Linen
-
అరటి నార.. అందాల చీర
ఈ చీరలను నూలు, పట్టు దారాలతో నేశారనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. వీటిని కేవలం అరటి నారతో నేశారు. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. ఔత్సాహిక యువత అరటి నార (బనానా ఫైబర్)తో అద్భుత ఆవిష్కరణలు చేస్తున్నారు. చీర నుంచి చేతిసంచి వరకు దాదాపు 45 రకాల ఉత్పత్తుల్ని తయారు చేస్తూ అదరహో అనిపిస్తున్నారు. పర్యావరణ హితమైన ఈ ప్రయత్నానికి ఏడాదిన్నర క్రితం బీజం వేయగా.. వాణిజ్యపరంగాను లాభాల పంట పండించనుంది.సాక్షి, అమరావతి: ‘బిడ్డలకు జన్మనిచ్చి తల్లి ప్రాణాలు కోల్పోతుంది’ అనే పొడుపు కథ విన్నారా. అరటి చెట్టును ఉద్దేశించి ఈ పొడుపు కథ వాడుకలోకి వచ్చింది. అరటి చెట్టు గెలవేసి.. గెలలోని కాయలు పక్వానికి రాగానే గెలను కోసేస్తారు. మరుక్షణమే అరటి చెట్టును నరికేస్తారు. అలా నరికిపడేసిన అరటి చెట్లు తోటల్లో గుట్టలుగా పేరుకుపోవడంతో వాటిని తొలగించేందుకు రైతులు పడే ఇబ్బందులు వర్ణానాతీతం. దీనికి శాస్త్రవేత్తలు గతంలోనే చక్కటి పరిష్కారం కనుక్కున్నారు. అరటి చెట్ల కాండం నుంచి నార తీసే సాంకేతికతను అభివృద్ధి చేయడంతోపాటు యంత్రాలను సైతం అందుబాటులోకి తెచ్చారు.అరటి నార తయారీతో రైతులకు ఆదాయంఅరటి నారకు ఇప్పుడిప్పుడే గిరాకీ పెరుగుతోంది. దీంతో ఔత్సాహికులు రైతుల వద్దకు వెళ్లి కొట్టి పడేసిన అరటి బొంత (కాండం)లను కొనుగోలు చేస్తున్నారు. ఒక్కొక్క బొంతకు రూ.2 నుంచి రూ.5 వరకు చెల్లిస్తున్నారు. దీనివల్ల రైతులకు అదనపు ఆదాయం సమకూరుతోంది. ఆ బొంతలను ఎండబెట్టి యంత్రాల సాయంతో నార తీస్తున్నారు. ఈ నారతో పర్యావరణ హితమైన వివిధ రకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. దీనిపై మరింత అవగాహన పెంచి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం ద్వారా ఉపాధి అందించేందుకు పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలోని వైఎసాŠస్ర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో అరటి నార ఉత్పత్తుల తయారీపై ఔత్సాహిక యువత, మహిళలు, రైతులకు శిక్షణ ఐదు రోజుల శిక్షణ ఇచ్చారు. కాగా.. కడప నగరానికి చెందిన ముసా ఫైబర్ స్టార్టప్ సంస్థ వివిధ ప్రాంతాల్లో యువత, మహిళలకు అరటి నార ఉత్పత్తులపై శిక్షణ ఇస్తోంది. తాజాగా ఈ సంస్థ అనంతపురం జిల్లా కురుగుంటలో రెండు నెలలపాటు ఇచ్చిన శిక్షణ శనివారంతో ముగిసింది.అద్భుతమైన ఉత్పత్తుల తయారీఅరటి నారతో అద్బుతమైన ఉత్పత్తులను అందించే నైపుణ్యం అందర్నీ ఆశ్చర్యచకితులను చేస్తోంది. ఇప్పటికే ఔత్సాహిక, అంకుర సంస్థలు అరటి నార నుంచి తీసిన దారాలతో చీరల్ని నేయించి అమ్మకాలకు పెడుతున్నాయి. అరటి నార దారాలతో ప్యాంట్లు, షర్ట్లు తదితర దుస్తులను రూపొందిస్తున్నాయి. కొందరు ఔత్సాహికులు అందమైన చేతి సంచులు, బుట్టలు, హ్యాండ్‌బ్యాగ్‌లు సైతం అరటి నారతో రూపొందిస్తున్నారు. చెవి రింగులు, గాజులు, బుట్టలు, ప్లేట్లు, గ్లాసులు, పాదరక్షలు, డోర్ మ్యాట్లు, యోగా మ్యాట్లు, శానిటరీ న్యాప్కిన్స్, పేపర్, పూల బుట్టలు ఇలా అనేక రకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. పరుపులో వాడే పీచుకు బదులు అరటి నారతో తయారు చేస్తున్న క్వాయర్ మరింత నాణ్యతతో ఉన్నట్టు గుర్తించారు.మా కృషి ఫలిస్తోందిరాష్ట్రంలో అరటి సాగుచేసే రైతుల సంఖ్య ఎక్కువగానే ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అరటి బొంతల నుంచి తీసే ఫైబర్‌తో ఉత్పత్తులు తయారు చేయడంపై ఉతర రాష్ట్రాలకు వెళ్లి శిక్షణతో అవగాహన పెంచుకున్నాం. ఐదుగురు సభ్యులతో ముసా ఫైబర్ స్టార్టప్ నెలకొల్పాం. కడప, అనంతపురం, కృష్ణా, రాజమండ్రి, విజయనగరం జిల్లాల్లో అరటి నారతో ఉత్పత్తులు తయారు చేసే ప్లాంట్లు కూడా ఏర్పాటు చేశాం. రైతుల నుంచి అరటి బొంతలు సేకరించి నారతీసి అనేక రకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నాం. మిగిలిన వ్యర్థాలను కంపోస్టుగా మారుస్తున్నాం. ర్చి రైతులకు ఇస్తున్నాం. అరటి బొంత నీరు నుంచి క్రిమిసంహారక మందులు, సౌందర్య సాధనాలు తయారు చేసే పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. – పుల్లగుర శ్రీనివాసులు, ముసా ఫైబర్ స్టార్టప్, కడపఉపాధిగా మలుచుకుంటాంఅరటి ఉప ఉత్పత్తుల తయారీపై తీసుకున్న శిక్షణ మాకు ఉపయోగపడుతుంది. దీనిని ఉపాధిగా మలుచుకుంటాం. అరటి నార తీయడం మొదలు ఉత్పత్తుల తయారీ వరకు అనేక విధాలుగా జీవనోపాధి దొరుకుతుంది. – విద్య, కురుగుంట, అనంతపురం జిల్లాఅరటితో ఎన్నో ప్రయోజనాలుకొట్టిపడేసే అరటి చెట్టుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కుటీర పరిశ్రమగా దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. శిక్షణ తీసుకోవడంతో మేం స్వయం ఉపాధి పొందాలనుకుంటున్నాం. – శ్రీలక్ష్మి, కురుగుంట,అనంతపురం జిల్లా -
లినెన్ రిటైల్‌లోకి ‘లినెన్ హౌజ్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లినెన్ వ్రస్తాలు, దుస్తుల విక్రయంలోకి కొత్త బ్రాండ్ లినెన్ హౌజ్ ఎంట్రీ ఇస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో దసరాలోగా 10 స్టోర్లను తెరుస్తున్నట్టు లినెన్ హౌజ్‌ను ప్రమోట్ చేస్తున్న కాకతీయ ఫ్యాబ్రిక్స్ డైరెక్టర్ వొజ్జా తిరుపతి రావు సోమవారం తెలిపారు. బ్రాండ్‌ను ఆవిష్కరించిన సందర్భంగా డైరెక్టర్లు అవిరినేని శ్రీకాంత్, త్రిపురనేని విజయ్, ఉప్పలపాటి కళ్యాణ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘ఫ్రాంచైజీ భాగస్వామి రూ.10–15 లక్షల పెట్టుబడి పెడితే చాలు. రూ.50 లక్షల వరకు విలువైన సరుకును కంపెనీయే సరఫరా చేస్తుంది. వ్యాపారులకు 35 శాతం మార్జిన్ ఉంటుంది. ఏడాదిలో దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించడం ద్వారా 100 ఔట్లెట్ల స్థాయికి చేరాలని కృతనిశ్చయంతో ఉన్నాం. రూ.50 కోట్ల దాకా వెచి్చస్తాం. ప్రస్తుతం లినెన్ ఫియెస్టా, లినెన్ మాయెస్ట్రో, లినెన్ ఓసియన్, బాలేశ్వర్ సింథటిక్స్, ప్యూర్ఫైన్ ఫ్యాబ్రిక్స్ కంపెనీలతో జట్టుకట్టాం. ఆదిత్య బిర్లా, రేమండ్స్, సియారామ్స్తో చర్చిస్తున్నాం. టాప్ బ్రాండ్ల లినెన్ ఉత్పత్తులన్నీ విక్రయిస్తాం’ అని వివరించారు. -
లినెన్ వెన్నెల
మండే ఎండల్లోనైనా..పండు వెన్నెల్ని కురిపిస్తుంది లినెన్ క్లాత్!సమ్మర్ ఫ్రెండ్లీ. కూల్‌గా ఉంటుంది. చర్మానికి బ్రీతింగ్ ఇస్తుంది. అంతే కాదు.. మంచి లుక్ వస్తుంది. లినెన్ ఫ్యాబ్రిక్ ఫ్యాషన్ ఇండస్ట్రీ రూపురేఖల్నే మార్చేసింది. వాతావరణానికి అనుగుణంగా మేనికి హాయినిస్తుంది. చమటను పీల్చుకుంటుంది. దీర్గకాలం మన్నుతుంది. ధరించినవారిని హుందాగా చూపుతుంది. ఫ్యాషన్ ప్రపంచంలో ఎన్నో సొబగులు అద్దుకున్న లినెన్ అతివలను చీరలతో మరింత అందంగా చూపుతుంది. ఇన్ని సుగుణాలు ఉన్న లినెన్ ఫ్యాబ్రిక్‌కి నాలుగువేల సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రపంచవ్యాప్తంగా డెభ్బైల కాలంలో ఐదుశాతంగా ఉన్న లినెన్ ఉత్పత్తులు, తొంభైల కాలం వచ్చేసరికి డెభ్బై శాతానికి పైగా పెరగింది. ఖరీదులోనూ ఘనంగా ఉండే లినెన్ తయారీలో ఎన్నో మార్పులు చోటు చేసుకొని ఇప్పుడు అందరికీ అందుబాటు ధరల్లోకి వచ్చాయి. ప్లెయిన్, చెక్స్, షేడెడ్ కలర్స్, సెల్ఫ్ బార్డర్స్‌తో కనువిందు చేసే లినెన్ చీరలు ముఖ్యంగా వేసవిలో తమ తమ హుందాతనాన్ని చాటుతున్నాయి. ఈ చీరల మీదకు డిజైనర్, సెల్ఫ్బ్లౌజులు.. వేటికవి ప్రత్యేకంగా కనిపిస్తాయి. నిర్వహణ: ఎన్.ఆర్. -
బెడ్ లినెన్ మార్కెట్లో 25% వాటా లక్ష్యం: ఐసీఆర్వీఎల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే ఐదేళ్లలో దేశీ బెడ్ లినెన్ మార్కెట్లో 25 శాతం వాటా సాధించాలని ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ ఇండో కౌంట్ రిటైల్ వెంచర్స్ (ఐసీఆర్వీఎల్) లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రస్తుతం రూ. 13,000 కోట్లుగా ఈ మార్కెట్ 2021 నాటికి రూ. 19,000 కోట్ల స్థాయికి చేరగలదని అంచనాలున్నట్లు కంపెనీ ఎండీ అసీమ్ దలాల్ వివరించారు. బుధవారమిక్కడ ‘బొటిక్ లివింగ్’ శ్రేణి బెడ్ లినెన్ ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెట్టిన సందర్భంగా దలాల్ ఈ విషయాలు చెప్పారు. వీటి ధర రూ. 2,000-రూ. 8,000 మధ్య ఉంటుంది. దేశీయంగా మార్కెటింగ్ నెట్వర్క్ మొదలైనవి పటిష్టం చేసుకునేందుకు రూ. 25 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. మొదటి ఏడాది సుమారు 200 స్టోర్స్ ఏర్పాటు చేయనున్నామని, వీటిలో దాదాపు 40 స్టోర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఉండగలవని చెప్పారు. ఇప్పటిదాకా ఎగుమతుల ప్రధానంగా ఉన్న తమ సంస్థ తొలిసారిగా దేశీ బెడ్ లినెన్ మార్కెట్లోకి అడుగుపెడుతోందని, త్వరలో రూ. 500 కోట్ల అమ్మకాలు లక్ష్యంగా పెట్టుకున్నామని దలాల్ వివరించారు. -
లినెన్ వాటా 0.2 శాతమే..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచ వస్త్ర రంగంలో లినెన్ వాటా ప్రస్తుతం 0.2 శాతమే. ఉన్ని 2 శాతముంది. కొరత కారణంగా ఈ వస్త్రాలు ఖరీదైనవని ఆదిత్యా బిర్లా గ్రూపుకు చెందిన జయ శ్రీ టెక్స్టైల్స్ డొమెస్టిక్ టెక్స్టైల్స్ సీఈవో ఎస్.కృష్ణమూర్తి తెలిపారు. జేఎన్టీయూ సమీపంలో ఏర్పాటైన ఐరిస్ లినెన్ క్లబ్ ఎక్స్‌క్లూజివ్ షోరూంను సోమవారం ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. లినెన్ తయారీకి అవసరమైన అవిసె(ఫ్లాక్స్) మొక్కలు బెల్జియం, ఫ్రాన్స్‌లో మాత్రమే అభిస్తాయని వివరించారు. ఇక లినెన్ వస్త్ర పరిమాణం మొత్తం దేశంలో రూ.2 వేల కోట్లుంది. అగ్రస్థానంలో ఏపీ: లినెన్ దుస్తుల వాడకంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని కృష్ణమూర్తి తెలిపారు. కంపెనీకి రిటైల్ వ్యాపారంలో రాష్ట్రం నుంచే అధికంగా 22% ఆదాయం సమకూరుతోందన్నారు. దేశవ్యాప్తంగా 89 షోరూంలు ఉంటే, రాష్ట్రంలో వీటి సంఖ్య 19 ఉందన్నారు. 2017 కల్లా ఔట్లెట్ల సంఖ్యను 250కి చేరుస్తామని, తద్వారా ఆంధ్రప్రదేశ్ స్టోర్ల సంఖ్య 50 అవుతుందని చెప్పారు. మీటరు వస్త్రం రూ.10 వేలు ఖరీదు చేసేవి ఉత్పత్తి చేస్తామని వెల్లడించారు. షోరూంలో వస్త్రాల ధర మీటరుకు రూ.400 నుంచి రూ.2,500 వరకు ఉందని ఐరిస్ లినెన్ ఎండీ పి.అమృతవర్ధన్ రావు తెలిపారు.