లాస్ కాదు డోస్, బనానా వైన్!
‘అవసరం’ నుంచి మాత్రమే కాదు ‘నష్టం’ నుంచి కూడా ‘ఐడియా’ పుడుతుంది. విషయంలోకి వస్తే... ఈస్ట్ ఆఫ్రికా దేశమైన మలావీలో కరోంగ జిల్లాకు చెందిన శ్రీమతి ఎమిలీ చిన్నపాటి రైతు. అరటి సాగు చేసే ఎమిలీలాంటి ఎంతోమంది రైతులకు ఒక సమస్య ఏర్పడింది.
విపరీతమైన వేడి వల్ల అరటిపండ్లు చాలా త్వరగా పండుతున్నాయి. పాడవుతున్నాయి. దీనివల్ల రైతులకు భారీగా నష్టం వాటిల్లుతోంది. ‘వెరీ ఫాస్ట్ అండ్ గో టు వేస్ట్’ అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ‘బనానా వైన్’ ఐడియా పుట్టింది.
ఇక ఆట్టే ఆలస్యంలోకి చేయకుండా ఎమిలీ బృందం రంగంలోకి దిగింది.
‘అరటి వైన్ తయారు చేయడం ఎలా?’ అనేదానికి సంబంధించి వారు చిన్నపాటి శాస్త్రవేత్తలు అయ్యారు. ఎంతోమంది నిపుణులతో మాట్లాడారు. మెచెంజర్ అనే గ్రామంలో నాలుగు గదుల ఇంట్లో వైన్ తయారీ ప్రక్రియ మొదలు పెట్టారు. బాగా మగ్గిన అరటిపండ్లు, చక్కెర, ఎండుద్రాక్ష, నిమ్మకాయలు, నీళ్లు... మొదలైనవి ముడిసరుకుగా బనానా వైన్ తయారీ మొదలైంది. అయితే ఇదేమీ ఆషామాషీ ప్రక్రియ కాదు.
ఎమిలి మాటల్లో చెప్పాలంటే ‘టైమింగ్ అనేది చాలా ముఖ్యం’ ఎలాంటి అరటిపండ్లను ఉపయోగించాలి, ఎప్పుడు ఉపయోగించాలి, టైమ్ ఎంత తీసుకోవాలి....ప్రతి దశలోనూ ఆచితూచి అత్యంత జాగ్రత్తగా వ్యహరించాల్సి ఉంటుంది. ఇది ‘గుడ్ క్వాలిటీ వైన్’గా పేరు తెచ్చుకోవడానికి ఎంతోకాలం పట్టలేదు. ‘స్మూత్ అండ్ లైట్ వైన్’గా పేరు తెచ్చుకున్న ఈ అరటి మద్యానికి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.
‘మలావీ నలుమూలలా అరటి మద్యానికి మంచి డిమాండ్ ఉంది’ అంటున్నాడు కమ్యూనిటీ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రమోషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టెన్నిసన్ గోండ్వే. ‘బనానా వైన్ ఐడియా మా జీవితాలను మార్చేసింది. మాలో కొందరు ఇళ్లు కట్టుకున్నారు. కొందరు పశువులు కొన్నారు. ఇప్పుడు మేము మంచి భోజనం తినగలుగుతున్నాం’ అంటుంది ఎలీన.
ఇదీ చదవండి: ‘బాస్! నేనూ వస్తా..’! ఆంబులెన్స్ వెనక దౌడుతీసిన కుక్క, వైరల్ వీడియో
Comments
Please login to add a commentAdd a comment