అరటి నార.. అందాల చీర | Training on manufacture of banana fiber products at YSR Horticultural University | Sakshi
Sakshi News home page

అరటి నార.. అందాల చీర

Published Sun, Oct 6 2024 5:43 AM | Last Updated on Sun, Oct 6 2024 5:43 AM

Training on manufacture of banana fiber products at YSR Horticultural University

అరటి నారతో అద్భుత ఆవిష్కరణలు

చీర, చేతిసంచి వంటి 45 రకాల ఉత్పత్తులు

అరటి బొంతల నుంచి నార తయారీ

ఆ నారనుంచి దారంతీసి చీరలు, ఇతర ఉత్పత్తులు

వైఎస్సార్‌ ఉద్యాన వర్సిటీలో అరటి నార ఉత్పత్తుల తయారీపై శిక్షణ 

అమలాపురం, రాజమండ్రి, గుంటూరు, అనంతపురం ప్రాంతాల్లోనూ శిక్షణ కార్యక్రమాలు

స్వయంకృషితో రాణించేందుకు ఉపాధి మార్గం

ఈ చీరలను నూలు, పట్టు దారాలతో నేశారనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. వీటిని కేవలం అరటి నారతో నేశారు. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. ఔత్సాహిక యువత అరటి నార (బనానా ఫైబర్‌)తో అద్భుత ఆవిష్కరణలు చేస్తున్నారు. చీర నుంచి చేతిసంచి వరకు దాదాపు 45 రకాల ఉత్పత్తుల్ని తయారు చేస్తూ అదరహో అనిపిస్తున్నారు. పర్యావరణ హితమైన ఈ ప్రయత్నానికి ఏడాదిన్నర క్రితం బీజం వేయగా.. వాణిజ్యపరంగాను లాభాల పంట పండించనుంది.

సాక్షి, అమరావతి: ‘బిడ్డలకు జన్మనిచ్చి తల్లి ప్రాణా­లు కోల్పోతుంది’ అనే పొడుపు కథ విన్నారా. అరటి చెట్టును ఉద్దేశించి ఈ పొడుపు కథ వాడుకలోకి వచ్చింది. అరటి చెట్టు గెలవేసి.. గెలలోని కాయలు పక్వానికి రాగానే గెలను కోసేస్తారు. మరుక్షణమే అరటి చెట్టును నరికేస్తారు. అలా నరికిపడేసిన అరటి చెట్లు తోటల్లో గుట్టలుగా పేరుకుపోవడంతో వాటిని తొలగించేందుకు రైతులు పడే ఇబ్బందులు వర్ణానా­తీతం. దీనికి శాస్త్రవేత్తలు గతంలోనే చక్కటి పరి­ష్కారం కనుక్కున్నారు. అరటి చెట్ల కాండం నుంచి నార తీసే సాంకేతికతను అభివృద్ధి చేయడంతో­పాటు యంత్రాలను సైతం అందుబాటులోకి తెచ్చారు.

అరటి నార తయారీతో రైతులకు ఆదాయం
అరటి నారకు ఇప్పుడిప్పుడే గిరాకీ పెరుగుతోంది. దీంతో ఔత్సాహికులు రైతుల వద్దకు వెళ్లి కొట్టి పడేసిన అరటి బొంత (కాండం)లను కొనుగోలు చేస్తున్నారు. ఒక్కొక్క బొంతకు రూ.2 నుంచి రూ.5 వరకు చెల్లిస్తున్నారు. దీనివల్ల రైతులకు అదనపు ఆదాయం సమకూరుతోంది. ఆ బొంతలను ఎండబెట్టి యంత్రాల సాయంతో నార తీస్తున్నారు. ఈ నారతో పర్యావరణ హితమైన వివిధ రకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. దీనిపై మరింత అవగాహన పెంచి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం ద్వారా ఉపాధి అందించేందుకు పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలోని వైఎసాŠస్‌ర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయంలో అరటి నార ఉత్పత్తుల తయారీపై ఔత్సాహిక యువత, మహిళలు, రైతులకు శిక్షణ ఐదు రోజుల శిక్షణ ఇచ్చారు. కాగా.. కడప నగరానికి చెందిన ముసా ఫైబర్‌ స్టార్టప్‌ సంస్థ వివిధ ప్రాంతాల్లో యువత, మహిళలకు అరటి నార ఉత్పత్తులపై శిక్షణ ఇస్తోంది. తాజాగా ఈ సంస్థ అనంతపురం జిల్లా కురుగుంటలో రెండు నెలలపాటు ఇచ్చిన శిక్షణ శనివారంతో ముగిసింది.

అద్భుతమైన ఉత్పత్తుల తయారీ
అరటి నారతో అద్బుతమైన ఉత్పత్తులను అందించే నైపుణ్యం అందర్నీ ఆశ్చర్య­చకితులను చేస్తోంది. ఇప్పటికే ఔత్సా­హిక, అంకుర సంస్థలు అరటి నార నుంచి తీసిన దారాలతో చీరల్ని నేయించి అమ్మకాలకు పెడుతున్నాయి. అరటి నార దారాలతో ప్యాంట్లు, షర్ట్‌లు తదితర దుస్తు­లను రూపొందిస్తున్నాయి. కొందరు ఔత్సాహికులు అందమైన చేతి సంచులు, బుట్టలు, హ్యాండ్‌బ్యాగ్‌లు సైతం అరటి నారతో రూపొందిస్తున్నారు. చెవి రింగులు, గాజులు, బుట్టలు, ప్లేట్లు, గ్లాసులు, పాదరక్షలు, డోర్‌ మ్యాట్లు, యోగా మ్యాట్లు, శానిటరీ న్యాప్కిన్స్, పేపర్, పూల బుట్టలు ఇలా అనేక రకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. పరుపులో వాడే పీచుకు బదులు అరటి నారతో తయారు చేస్తున్న క్వాయర్‌ మరింత నాణ్యతతో ఉన్నట్టు గుర్తించారు.

మా కృషి ఫలిస్తోంది
రాష్ట్రంలో అరటి సాగుచేసే రైతుల సంఖ్య ఎక్కువగానే ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అరటి బొం­తల నుంచి తీసే ఫైబర్‌తో ఉత్పత్తులు త­యా­రు చేయడంపై ఉతర రాష్ట్రాలకు వెళ్లి శిక్షణతో అవగాహన పెంచుకున్నాం. ఐదు­గురు సభ్యులతో ముసా ఫైబర్‌ స్టార్టప్‌ నెల­కొల్పాం. కడప, అనంతపురం, కృష్ణా, రాజ­మండ్రి, విజయనగరం జిల్లాల్లో అరటి నార­తో ఉత్పత్తులు తయారు చేసే ప్లాంట్లు కూ­డా ఏర్పాటు చేశాం. రైతుల నుంచి అరటి బొంతలు సేకరించి నారతీసి అనేక రకాల ఉ­త్ప­త్తులు తయారు చేస్తున్నాం.  మిగిలిన వ్య­ర్థాలను కంపోస్టుగా మారుస్తున్నాం. ర్చి రైతులకు ఇ­స్తున్నాం.  అరటి బొంత నీరు నుంచి క్రిమి­సంహారక మందులు, సౌందర్య సాధనా­లు త­యా­­రు చేసే పద్ధతులు  అందుబాటులో­కి వచ్చా­­యి.  – పుల్లగుర శ్రీనివాసులు, ముసా ఫైబర్‌ స్టార్టప్, కడప

ఉపాధిగా మలుచుకుంటాం
అరటి ఉప ఉత్ప­త్తుల తయారీపై తీసు­కున్న శిక్షణ మాకు  ఉపయోగపడుతుంది. దీనిని ఉపాధిగా మలు­చుకుంటాం. అరటి నార తీయడం మొదలు ఉత్పత్తుల తయారీ వరకు అనేక విధాలుగా జీవనోపాధి దొరుకుతుంది.      – విద్య, కురుగుంట, అనంతపురం జిల్లా

అరటితో ఎన్నో ప్రయోజనాలు
కొట్టిపడేసే అరటి చెట్టుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.  కుటీర పరిశ్రమగా దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. శిక్షణ తీసుకోవడంతో  మేం స్వయం ఉపాధి పొందాలనుకుంటున్నాం.     – శ్రీలక్ష్మి, కురుగుంట,అనంతపురం జిల్లా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement