బి ఫర్‌ బనానా!! | What are Bananas Good For? | Sakshi
Sakshi News home page

బి ఫర్‌ బనానా!!

Published Sat, Sep 2 2017 11:25 PM | Last Updated on Sun, Sep 17 2017 6:18 PM

బి ఫర్‌ బనానా!!

బి ఫర్‌ బనానా!!

ఈ రోజుల్లో మన తిండంతా హైబ్రిడ్‌ తిండే! ఆకలేస్తే ఫాస్ట్‌ ఫుడ్, అన్నం తినే వేళకి ఆయిలీ ఫుడ్‌! లొట్టలేసుకుంటూ మరీ లాగించేస్తుంటాం. ఇలా అయితే ఆరోగ్యం చాలా బాగోదు కదా!!

ఈ రోజుల్లో మన తిండంతా హైబ్రిడ్‌ తిండే! ఆకలేస్తే ఫాస్ట్‌ ఫుడ్, అన్నం తినే వేళకి ఆయిలీ ఫుడ్‌! లొట్టలేసుకుంటూ మరీ లాగించేస్తుంటాం. ఇలా అయితే ఆరోగ్యం చాలా బాగోదు కదా!! ఏదో అప్పుడప్పుడు హెల్త్‌ టిప్స్‌ ఫాలో అయ్యేవారు మాత్రం ఏ ఫర్‌ ఆపిల్‌ అంటుంటారు. ఎంత కాస్ట్‌ అయినా కొని తెచ్చుకుని... ముక్కలు చేసుకుని తింటుంటారు. కానీ ఇంకో అక్షరం కలుపుకుని బి ఫర్‌ బనానా అంటే.. ఇంకా మంచిది కదా! నిజమే మరి! అన్ని వేళలా ఆరగించదగిన పండు అరటిపండు! ఉన్నట్టుండి అరటిపండు ఎందుకు గుర్తుకొచ్చింది అనేగా మీ డౌట్‌! గదేమరి సెప్పేటిది! బి ఫర్‌ బనానాకి ఓ రోజుంది! ప్రతి ఏటా సెప్టెంబర్‌ 8న దాని బర్త్‌ డే లెక్క! గారోజు మస్తు బనానాలు మెక్కితే!? సెలబ్రేషన్‌కి సెలబ్రేషన్‌! ఎనర్జీకి ఎనర్జీ!! మరి గా ముచ్చట్లేందో చూద్దామా!?

బర్గర్‌ కన్నా బనానా మిన్న!!
అరటిపళ్లు ఎక్కడ నుంచి వస్తాయిరా? అని పిల్లలని అడిగితే మాల్‌ నుంచి అనే చెప్పే రోజులివి. ఇక బర్గర్‌లను ఫ్యాషన్‌గా తినే ఈ ట్రెండీ యుగంలో... బనానా వలుచుకుని తినడం కాస్త ప్రిస్టేజ్‌ ఇష్యూగా ఫీలయ్యే వాళ్లు లేకపోలేదు. అయితే శరీర సౌష్టవానికి, సౌందర్యానికి బనానా చాలా మంచిదంటున్నారు నిపుణులు.

రుచులు వేరు సుమీ!
‘‘అమ్మా, ఆవకాయ్, అరటిపండు...’’ ఇవి ఎప్పటికీ మరువలేని మేడిన్‌ ఇండియా రుచులు. కేరళ అరటిపండు, కర్పూర పండు, కొండ అరటిపండు ఇలా పేర్లు వేరైనా జాతి ఒక్కటే! రుచులు వేరైనా ఎనర్జీ లెవల్స్‌ ఒక్కటే!! ఇక అమృతాన్ని తలపించే అమృతపాణి, చక్కెరను మరిపించే చక్కరకేళి ఒక్కసారి తిన్నారంటే వన్స్‌ మోర్‌ చెప్పకుండా ఉండలేరు. అయితే కొన్ని ప్రాంతాల్లో వీటి వాడకం కాస్త తక్కువ! ఏ మాత్రం అవకాశం ఉన్నా.. అమృతపాణి, చక్కరకేళి పండ్లను ఒక్కసారి రుచి చూడండి.

ఔషధం లెక్క పనిచేస్తుంది!
బనానా తినడం వల్ల.. అధిక ఒత్తిడి తగ్గుతుంది. అందులోని మినరల్స్, ప్రొటీన్స్‌ శరీరంలోని టాక్సిన్స్‌ వంటి విషపదార్థాలను తొలగించడంలో, గుండె పనితీరు మెరుగుపడ్డంలో సహకరిస్తాయి. ఇందులో ఉండే బాన్‌లెస్‌ అనే రసాయనానికి హెచ్‌.ఐ.వి. వైరస్‌తో పోరాడే శక్తి ఉందని నిపుణులు తేల్చారు.

విశ్వంభర!
ప్రపంచంలో అరటి అధికంగా తినే పండు! ఇది తొలిసారిగా ఆగ్నేయ ఆసియాలో గుర్తించారు. క్రీస్తుపూర్వం 327లో భారత్‌కి వచ్చిన అరబ్‌వారు బనానా రుచి చూసినట్లు ఆధారాలు ఉన్నాయి. తరువాత కాలంలో పాలస్తీనా ప్రాంతానికి, ఆఫ్రికా ప్రాంతానికి వ్యాప్తి చెందింది.

బనానా బాబా!
‘వీడు తేడా’ సినిమాలో బ్రహ్మానందం బనానా బాబాగా దర్శనమిచ్చి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారు. ‘‘బాబా.. మీరు బనానా బాబా ఎందుకు అయ్యారు?’’ అంటూ ఓ భక్తుడు వేసిన ప్రశ్నకు ఫన్నీ సమాధానం ఇస్తూ.. వీక్షకులకు కితకితలు పెడతారు బ్రహ్మీ!

అన్నింటా అరటి!
‘అరటి’ పలు ప్రాంతాల్లో కేవలం పండులానే కాదు.. కూరగాయగా కూడా ఉపయోగిస్తున్నారు. వీటిని చిప్స్‌గా, బజ్జీలుగా తయారు చేసి కూడా అమ్ముతుంటారు. అరటి మొక్క.. చెట్టు మాదిరిగా ఏపుగా పెరుగుతుంది. దీని ఆకులు పలు చోట్ల ఫలహారాలు పెట్టేందుకు, భోజనం చేసేందుకు విరివిగా వాడుతున్నారు. దీని పూత సమయంలో వచ్చే పువ్వును కూడా కూరగా చేస్తుంటారు. అందులో అనేక పోషక విలువలు ఉంటాయి. మరి.. ఇన్ని సంగతులు విన్న తరువాత కూడా గా రోజున రెండు అరటిపండ్లు తినకపోతే.. చాలా బాగోదు! మరో విషయం!! ఇప్పటి దాకా అమృతపాణి, చక్కెరకేళి పండ్లు తినకపోతే తప్పకుండా తినండి. ఆల్‌ రెడీ తింటే జై బనానా డే అనుకుని మరోసారి తినండి! ఉంటామరి!!

పోషకాల పండు!
బనానాలో క్యాల్షియం, సోడియం, ఇనుము, రాగి, జింక్, మాంగనీస్, క్రోమియం, కెరోటిన్, పొటాషియం, నియాసిన్, థయామిన్, విటమిన్‌– సి, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు ఇలా చాలానే పోషకాలు ఉన్నాయి. మొత్తం బరువులో 80 శాతం తినగల పదార్థం, 20 శాతం తోలు ఉంటుంది. ఇందులోని పోషకాల కారణంగా జీర్ణశక్తి మెరుగుపడ్డంతో పాటు.. మలబద్ధకం వంటి సమస్యలు దరిచేరవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement