యశవంతపుర: గోబీ రైస్, గోబీ మంచూరియాను కొందరు ఇష్టంగా తింటారు. ఇందులో పిల్లలు ఎక్కువగా ఉంటారు. అయితే విషపూరితంగాను, క్యాన్సర్ అంశాలు ఎక్కువగా ఉన్న బొంబయి మిఠాయి, గోబి మంచూరియాని నిషేధించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
రాష్ట్ర ఆరోగ్యశాఖ ఇచ్చిన నివేధిక ఆధారంగా కాటన్ క్యాండి, గోబిల విక్రయాలను నిలుపుదల చేయాలని భావిస్తోంది. గోబి బాగా రంగుతో కనిపించడానికి, రుచి వచ్చేందుకు కృత్రిమ రంగులు, రసాయనాలు కలుపుతున్నారని ఎప్పటినుంచో ఆరోపణలు ఉన్నాయి. వీటి వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందంటూ ఇటీవల ఆరోగ్యశాఖ సర్కారుకు తెలిపింది. దీని ఆధారంగా ఈ నెల 11 ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్ గుండూరావ్ ప్రకటన చేసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment