హెల్దీ పెసలు | Hedge stools | Sakshi
Sakshi News home page

హెల్దీ పెసలు

Published Tue, Jun 13 2017 11:08 PM | Last Updated on Tue, Sep 5 2017 1:31 PM

హెల్దీ పెసలు

హెల్దీ పెసలు

గుడ్‌ఫుడ్‌

విదేశాల్లో పెసలను కేవలం మొలకలుగానే తింటారుగానీ... అనాదిగా మనం పెసరపప్పును ప్రధానహారాల్లో ఒకటిగా ఉపయోగిస్తున్నాం. తన పొట్టులో సైతం అనేక పోషకాలు కలిగి ఉన్న పెసరగింజల ప్రయోజనాల్లో కొన్ని...

⇒పెసర్లలో పీచు పాళ్లు చాలా ఎక్కువ. అందుకే జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి ఇవి ఎంతగానో మేలుచేస్తాయి. మలబద్దకాన్ని నివారించి, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అంతేకాదు, ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి పెసర్లు బాగా తోడ్పడతాయి.  పెసర్లు ఒంట్లోని కొవ్వులు, కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుతాయి.

⇒పెసర్లలో పొటాషియమ్‌ పాళ్లు ఎక్కువ. అందుకే హైబీపీని తగ్గించేందుకు ఇవి బాగా ఉపయగపడతాయి.

⇒చికెన్‌లో కంటే పెసర్ల నుంచి లభ్యమయ్యే ప్రోటీన్‌ పాళ్లు చాలా ఎక్కువ. జంతువుల నుంచి లభ్యమయ్యే ప్రోటీన్లతో పాటు బీన్స్‌ వంటి ఇతర వనరుల నుంచి దొరికే ప్రోటీన్లు కూడా తినాలని అమెరికన్‌ డయటరీ గైడ్‌లైన్స్‌ చేసే సిఫార్సు. ఆ కోణంలో పెసర్లు మంచి ప్రత్యామ్నాయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement