పందిరికి భక్తులు వేలాడదీసిన అరటి గెలలు
సాక్షి, సంతబొమ్మాళి (శ్రీకాకుళం): కోరిన కోర్కెలు నెరవేర్చే దైవానికి వస్తు రూపేణ, ధన రూపేణ భక్తులు మొక్కులు చెల్లించటం మామూలే. అయితే శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం చెట్లతాండ్రలో వెలసిన లక్ష్మీనరసింహస్వామికి భక్తులు మొక్కులు చెల్లించే విధానం కాస్త ప్రత్యేకం. స్వామివారికి ప్రతి ఏటా అరటిగెలల ఉత్సవం నిర్వహించి, ఆలయ ప్రాంగణంలో అరటిగెలలు వేలాడదీసి మొక్కులు చెల్లించటం ఇక్కడ ఆనవాయితీ.
శనివారం జరిగిన ఈ ఉత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు గెలలు కట్టి మొక్కులు తీర్చుకున్నారు. సమారు 5 వేలకుపైగా గెలలతో ఆలయ ప్రాంగణం అంతా అరటిమయం అయ్యింది. ఆలయంలో అరటి గెల కట్టిన భక్తులకు రశీదు అందజేస్తారు. రెండు రోజుల తర్వాత తిరిగి ఎవరి గెలను వారికి ఇచ్చేస్తారు. ఆ గెలను ఇంటిల్లిపాదీ ప్రసాదంగా స్వీకరిస్తారు. కొందరు పానకంగా తయారు చేసి పంపిణీ చేస్తారని స్థానికులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment