అరటిపండు అన్ని సీజన్లలోనూ దొరుకుతుంది. మిగతా పండ్లతో పోలిస్తే ఒకింత చవక కూడా. ఇందులోని అనేక రకాల పోషకాలతో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాలూ ఎక్కువే. అరటితో ఆరోగ్యానికి కలిగే లాభాల్లో కొన్ని..!
►అరటిపండులో పొటాషియమ్ ఎక్కువ. పొటాషియమ్ అధిక రక్తపోటు (హైబీపీ)ని నియంత్రిస్తుంది. అందుకే హైబీపీ ఉన్నవారికి అరటిపండు చాలా మేలు చేస్తుంది. ఇందులోని పొటాషియమ్ మన మూత్రపిండాల ఆరోగ్య నిర్వహణకు కూడా బాగా తోడ్పడుతుంది
►అరటిపండులో అనేక రకాల ఖనిజలవణాలు ఉంటాయి. ఈ వేసవికాలంలో ఒంట్లో ఖనిజలవణాలు తగ్గి మాటిమాటికీ కండరాలు పట్టేస్తున్న వారు అరటిపండు తింటే మంచిది. అందులోని ఖనిజలవణాల కారణంగా అరటిపండ్లు తింటే ఆ సమస్య తగ్గుతుంది. ఈ కారణం వల్లనే బాగా చెమటను కోల్పోయే ఆటగాళ్లు తాము కోల్పోయే ఖనిజలవణాలను భర్తీ చేసుకోడానికి ఆటమధ్యలో తరచూ అరటిపండు తింటుండటం మనం టెన్నిస్, బ్యాడ్‌మింటన్ లాంటి ఆటల్లో చూస్తుంటాం. వ్యాయామం తర్వాత రెండు అరటిపండ్లు తింటే వ్యాయామ సమయంలో కోల్పోయిన శక్తి త్వరగా భర్తీ అవుతుంది. అంతేగాక వ్యాయామ అనంతరం మనకు సమకూరే ఆరోగ్యాన్ని చాలాకాలం పాటు పదిలంగా కొనసాగేలా చూస్తుంది
►అరటి పండులోని విటమిన్ సి, విటమిన్ బి6... గుండె ఆరోగ్యాన్ని కాపాడేందుకు దోహదపడతాయి
►ఆస్తమా ఉన్నవారు అరటిపండు తినకూడదనే అభిప్రాయం ఉంది. కానీ అది కేవలం అపోహ మాత్రమే. కాలేజ్ ఆఫ్ లండన్‌కు చెందిన పరిశోధకుల అధ్యయనం ప్రకారం... చిన్నప్పుడు అరటిపండ్లు పుష్కలంగా తిని పెరిగిన పిల్లల్లో ఆస్తమా వచ్చే అవకాశాలు 34 శాతం తగ్గుతాయని నిరూపణ అయ్యింది
►అరటిపండు జీర్ణశక్తిని పెంచి, ఆహారం తేలిగ్గా జీర్ణమయ్యేలా చూస్తుంది. జీర్ణకోశ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ పండ్లు మలబద్దకం లాంటి సమస్యలనూ నివారిస్తాయి
►అరటిపండులోని అమైనో యాసిడ్స్ అద్భుతమైన జ్ఞాపకశక్తికి, మెదడు చురుకుగా పనిచేయడానికి ఉపయోగపడతాయి.
డజనుకు రెండు డజన్ల మేలు
Published Thu, May 30 2019 1:49 AM | Last Updated on Thu, May 30 2019 1:49 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment