Hypokalemia
-
డజనుకు రెండు డజన్ల మేలు
అరటిపండు అన్ని సీజన్లలోనూ దొరుకుతుంది. మిగతా పండ్లతో పోలిస్తే ఒకింత చవక కూడా. ఇందులోని అనేక రకాల పోషకాలతో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాలూ ఎక్కువే. అరటితో ఆరోగ్యానికి కలిగే లాభాల్లో కొన్ని..! ►అరటిపండులో పొటాషియమ్ ఎక్కువ. పొటాషియమ్ అధిక రక్తపోటు (హైబీపీ)ని నియంత్రిస్తుంది. అందుకే హైబీపీ ఉన్నవారికి అరటిపండు చాలా మేలు చేస్తుంది. ఇందులోని పొటాషియమ్ మన మూత్రపిండాల ఆరోగ్య నిర్వహణకు కూడా బాగా తోడ్పడుతుంది ►అరటిపండులో అనేక రకాల ఖనిజలవణాలు ఉంటాయి. ఈ వేసవికాలంలో ఒంట్లో ఖనిజలవణాలు తగ్గి మాటిమాటికీ కండరాలు పట్టేస్తున్న వారు అరటిపండు తింటే మంచిది. అందులోని ఖనిజలవణాల కారణంగా అరటిపండ్లు తింటే ఆ సమస్య తగ్గుతుంది. ఈ కారణం వల్లనే బాగా చెమటను కోల్పోయే ఆటగాళ్లు తాము కోల్పోయే ఖనిజలవణాలను భర్తీ చేసుకోడానికి ఆటమధ్యలో తరచూ అరటిపండు తింటుండటం మనం టెన్నిస్, బ్యాడ్మింటన్ లాంటి ఆటల్లో చూస్తుంటాం. వ్యాయామం తర్వాత రెండు అరటిపండ్లు తింటే వ్యాయామ సమయంలో కోల్పోయిన శక్తి త్వరగా భర్తీ అవుతుంది. అంతేగాక వ్యాయామ అనంతరం మనకు సమకూరే ఆరోగ్యాన్ని చాలాకాలం పాటు పదిలంగా కొనసాగేలా చూస్తుంది ►అరటి పండులోని విటమిన్ సి, విటమిన్ బి6... గుండె ఆరోగ్యాన్ని కాపాడేందుకు దోహదపడతాయి ►ఆస్తమా ఉన్నవారు అరటిపండు తినకూడదనే అభిప్రాయం ఉంది. కానీ అది కేవలం అపోహ మాత్రమే. కాలేజ్ ఆఫ్ లండన్‌కు చెందిన పరిశోధకుల అధ్యయనం ప్రకారం... చిన్నప్పుడు అరటిపండ్లు పుష్కలంగా తిని పెరిగిన పిల్లల్లో ఆస్తమా వచ్చే అవకాశాలు 34 శాతం తగ్గుతాయని నిరూపణ అయ్యింది ►అరటిపండు జీర్ణశక్తిని పెంచి, ఆహారం తేలిగ్గా జీర్ణమయ్యేలా చూస్తుంది. జీర్ణకోశ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ పండ్లు మలబద్దకం లాంటి సమస్యలనూ నివారిస్తాయి ►అరటిపండులోని అమైనో యాసిడ్స్ అద్భుతమైన జ్ఞాపకశక్తికి, మెదడు చురుకుగా పనిచేయడానికి ఉపయోగపడతాయి. -
కడుపు నిండుతుంది బరువు తగ్గుతుంది
ముంజలు తినడానికే కాదు... ఒకింత పారదర్శకంగా, చేతుల్లోంచి జారిపోతూ చూడటానికి కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. ముంజలను ఇంగ్లిష్‌లో ‘ఐస్ ఆపిల్’ అంటారు. ముంజలు తినడం వల్ల ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాల జాబితాకు అంతే లేదు. వాటిలో కొన్ని. ముంజల్లో నీటిపాళ్లు ఎక్కువగా ఉండటం వల్ల తినగానే కడుపు నిండిపోతుంది. కాబట్టి ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనుకున్నవారికి ముంజలు ఒక రుచికరమైన మంచి మార్గం. ముంజలు వికారాన్ని సమర్థంగా నివారిస్తాయి. ముంజలు మలబద్దకాన్ని నివారించి, సుఖవిరేచనమయ్యేలా చూస్తాయి. ఇలా ఇవి అందరిలోనూ మలబద్దకాన్ని నివారించి, దానివల్ల వచ్చే ఎన్నో అనర్థాలు రాకుండా చూస్తాయి. అయితే గర్భవతుల్లో మలబద్దకం చాలా సాధారణం కాబట్టి ముంజలు తినడం వల్ల వారికి మంచి ప్రయోజనం ఉంది. వడదెబ్బ నుంచి రక్షించే రుచికరమైన మంచి మార్గం ముంజలే. వాటిల్లో స్వాభావికంగా ఎక్కువగా ఉండే నీటిపాళ్లు, పుష్కలంగా ఉండే ఖనిజలవణాలు.. వ్యక్తులను ఎండదెబ్బ వల్ల కలిగే డీ–హైడ్రేషన్నుంచి రక్షిస్తాయి. చికెన్‌పాక్స్‌తో బాధపడేవారికి ముంజలు స్వాభావికమైన ఔషధం అని చెప్పవచ్చు. జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనేక సమస్యలను ముంజలు నివారిస్తాయి. ముంజలు ఒంట్లో పేరుకొనిపోయిన విషాలను సమర్థంగా తొలగిస్తాయి. ఫలితంగా ఇవి కాలేయంపై పడే ఒత్తిడిని తొలగించి, కాలేయానికి మంచి ఆరోగ్యాన్ని సమకూరుస్తాయి. ఇలా విషాలను తొలగించడానికి ముంజల్లోని పొటాషియమ్ బాగా ఉపయోగపడుతుంది. ముంజల్లో పొటాషియమ్ పాళ్లు పుష్కలంగా ఉండటం వల్ల అవి రక్తపోటును కూడా సమర్థంగా నివారిస్తాయి. ముంజల్లో చలవచేసే గుణం ఉన్నందువల్ల వేసవిలో వచ్చే గడ్డలను నివారిస్తాయి. ఒకవేళ గడ్డలు వచ్చినా అవి ముంజలు తినేవారిలో త్వరగా తగ్గిపోతాయి. అంతేకాదు.. ముంజలతో చలవ చేసే ఆ గుణమే చెమటకాయలనూ తగ్గిస్తుంది. ముంజల్లోని యాంటా ఆక్సిడెంట్స్ వల్ల అవి రొమ్ముక్యాన్సర్‌ను సమర్థంగా నివారిస్తాయి. ముంజల్లో పుష్కలంగా ఉండే ఫైటోకెమికల్స్ వల్ల వయసు పైబడటంతో కనిపించే లక్షణాలు తగ్గుతాయి. దీర్ఘకాలం యౌవనంగా ఉండటం సాధ్యపడుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల ఏర్పడే క్లాట్స్‌ను ముంజలు నివారిస్తాయి. దాంతో గుండెజబ్బులు తగ్గిపోతాయి. గుండెపోటు ముప్పు దూరమవుతుంది. -
హెల్దీ పెసలు
గుడ్‌ఫుడ్ విదేశాల్లో పెసలను కేవలం మొలకలుగానే తింటారుగానీ... అనాదిగా మనం పెసరపప్పును ప్రధానహారాల్లో ఒకటిగా ఉపయోగిస్తున్నాం. తన పొట్టులో సైతం అనేక పోషకాలు కలిగి ఉన్న పెసరగింజల ప్రయోజనాల్లో కొన్ని... ⇒పెసర్లలో పీచు పాళ్లు చాలా ఎక్కువ. అందుకే జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి ఇవి ఎంతగానో మేలుచేస్తాయి. మలబద్దకాన్ని నివారించి, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అంతేకాదు, ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి పెసర్లు బాగా తోడ్పడతాయి. పెసర్లు ఒంట్లోని కొవ్వులు, కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుతాయి. ⇒పెసర్లలో పొటాషియమ్ పాళ్లు ఎక్కువ. అందుకే హైబీపీని తగ్గించేందుకు ఇవి బాగా ఉపయగపడతాయి. ⇒చికెన్‌లో కంటే పెసర్ల నుంచి లభ్యమయ్యే ప్రోటీన్ పాళ్లు చాలా ఎక్కువ. జంతువుల నుంచి లభ్యమయ్యే ప్రోటీన్లతో పాటు బీన్స్ వంటి ఇతర వనరుల నుంచి దొరికే ప్రోటీన్లు కూడా తినాలని అమెరికన్ డయటరీ గైడ్‌లైన్స్ చేసే సిఫార్సు. ఆ కోణంలో పెసర్లు మంచి ప్రత్యామ్నాయం.