పాపం! ఏదో అనుకుంది: ఇంకేదో అయ్యింది | Viral Video Woman Bread Making Fail | Sakshi
Sakshi News home page

వంట చేయటం అంత వీజీ కాదు!

Published Wed, May 13 2020 11:03 AM | Last Updated on Wed, May 13 2020 2:48 PM

Viral Video Woman Bread Making Fail - Sakshi

వీడియో దృశ్యాలు

ఖంగుతిన్న సదరు మహిళ వీడియో తీయటం ఆపమని బ్రతిమాలుకుంది...

శాంటియాగో : వంట చేయటం అంత వీజీ కాదు! బ్యాచిలర్లకు ఆ కష్టం బాగా తెలుసు. నానా తంటాలు పడి వంట చేసి పెడితే, వంట రాని ఫ్రెండ్స్‌ దగ్గరినుంచి బాగోలేదని మూతి విరుపులు. అన్ని వేళలా రుచికరంగా వండటం సాధ్యపడే విషయం కాదు.  కొన్నిసార్లు వంట చేయటంలో ఫెయిలవుతూ ఉంటాం. కానీ, చిలీకి చెందిన ఓ మహిళ మాత్రం వంట చేయకుండానే విఫలం అయింది. అయినా కూడా సోషల్‌ మీడియాలో పిచ్చ పాపులర్‌ అయింది. గత బుధవారం చిలీ.. శాంటియాగోకు చెందిన ఆండ్రూ పెర్సూ అలేగ్రియా అనే మహిళ బ్రెడ్‌ తయారు చేసే విధానాన్ని చూపెడుతూ ఓ వీడియో చేయాలనుకుంది. ( ‘బ్యూటీ విత్‌ బ్రెయిన్‌’ అంటే ఇదే..! )

అంతా సిద్ధం చేసుకుని బ్రెడ్డు కోసం పిండి ముద్దని అట్ల కర్రతో ఒత్తుతున్న నేపథ్యంలో పిండి ప్లేటు సరాసరి ముఖానికి వచ్చి తాకింది. దీంతో పిండి మొత్తం ఆమె ముఖానికి అంటుకుపోయింది. ప్రయత్నం అట్టర్‌ ఫ్లాప్‌ కావటంతో ఖంగుతిన్న సదరు మహిళ వీడియో తీయటం ఆపమని బ్రతిమాలుకుంది. ‘‘బ్రెడ్డు తయారు చేయటానికి ఓ కొత్త పద్దతి’’ అనే శీర్షికతో ఫేస్‌బుక్‌లో విడుదలైన ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దాదాపు 9 మిలియన్ల వీక్షణలను సొంతం చేసుకుంది. దీన్ని చూసిన నెటిజన్లు విపరీతంగా నవ్వుకుంటున్నారు. ( జ‌ల‌పాతంలో కొట్టుకుపోతున్న వ్య‌క్తిని.. )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement