పెసలు ఆకుపచ్చగా ఉండటంతో ఇంగ్లిష్‌లో వాటిని గ్రీన్‌గ్రామ్స్ అంటారు. తమ గింజ రంగుతో ఆరోగ్యానికి పచ్చసిగ్నల్‌ను చూపడంతో పాటు పెరిగే వయసుకు ఎర్రజెండా చూపిస్తాయవి. పైగా వేసవిలో పెసలు చలవచేస్తాయని అంటారు మన పెద్దలు. ఆ మాటతో పాటు... పెసలు ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తాయని చాలా అధ్యయనాల్లో నిరూపితమైంది. పెసలుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని...
♦ పెసలులో చాలా రకాల విటమిన్లు, ఖనిజలవణాలు ఉంటాయి. అవి వయసు పెరగడం వల్ల వచ్చే మార్పులను చాలాకాలం పాటు కనపడనివ్వవు. చర్మాన్ని మిలమిలలాడేలా చేసి, మంచి నిగారింపు ఇస్తాయి. ఏజింగ్ ప్రక్రియను ఆలస్యం చేసేందుకు దోహదపడే పదార్థాలలో పెసలు చాలా ముఖ్యమైనవి.
♦ వయసు పెరుగుతున్నప్పుడు కనిపించే ముడుతలను పెసలులోని కాపర్ రాకుండా చేస్తుంది. అలాగే పెసలు కంటికింద, దగమ కింద చర్మం వేలాడటాన్ని చాలా ఆలస్యం చేస్తాయి. డబుల్ చిన్‌ను నివారిస్తాయి.
♦ హైబీపీ ఉన్నవారు పెసరపప్పు వాడటం ఎంతో మంచిది. ఇందులో పొటాషియమ్ ఎక్కువ. అందుకే హైబీపీని నియంత్రించేందుకు పెసలు ఉపయగపడతాయి.
♦ పెసలు ఒంట్లోని కొవ్వులు, కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుతాయి. రక్తప్రసరణను సాఫీగా అయ్యేలా చేసి గుండె ఆరోగ్యాన్ని పదికాలాలు పదిలంగా ఉంచుతాయి.
♦ పెసల్లో పీచు పాళ్లు చాలా ఎక్కువ. జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడే ప్రోబయోటిక్ అంశాలూ ఎక్కువే. పెసలు మలబద్ధకాన్ని నివారించి, జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి అవి బాగా ఉపయోగపడతాయి.
♦ పెసల్లో ఐరన్ పాళ్లు చాలా ఎక్కువ. అనీమియాను దూరం చేసుకోడానికి పెసలు వాడకం స్వాభావికమైన వైద్యచికిత్సగా పరిగణించవచ్చు.
పెరిగే వయసును ఆపే పెసలు!
Published Mon, Apr 23 2018 12:02 AM | Last Updated on Mon, Apr 23 2018 12:02 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment