అరటిపండు సగ భాగం తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి, క్యాబేజీ ఆకులు రెండు లేదా మూడు తీసుకుని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. అరటిపండు గుజ్జు, క్యాబేజీ ఆకుల పేస్ట్ రెండింటిని కలిపి ఆ మిశ్రమంలో ఒక గుడ్డు తెల్ల సొన వేసి బాగా కలుపుకోవాలి. ఉదయం ముఖాన్ని చన్నీటితో శుభ్రం చేసుకుని, తయారుచేసుకున్న ప్యాక్‌ని ముఖానికి అప్లై చేసుకోవాలి. అరగంటపాటు ప్యాక్‌ను ఆరనిచ్చి, నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా నెలరోజుల పాటు ప్రతిరోజూ చేస్తే ముఖంపై ఉన్న ముడతలు పోతాయి. తర్వాత ఇదే ప్యాక్‌ను నెలకు రెండుసార్లు వేసుకుంటే సరిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment