తెగుళ్లు తట్టుకునే రకాల సాగు
ఆత్రేయపురం : రైతులు తెగుళ్లు తట్టుకునే అరటి రకాలు సాగుచేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని కొవ్వూరు అరటి పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బలుసు వెంకట కృష్ణ భగవాన్ పేర్కొన్నారు. ఆత్రేయపురం అల్లూరి సీతారామరాజు సెంటర్‌లో సోమవారం అరటి యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. డాక్టర్ భగవాన్ మాట్లాడుతూ నాణ్యమైన అరటి గెలలు పండించి
కొవ్వూరు అరటి పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త భగవాన్ సూచన
ఆత్రేయపురం : రైతులు తెగుళ్లు తట్టుకునే అరటి రకాలు సాగుచేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని కొవ్వూరు అరటి పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బలుసు వెంకట కృష్ణ భగవాన్ పేర్కొన్నారు. ఆత్రేయపురం అల్లూరి సీతారామరాజు సెంటర్‌లో సోమవారం అరటి యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. డాక్టర్ భగవాన్ మాట్లాడుతూ నాణ్యమైన అరటి గెలలు పండించి రైతులు గిట్టుబాటు« ధరలు పొందవచ్చునన్నారు. గతంలో అమృతపాణి అరటి రకం పనామా తెగుళ్ల కారణంగా నాశనమైందన్నారు. ప్రస్తుతం కర్పూర దుంప కుళ్లు వ్యా«ధులను తట్టుకుంటుందన్నారు. దుంపుకుళ్లు తెగులు నేలలో ప్రవేశించి 20 సంవత్సరాలు పాటు సజీవంగా ఉంటుందని కొన్ని అరటి రకాలపై ప్రవేశించి వ్యాధులు కలగజేస్తుందన్నారు. ప్రస్తుతం కొవ్వూరు పరిశోధన కేంద్రంలో యాంగ్‌గామ్‌బి కెఎమ్–5 రకం తెగుళ్లను తట్టుకుంటుందని రైతులు ఈ రకాన్ని సాగుచేసుకోవచ్చునన్నారు. అమలాపురం ఉద్యానవనశాఖ సహాయ సంచాలకులు సీహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు గ్రూపులుగా ఏర్పడి అరటి గెలలను హెచ్చుధరలకు అమ్ముకోవచ్చునని అందుకు ఉద్యానశాఖ సహాయం అందిస్తుందని తెలిపారు. రాష్ట్ర ఆత్మా సభ్యులు, అభ్యుదయ రైతు దండు సత్యనారాయణరాజు, హైదారాబాద్ ఆషిమా ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఫెడరిక్ రాచ్చిట్ ప్రసంగించారు. స్థానిక ఉద్యానశాఖ అధికారిణి ఎం.బబిత, కోకో మోడల్ జీ కంపెనీ ప్రతినిధి సత్యనారాయణ, ఎంపీఈవోలు వినో«ద్‌శాలినీ ప్రసాద్, బాబాయ్ , తాడేపల్లిగూడెం వైఎస్సార్ యూనివర్సిటీ విద్యార్థులు కె.శ్రీప్రియ, డి.శ్రీవిద్య, ఐవీఎస్ పావని, బి.సింధూజ, కె.సుధారాణి పాల్గొన్నారు.