Mung
-
Beauty: పెసలను రాత్రంతా నానబెట్టి.. గ్రైండ్ చేసి.. ఇలా మర్ధనా చేస్తే!
పెసలతో ఆరోగ్యమే కాదు.. అందాన్ని పొందవచ్చు. ఇంట్లోనే ఈ సులువైన చిట్కాలు పాటించి నునుపైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. ►టేబుల్ స్పూన్ పెసలను రాత్రంతా నానబెట్టి ఉదయం మెత్తగా గ్రైండ్ చేసి అందులో అర టీ స్పూన్ నెయ్యి లేదా పాలు వేసి కలిపి ముఖానికి పట్టించి మర్దన చేసి పది నిమిషాల సేపు మిశ్రమాన్ని ముఖం మీద ఉంచాలి. ►ఈ ప్యాక్ పూర్తిగా ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో కడగాలి. ఇలా చేస్తే పొడిబారిన చర్మం ఆరోగ్యంగా, నునుపుగా మారుతుంది. ఆయిల్ స్కిన్ వాళ్లయితే పెసర పేస్ట్‌లో కొద్దిగా మజ్జిగ లేదా పన్నీరు కలుపుకోవాలి. ►ఎండకు కమిలిపోయిన చర్మం తిరిగి మామూలు కావాలంటే... పైన చెప్పుకొన్న పెసల పేస్టులో చల్లటి పెరుగు లేదా కలబంద పేస్టు కలిపి ముఖానికి, చేతులకు, పాదాలకు పట్టించి ఐదు నిమిషాల సేపు మర్దన చేయాలి. ఆరిపోయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి. హెయిర్ ఫాల్ తగ్గాలంటే... రాత్రంతా నానబెట్టిన పెసలను గ్రైండ్ చేసి అందులో కోడిగుడ్డు సొన, టేబుల్ స్పూన్ నిమ్మరసం, కప్పు పెరుగు కలిపి చిక్కటి పేస్టు చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి 15నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఈ మూంగ్‌దాల్ ప్యాక్‌ను నూనె రాసిన జుట్టుకు పట్టించకూడదు. షాంపూతో తలస్నానం చేసి ఆరిన తర్వాత మాత్రమే వేయాలి. చదవండి: Pomegranate: 3 నెలల పాటు ప్రతిరోజు తింటే! ఇక తొక్కలు పొడి చేసి నీళ్లలో కలిపి తాగారంటే.. Nora Fatehi: భోజనంలో అవి ఉండాల్సిందే! రోజూ ఆయిల్ మసాజ్.. నా బ్యూటీ సీక్రెట్ ఇదే! -
Beauty Tips: ముఖారవిందానికి పప్పుల ఫేస్ ప్యాక్స్!
ముఖం అందంగా మెరిసిపోవాలని అందరూ కోరుకుంటుంటారు. దీనికోసం మార్కెట్లో దొరికే రసాయన క్రీములన్నీ వాడేస్తుంటారు. ఇవి కొన్నిసార్లు దుష్ప్రభావాలు చూపించి ఉన్న అందాన్ని కోల్పోయేలా చేస్తాయి. అయితే ఎటువంటి రసాయనాలు వాడకుండా మనింట్లో ఉండే పప్పులతో ఫేస్ ప్యాక్‌లు ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం.. శనగపప్పు మూడు టీస్పూన్ల పచ్చిశనగపప్పును రాత్రంతా నానబెట్టుకుని, ఉదయం నీళ్లు తీసేసి రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, టీస్పూను నిమ్మరసం, తేనె వేసి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టుని ముఖానికి అప్లై చేసి ఆరాక కడిగేయాలి. తరువాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ వేయడం వల్ల ముఖం మీద జిడ్డు, నల్లమచ్చలు, మొటిమలు తగ్గుముఖం పడతాయి. చదవండి: అందుకే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుందట..! ఇలా చేస్తే ప్రాణాలు నిలుపుకోవచ్చు.. మసూర్‌దాల్ కప్పు ఎర్రకందిపప్పు (మసూర్‌దాల్) తీసుకుని దానిలో ముప్పావు కప్పు పచ్చిపాలు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయం ఈ పప్పుని పేస్టులా గ్రైండ్ చేయాలి. ముఖాన్ని కడిగి ఈ పేస్టుని అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తరువాత ముఖంపై వలయాకారంలో మర్దనచేసి నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్ ముఖం మీద పేరుకుపోయిన ట్యాన్‌ను తగ్గించి, ముఖం కాంతిమంతంగా కనిపించేలా చేస్తుంది. పెసరపప్పు అరకప్పు పెసరపప్పుని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పేస్టులా రుబ్బుకోవాలి. దీనికి టేబుల్ స్పూను పెరుగు, టేబుల్ స్పూన్ అలోవెరా జెల్‌ను కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పదినిమిషాల తరువాత నీటితో మర్దన చేసి, కడిగేయాలి. ఈ ప్యాక్‌తో విటమిన్ ఏ, సీలు ముఖారవిందాన్ని మరింత మెరిపిస్తాయి. చదవండి: ఈ వ్యాయామం క్రమంతప్పకుండా చేస్తే ఆయుష్షు పెరుగుతుందట! -
మహాభాగ్యం మొలకెత్తినట్లే!
మొలకెత్తిన ధాన్యాలు తినడం ఆరోగ్యకరం అని తెలిసిందే. ఇటీవల చాలామంది మొలకెత్తిన ధాన్యాలు తింటున్నారు. ప్రత్యేకించి మొలకెత్తిన పెసలతో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. అవి ఏమిటో చూద్దాం.జుట్టు రాలిపోయి, పలచబడేవారికి మొలకెత్తిన పెసలు స్వాభావిక చికిత్స అనుకోవచ్చు. వాటితో జుట్టు కూడా మళ్లీ మొలకెత్తే అవకాశాలు ఎక్కువ. మొలకెత్తే పెసలలో పుష్కలంగా ఉండే విటమిన్–ఏ రోమాంకురాలను ప్రేరేపించి (హెయిర్ ఫాలికిల్స్ను స్టిమ్యులేట్ చేసి) మళ్లీ జుట్టును మొలిపించే అవకాశం ఉంది. అంతేకాదు... రోమాంకురాలకు సరఫరా అయ్యే రక్తనాళాల (క్యాపిల్లరీస్)ను కూడా ఈ మొలకలు ప్రేరేపిస్తాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది.పైన చెప్పుకున్నట్లు మొలకెత్తే పెసర్లలో పుష్కలంగా ఉన్న విటమిన్–ఏ వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది. వయసు పెరగడం వల్ల వచ్చే మాలిక్యులార్ డిజనరేషన్‌తో పాటు ఎన్నో రకాల కంటి వ్యాధులు నివారితమవుతాయి. వయసు పెరుగుతుండటం (ఏజింగ్)తో కనపడే ఎన్నో లక్షణాలను ఈ మొలకలు నివారిస్తాయి. జుట్టు తెల్లబడటం, జుట్టు రాలిపోవడం, చర్మం ముడతలు పడటం వంటి ఏజింగ్ పరిణామాలను అరికట్టి దీర్ఘకాలం యౌవనంగా ఉండేలా చూస్తాయి. పెసర మొలకలు మంచి ప్రోటీన్లకు నెలవు. ఎప్పటికప్పుడు కండరాలను రిపేర్ చేస్తుండటం వల్ల దీర్ఘకాలం పాటు కండరాలు మంచి పటుత్వంతో బలంగా ఉంటాయి. మొలకెత్తే పెసలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల రక్తహీనతతో బాధపడేవారికి ఇవి రక్తాన్ని భర్తీ చేస్తాయి. జుట్టు పెరుగుదలకు అవసరమైన ఐరన్నూ సమకూర్చడం వల్ల కూడా ఇవి జుట్టును మళ్లీ మొలిపించడానికి దోహదపడతాయి. మహిళల్లో హార్మోన్ల సమతౌల్యతకు పెసర మొలకలు సహాయం చేస్తాయి. చర్మంలోని కొత్త కణాల పుట్టుకను వేగవంతం చేయడం వల్ల పెసర మొలకలతో మేని మెరుపు, మంచి నిగారింపు వస్తుంది. చర్మక్యాన్సర్ వంటి వ్యాధులనూ ఈ మొలకలు నివారిస్తాయి. చర్మంలోని తేమను తగ్గకుండా చేస్తే హైడ్రేటింగ్ ఏజెంట్స్‌గా కూడా పెసర మొలకలు పనిచేస్తాయి. జీవక్రియల కారణంగా ఒంట్లో పేరుకుపోయే ఎన్నో రకాల విషాలను పెసర మొలకలు చాలా వేగంగా బయటకు వెళ్లేలా చూస్తాయి. అందుకే వీటిని మంచి డీ–టాక్సిఫయింగ్ ఏజెంట్లుగా చెప్పవచ్చు. గర్భవతులకు ఇవి చాలా మేలు చేస్తాయి. గర్భధారణ సమయంలో వీటిని ‘ప్రెగ్నెన్సీ ప్రోటీన్ పవర్‌హౌజ్’గా పరిగణిస్తారు. వీటిలో పోషకాలు చాలా ఎక్కువ. అయితే క్యాలరీలు చాలా తక్కువ. అందుకే బరువు తగ్గాలనుకునేవారికి ఆరోగ్యకరమైన ఆహారం ఈ పెసర మొలకలు. అన్ని రకాల విటమిన్లు, ఖనిజలవణాల కారణంగా ఇవి ఒంటికి మంచి రోగనిరోధక శక్తిని ఇస్తాయి. -
పెరిగే వయసును ఆపే పెసలు!
పెసలు ఆకుపచ్చగా ఉండటంతో ఇంగ్లిష్‌లో వాటిని గ్రీన్‌గ్రామ్స్ అంటారు. తమ గింజ రంగుతో ఆరోగ్యానికి పచ్చసిగ్నల్‌ను చూపడంతో పాటు పెరిగే వయసుకు ఎర్రజెండా చూపిస్తాయవి. పైగా వేసవిలో పెసలు చలవచేస్తాయని అంటారు మన పెద్దలు. ఆ మాటతో పాటు... పెసలు ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తాయని చాలా అధ్యయనాల్లో నిరూపితమైంది. పెసలుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని... ♦ పెసలులో చాలా రకాల విటమిన్లు, ఖనిజలవణాలు ఉంటాయి. అవి వయసు పెరగడం వల్ల వచ్చే మార్పులను చాలాకాలం పాటు కనపడనివ్వవు. చర్మాన్ని మిలమిలలాడేలా చేసి, మంచి నిగారింపు ఇస్తాయి. ఏజింగ్ ప్రక్రియను ఆలస్యం చేసేందుకు దోహదపడే పదార్థాలలో పెసలు చాలా ముఖ్యమైనవి. ♦ వయసు పెరుగుతున్నప్పుడు కనిపించే ముడుతలను పెసలులోని కాపర్ రాకుండా చేస్తుంది. అలాగే పెసలు కంటికింద, దగమ కింద చర్మం వేలాడటాన్ని చాలా ఆలస్యం చేస్తాయి. డబుల్ చిన్ను నివారిస్తాయి. ♦ హైబీపీ ఉన్నవారు పెసరపప్పు వాడటం ఎంతో మంచిది. ఇందులో పొటాషియమ్ ఎక్కువ. అందుకే హైబీపీని నియంత్రించేందుకు పెసలు ఉపయగపడతాయి. ♦ పెసలు ఒంట్లోని కొవ్వులు, కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుతాయి. రక్తప్రసరణను సాఫీగా అయ్యేలా చేసి గుండె ఆరోగ్యాన్ని పదికాలాలు పదిలంగా ఉంచుతాయి. ♦ పెసల్లో పీచు పాళ్లు చాలా ఎక్కువ. జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడే ప్రోబయోటిక్ అంశాలూ ఎక్కువే. పెసలు మలబద్ధకాన్ని నివారించి, జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి అవి బాగా ఉపయోగపడతాయి. ♦ పెసల్లో ఐరన్ పాళ్లు చాలా ఎక్కువ. అనీమియాను దూరం చేసుకోడానికి పెసలు వాడకం స్వాభావికమైన వైద్యచికిత్సగా పరిగణించవచ్చు. -
హెల్దీ పెసలు
గుడ్‌ఫుడ్ విదేశాల్లో పెసలను కేవలం మొలకలుగానే తింటారుగానీ... అనాదిగా మనం పెసరపప్పును ప్రధానహారాల్లో ఒకటిగా ఉపయోగిస్తున్నాం. తన పొట్టులో సైతం అనేక పోషకాలు కలిగి ఉన్న పెసరగింజల ప్రయోజనాల్లో కొన్ని... ⇒పెసర్లలో పీచు పాళ్లు చాలా ఎక్కువ. అందుకే జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి ఇవి ఎంతగానో మేలుచేస్తాయి. మలబద్దకాన్ని నివారించి, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అంతేకాదు, ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి పెసర్లు బాగా తోడ్పడతాయి. పెసర్లు ఒంట్లోని కొవ్వులు, కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుతాయి. ⇒పెసర్లలో పొటాషియమ్ పాళ్లు ఎక్కువ. అందుకే హైబీపీని తగ్గించేందుకు ఇవి బాగా ఉపయగపడతాయి. ⇒చికెన్‌లో కంటే పెసర్ల నుంచి లభ్యమయ్యే ప్రోటీన్ పాళ్లు చాలా ఎక్కువ. జంతువుల నుంచి లభ్యమయ్యే ప్రోటీన్లతో పాటు బీన్స్ వంటి ఇతర వనరుల నుంచి దొరికే ప్రోటీన్లు కూడా తినాలని అమెరికన్ డయటరీ గైడ్‌లైన్స్ చేసే సిఫార్సు. ఆ కోణంలో పెసర్లు మంచి ప్రత్యామ్నాయం.