం ఇష్టపడని వాళ్లు చక్కగా స్మూతీలు, షేక్స్ చేసుకుని తాగితే బెటర్.
చదవండి: Banana Milkshake: బరువు తగ్గాలా.. తియ్యటి పెరుగు, చల్లని పాలు.. ఇది తాగితే!
పియర్స్(బేరి పండు)
పియర్స్‌లో పొటాషియం, విటమిన్ సీ అధికం. దీని తొక్క కూడా ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫ్లావనాయిడ్స్ ఎక్కువ. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేయడంలో తన వంతు పాత్ర పోషిస్తుంది.
చదవండి: Rainy Season Healthy Diet: వర్షాకాలం.. పచ్చి ఆకు కూరలు, సీ ఫుడ్ వద్దు.. ఇవి తినండి!
Comments
Please login to add a commentAdd a comment