'గోబీ మంచూరియా'ని ఆ నగరం పూర్తిగా బ్యాన్‌ చేసిందట! | Why Goa Towns Declare War On Gobi Manchurian | Sakshi
Sakshi News home page

'గోబీ మంచూరియా'ని ఆ నగరం పూర్తిగా బ్యాన్‌ చేసిందట! ఎందుకో తెలుసా?

Published Mon, Feb 5 2024 12:33 PM | Last Updated on Mon, Feb 5 2024 1:16 PM

Why Goa Towns Declare War On Gobi Manchurian - Sakshi

గోబీ మంచూరియాని ఇష్టపడిని వాళ్లు ఉండరు. దాన్ని చూస్తేనే నోటిలో నీళ్లు ఊరిపోతాయి. అలాంటి గోబీ మంచూరియాని భారత్‌లోని ఆ నగరం పూర్తిగా నిషేధం విధించింది. అంతేకాదండోయ్‌ అక్కడ స్టాల్స్‌లో దీన్ని ఎక్కడైన అమ్మితే అధికారులు వాటిపై దాడులు కూడా నిర్వహిస్తారట. ఎందుకని ఇంతలా గోబీ మంచూరియాపై యుద్ధం చేస్తున్నారో వింటే కచ్చితంగా మనం కూడా బుద్ది తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తామేమో!. ఏంటీ ఇలా అంటున్నారేంటీ అనుకోకండి. వింత రుచుల మాయలో అందులో ఏం వాడుతున్నారు? ఎలాంటివి తినేస్తున్నాం అనేవి మర్చిపోతున్నాం. జిహ్వ చాపల్యంతో కోరి కష్టాలు తెచ్చుకునే నేటి జనరేషన్‌కు ఇదొక కనువిప్పు అనే చెప్పాలి. ఎందుకిలా చెబుతున్నానంటే..

గోబీ మంచూరియా రుచే వేరబ్బా!. తింటే వదలరు అనేంత టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా శాకాహారులకు ఎంతో ఇష్టమైన వంటకం ఇది. అయితే దీన్ని కార్న్‌ప్లోర్‌ పిండిలో ముచి వేయించి ఆ తర్వాత సోయా సాస్‌, వెనిగర్‌, పంచదార, టొమోటా సాస్‌తో కాస్త గ్రేవీ లేదా డ్రైగా చేసి ఇస్తారు. ఇలా స్పెషల్‌గా చేసే వంటకం కావడంతోనే నిషేధం విధించింది భారత్‌లోని గోవా నగరం. అందులో వినియోగించే పదార్థాల వల్ల ఆరోగ్య సమస్యలు తప్పవు. అయితే దాని రుచికి ఫిదా అయ్యి ప్రజలు అవేమీ పట్టించుకోకుండా లొట్టలేసుకుంటూ లాగించేస్తున్నారు.

దీంతో గోవా మపుసా మున్సిపల్‌ కౌన్సిల్‌ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రెసిపీ విక్రయాలను పూర్తిగా నిషేధించింది. ఎక్కడైన ఫుడ్‌ స్టాల్స్‌లో ఈ డిష్‌ ఉంటే వెంటనే వాటిపై దాడులు నిర్వహించడం వంటివి చేసేలా అధికారులుకు ఆదేశాలను జారీ చేసింది కూడా. కేవలం మున్సిపల్‌ పౌర సంస్థే కాదు. గోవాలోని శ్రీ దామోదర్‌ ఆలయంలో వాస్కో సప్తాహ్‌ ఫెయిర్‌ సందర్భంగా ఫుడ్‌ అండ్‌ డ్రగ్స్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎఫ్‌డీఏ) గోబీ మంచూరియా అమ్మే స్టాళ్లను తీసేయాలని మోర్ముగావ్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌కు ఆదేశాలు జారీ చేసింది. అంతేగాదు ఆ డిష్‌ అమ్మకాలు అరికట్టేలా ఎప్‌డీఏ స్టాల్స్‌పై పలు దాడులు కూడా నిర్వహించింది.

దీంతో ఆ వంటకం గోవా వీధుల్లోని స్టాల్స్‌లో ఎక్కడ కనిపించదనే చెప్పొచ్చు. నిజానికి ఈ గోబీరియా మంచూరియా అత్యంత ప్రజాదరణ పొందిన వంటకం. ముంబైకి చెందిన చైనీస్‌ పాక శాస్త్ర నిపుణుడు నెల్సన్‌ వాంగ్‌ ఈ వంటకాన్ని కనిపెట్టాడు. 1970లలో క్రిక్‌ట్‌ క్లబ్‌ ఆప్‌ ఇండియాలో క్యాటరింగ్‌ చేస్తున్నప్పుడూ చికెన్‌ మంచూరియాను తయారు చేశాడు. అతను చికెన్‌ నగ్గెట్‌లను స్పైసీ కార్న్‌ఫ్లోర్‌ పిండిలో వేయించి పొడిగా లేదా సోయా సాస్‌, వెనిగర్‌, పంచదార లేదా టోమాట సాస్‌లో గ్రేవీ రూపంలో సర్వ్‌ చేసేవాడు. ఇక శాకాహార ప్రియులకు ఆ లోటును భర్తీ చేసేలా దాని స్థానంలో గోబీ మంచూరియాని తీసుకొచ్చాడు. అలాంటి గోబీ మంచూరియాని ప్రజల ఆరోగ్యం కోసం గోవా నగరం నిషేధించడం విశేషం. ఇలా ప్రతీ నగరంలోని అధికారులు భావిస్తే ప్రజలు అనారోగ్యం బారినపడటం తగ్గుముఖం పడుతుంది కదూ!.

(చదవండి: బాలీవుడ్‌ నటుడు కార్తీక్‌ ఆర్యన్‌ నో షుగర్‌ డైట్‌!అలా చేస్తే శరీరంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి?)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement