Santiago
-
చిలీలో రూ.262 కోట్ల దోపిడీకి యత్నం
శాంటియాగో: చిలీ రాజధాని శాంటియాగోలో వందల కోట్ల నగదును దోచుకునేందుకు సాయుధ దుండగులు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. అమెరికాలోని మియామి నుంచి శాంటియాగో విమానాశ్రయానికి బుధవారం చేరుకున్న విమానంలో 32 మిలియన్ డాలర్ల (రూ.262 కోట్ల) నగదు ఉంది. బ్యాంకుల్లో పంపిణీ చేయాల్సిన ఆ నగదును ట్రక్కులోకి తరలించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో, 10 మంది సాయుధ దుండగులు ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించారు. పక్కా ప్రణాళికతో అక్కడికి చేరుకున్న దుండగులు నగదును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న భద్రతా సిబ్బందితో కొద్దిసేపు ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల్లో భద్రతా సిబ్బంది ఒకరు, ఒక దుండగుడు చనిపోయారు. దుండగులు వెంటనే తమ వాహనంలో అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం ఆ ప్రాంతంలో పూర్తిగా కాలిపోయిన మరో రెండు వాహనాలు కనిపించాయి. భద్రతా సిబ్బంది సకాలంలో స్పందించి ఈ భారీ దోపిడీని అడ్డుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నగదును తీసుకువచ్చిన లాతమ్ విమానంలోని ప్రయాణికులకు ఎటువంటి అపాయం కలగలేదన్నారు. ఇదే శాంటియాగో ఎయిర్‌పోర్టులో గతంలో రెండుసార్లు దోపిడీ దొంగలు తెగబడి మొత్తం 25 మిలియన్ డాలర్ల నగదును ఎత్తుకెళ్లారు. -
Mystery: 35 ఏళ్ల తర్వాత ప్రత్యక్షమైన విమానం.. పైలట్ సీటులో అస్థిపంజరం!
టైమ్ ట్రావెల్ అంటేనే ఒక రకమైన ఆసక్తి. తిరిగిరాని గతానికి తిరిగి వెళ్లడం, తెలియని భవిష్యత్‌ను ముందుగానే చూడటం.. టైమ్ ట్రావెల్ అద్భుతం. అయితే కొన్ని సరైన ఆధారాలు లేక ఆశ్చర్యకరమైన ఉదంతాలుగా, జవాబులు లేని ప్రశ్నలుగా మిగిలిపోతాయి. అలాంటిదే శాంటియాగో ఫ్లైట్ నం. 513 రిటర్న్స్ స్టోరీ. అది 1989, నవంబర్ 15. బ్రెజిల్‌లోని పార్టో అలెగ్రే విమానాశ్రయం ముందు ఉద్రిక్తత నెలకొంది. కొందరు నిరసనకారులు.. ‘గత నెల 12న ఇక్కడేం జరిగింది? ఎందుకు ఈ ప్రభుత్వం 513 ఫ్లైట్ వివరాలు చెప్పడం లేదు?’ అంటూ గొంతెత్తి ప్రశ్నిస్తున్నారు. 1954 నాటి శాంటియాగో ఫ్లైట్‌లోని ప్రయాణికుల వివరాలను తక్షణమే బయటపెట్టాలనేది వారి పోరాటం. ‘నిరాధారమైన ప్రశ్నలకు మేమెలా సమాధానం ఇవ్వగలం?’ అనేది విమానాశ్రయ అధికారుల వాదన. అసలేం జరిగింది? 35 ఏళ్ల కిందట జర్మనీలో మిస్సైన ‘శాంటియాగో ఫ్లైట్ నం. 513’ విమానం (1989,అక్టోబర్ 12) బ్రెజిల్‌లోని పార్టో అలెగ్రే విమానాశ్రయంలో ల్యాండయ్యింది. ఫ్లైట్ 513 రికార్డులను పరిశీలించగా.. ఆ విమానం 1954, సెప్టెంబరు 4న పశ్చిమ జర్మనీలోని ఆచెన్ విమానాశ్రయం నుంచి బయల్దేరినట్లు ఆధారాలు ఉన్నాయి. నిజానికి అది 18 గంటల తర్వాత గమ్యస్థానానికి చేరాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. కొన్ని రోజుల పాటు వెతికిన తర్వాత ఆ ఫ్లైట్ అట్లాంటిక్ మహా సముద్రంలో కూలిపోయిందని అక్కడి అధికారులు తేల్చేశారు. అందులోని కెప్టెన్ మిగ్యూల్ విక్టర్ క్యూతో సహా అంతా చనిపోయినట్లు ప్రకటించారు. అయితే నాడు మిస్ అయ్యిందనుకున్న విమానం.. 1989లో అలెగ్రే ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండయ్యింది. దీనిపై పారానార్మల్ పరిశోధకుడు డాక్టర్ సెల్సో అటెల్లో స్పందిస్తూ.. ‘ఆ విమానం 35 ఏళ్ల క్రితం టైమ్ ట్రావెల్లోకి ప్రవేశించి.. 1989లో బయటపడింది’ అని తెలిపారు. ఈ ఘటనపై జర్మనీ ప్రభుత్వం తమ ఏజెంట్ల ద్వారా విచారణ జరిపించింది. కానీ వివరాలను తెలిపేందుకు నిరాకరించింది. బ్రెజిల్ విమానాశ్రయవర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండైన విమానం చాలా పురాతనమైనదని, దానికి శక్తిమంతమైన టర్బోప్రాప్ ఇంజిన్లు ఉన్నాయని బ్రెజిల్ అధికారులు నిర్ధారించారు. విచిత్రం ఏమిటంటే.. ఆ విమానంలో 88 మంది ప్రయాణికులతో పాటు, ముగ్గురు విమాన సిబ్బంది, విమానం నడిపిన పైలట్ కూడా అస్థిపంజరాల్లా మారిపోయారు. మొత్తం కలిపి 92 మంది అస్థిపంజరాలుగా మిగిలారు. దీనిపై విమానాశ్రయ సిబ్బందిని ఆరా తీయగా.. ‘ఈ విమాన పైలట్.. కెప్టెన్ విక్టర్ క్యూ.. కాక్‌పీట్‌లో విమానం నడుపుతున్న పొజిషన్ లో మాకు కనిపించారు. ల్యాండింగ్‌కు ముందు ఆ ఫ్లైట్.. ఈ విమానాశ్రయం చుట్టూ చాలా సేపు చక్కర్లు కొట్టింది. దాని గురించి మాకు ముందుగానే ఎలాంటి సమాచారం లేకపోవడంతో మేము కాస్త అయోమయంలో పడ్డాం. ఆ తర్వాత విమానం దానంతట అదే ల్యాండయ్యింది. పైలట్ చనిపోయి ఉన్నా ఆ విమానం ఎలా ల్యాండ్ అయ్యిందనేది మాకు ఇప్పటికీ ఆశ్చర్యమే’ అని చెప్పుకొచ్చారు. ఇది 1989, నవంబర్ 14.. ఉదయాన్నే ‘వీక్లి వరల్డ్ న్యూస్’ పత్రిక చదివిన వారిని విస్మయపరచిన వార్త. ఆ నోట ఈ నోట విస్తృతంగా ప్రచారమై.. ప్రపంచమూ విస్తుపోయేలా చేసింది. 35వ ఏళ్ల క్రితం మిస్ అయిన విమానం తిరిగి రావడమేంటీ? పైగా ఒక అస్థిపంజరం పైలెట్ స్థానంలో కూర్చుని, విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేయడమేంటీ? అనే ప్రశ్నలు.. బ్రెజిల్, జర్మనీ దేశాలతో పాటు యావత్ ప్రపంచాన్నీ అనుమానంలోకి నెట్టాయి. ఈ ఘటనపై ‘విమానాశ్రయ అధికారుల అలసత్వం సరికాదు’ అంటూ పలువురు నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం నేర మని, ఆ విమానంలోని ప్రయాణికుల వివరాలు తెలుసుకుని.. ఆ సమాచారం వారి బంధువులకు పంపించండని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే, ప్రజలు భయాందోళనకు గురవుతారనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ వార్తను గోప్యంగా ఉంచుతోందనీ అనుకున్నారు. ఓ కట్టుకథ కొంతమంది మాత్రం.. ‘ఇదంతా ఓ కట్టుకథ, ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదు’ అని కొట్టిపారేశారు. ఐర్విన్ ఫిషర్ అనే విలేకరి రాసిన ఈ వార్త చుట్టూ భిన్నవాదనలు వెల్లువెత్తాయి. ప్రపంచ చరిత్రలో ఎయిర్‌క్రాఫ్ట్ లిస్ట్‌ను పరిశీలిస్తే.. 1856లో మొదటిసారి మిస్ అయిన హాట్ ఎయిర్ బెలూన్ దగ్గర నుంచి.. 2019లో గల్లంతయిన ఎమ్బీబీ బీవో 105 హెలికాప్టర్ వరకూ చూసుకుంటే ‘శాంటియాగో నం. 513’ అనే ఫ్లైట్ మిస్ అయినట్లు కాదు కదా కనీసం రికార్డ్‌ల్లో కూడా ఆ పేరుతో ఒక్క ఫ్లైట్ కనిపించలేదు. దీంతో ఇదొక ఫేక్ న్యూస్ అని కొట్టి పారేశారు అధికారులు. మరో విషయం ఏమిటంటే.. ‘వీక్లి వరల్డ్’ పత్రిక ఇలాంటి ఫిక్షన్ స్టోరీస్‌ని సృష్టించడంలో దిట్టని చాలా మంది నిరూపించారు. అయినా సరే కొందరు శాంటియాగో 513 టైమ్ ట్రావెల్లో చిక్కుకుందని.. ప్రభుత్వాలే నిజాన్ని దాచిపెడుతున్నాయని.. బలంగా నమ్మారు. దాంతో ఈ ఫ్లైట్ రిటర్న్స్ స్టోరీ మిస్టరీల సరసన చేరి కథలు కథలుగా ప్రచారమవుతోందిప్పటికీ! -సంహిత నిమ్మన చదవండి: USA Boy In The Box Mystery: నీలికళ్లు, లేత గోధుమరంగు జుట్టు.. పాపం చిన్నారి.. ఇంతకీ ఆ బాబు ఎవరు? -
చుట్టూ ఉన్నవాళ్లు ఏం చేస్తారో చూద్దామని ‘చనిపోయింది’!
సాధారణంగా కోరికలనేవి ప్రతి ఒక్కరికీ ఉంటాయి. అందులో కొన్ని వింతవి కూడా ఉంటాయి. ఇలాంటి వింత కోరికే ఓ మహిళకు కలిగింది. మనిషి బతికిఉన్నప్పుడు ఒకలా మరణించన తరువాత మరోలా సన్నిహితులు, ఇతరులు ప్రవర్తిస్తారని అంటారు కదా. అందుకే ఓ మహిళ తాను చనిపోతే ఎవరెవరు వస్తారు, వారు ఏం చేస్తారో చూడాలనుకున్నదంట.. అందుకు తానే మరణించినట్లు అందరినీ నమ్మించడానికి పడరాని పాట్లు పడిందో మహిళ. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఇలాంటి వారు కూడా ఉన్నారంటే నమ్మడం కొంచెం కష్టమైనా నమ్మాలి మరీ. వివరాల్లోకి వెళితే.. చిలీ రాజధాని శాంటియాగోకు చెందిన మైరా అలోంజో అనే మహిళ తాను చనిపోతే తరువాత తన చుట్టు జరిగే పరిణామాలను చూడాలనుకుందంట. అదేంటి చనిపోతే ఎలా చూస్తాం అనే సందేహం వస్తుంది కదా. అదే సందేహం ఆమెకు వచ్చింది. దీంతో ఎలాగైనా తన కోరికను నేరవేర్చుకోవాలనుకుంది. అందుకని ఆమెది డెత్ రిహార్సల్ చేయాలని నిర్ణయానికి వచ్చింది. అదే తడవుగా అద్దెకు లభించే లగ్జరీ శవపేటికను తెప్పించింది. ఫొటోగ్రాఫర్లను కూడా పిలిపించుకుంది. అంతా సిద్ధం చేసుకుని తెల్లటి దుస్తులతో మైరా.. తలపై పువ్వుల కిరీటం, ముక్కులో దూదిని పెట్టుకుని.. సంతాప సభ జరుగుతున్నట్లుగా ఏర్పాట్లు కూడా చేయించింది. అలా ఆమె దాదాపు మూడు గంటలపాటు శవపేటికలో పడుకుని చనిపోయినట్లు నటిస్తూనే ఉందంట. మహాతల్లి ఇదే నటన సనిమాల్లో ఇలా నటిస్తే ఆస్కార్ అయిన దక్కేదేమో అని అంటున్నారు చూసిన వాళ్లంతా. ఇందులో ఇంకో వింత ఏంటంటే.. ఈ డ్రామాలో ఆమె కుటుంబం, స్నేహితులు కూడా పూర్తి మద్దతుగా నిలిచి సహకరించడం. అంత్యక్రియల నాటకం మొదలుకాగానే కుటుంబ సభ్యులు నకిలీ కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికంతటికి ఆ మహిళ దాదాపు 710 యూరోలు ఖర్చు చేసినట్లు తెలిసింది. ఇలా ఉండగా, మైరా తీరును కొందరు ప్రశంసిస్తుండగా.. మరికొందరు విమర్శిస్తున్నారు. ఇటీవల ఎక్కడ చూసిన కరోనాతో చనిపోయినవారే ఎక్కువగా ఉన్నారు, ఇలా ప్రవర్తించి వారిని ఎగతాళి చేయడంలా ఉందని అది సరికాదని మైరా స్థానికులు అంటున్నారు. ( చదవండి: మరణం అంచున కన్నీటి వర్షంలో తల్లి.. చిన్నారికి చెప్పేదెలా! ) -
పాపం! ఏదో అనుకుంది: ఇంకేదో అయ్యింది
శాంటియాగో : వంట చేయటం అంత వీజీ కాదు! బ్యాచిలర్లకు ఆ కష్టం బాగా తెలుసు. నానా తంటాలు పడి వంట చేసి పెడితే, వంట రాని ఫ్రెండ్స్ దగ్గరినుంచి బాగోలేదని మూతి విరుపులు. అన్ని వేళలా రుచికరంగా వండటం సాధ్యపడే విషయం కాదు. కొన్నిసార్లు వంట చేయటంలో ఫెయిలవుతూ ఉంటాం. కానీ, చిలీకి చెందిన ఓ మహిళ మాత్రం వంట చేయకుండానే విఫలం అయింది. అయినా కూడా సోషల్ మీడియాలో పిచ్చ పాపులర్ అయింది. గత బుధవారం చిలీ.. శాంటియాగోకు చెందిన ఆండ్రూ పెర్సూ అలేగ్రియా అనే మహిళ బ్రెడ్ తయారు చేసే విధానాన్ని చూపెడుతూ ఓ వీడియో చేయాలనుకుంది. ( ‘బ్యూటీ విత్ బ్రెయిన్’ అంటే ఇదే..! ) అంతా సిద్ధం చేసుకుని బ్రెడ్డు కోసం పిండి ముద్దని అట్ల కర్రతో ఒత్తుతున్న నేపథ్యంలో పిండి ప్లేటు సరాసరి ముఖానికి వచ్చి తాకింది. దీంతో పిండి మొత్తం ఆమె ముఖానికి అంటుకుపోయింది. ప్రయత్నం అట్టర్ ఫ్లాప్ కావటంతో ఖంగుతిన్న సదరు మహిళ వీడియో తీయటం ఆపమని బ్రతిమాలుకుంది. ‘‘బ్రెడ్డు తయారు చేయటానికి ఓ కొత్త పద్దతి’’ అనే శీర్షికతో ఫేస్బుక్లో విడుదలైన ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దాదాపు 9 మిలియన్ల వీక్షణలను సొంతం చేసుకుంది. దీన్ని చూసిన నెటిజన్లు విపరీతంగా నవ్వుకుంటున్నారు. ( జలపాతంలో కొట్టుకుపోతున్న వ్యక్తిని.. ) -
చిలీలో విమానం గల్లంతు
శాంటియాగో : చిలీకి సంబంధించిన మిలటరీ విమానం ఒకటి సుమారు 38 మంది ప్రయాణీకులతో గల్లంతయ్యింది. దేశానికి దక్షిణాన ఉన్న ఓ స్థావరం నుంచి అంటార్కిటికా వెళ్లేందుకు టేకాఫ్ తీసుకున్న విమానం కూలిపోయి ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. సోమవారం ఉదయం సుమారు 4.55 గంటలకు సీ–130 విమానం పుంటా ఎరీనా నుంచి టేకాఫ్ తీసుకుందని, 6.13 గంటలకు సంబంధాలు తెగిపోయాయని చిలీ వైమానిక దళం ఒక ప్రకటనలో తెలిపింది. విమానంలో ఎమర్జెన్సీ పొజిషనింగ్ సిస్టమ్ అందుబాటులో ఉన్నప్పటికీ అది పనిచేస్తున్నట్లుగా లేదని వాయుసేన అధికారి ఎడ్యురాడో మోస్కూయిరా తెలిపారు. -
పెల్లుబికిన నిరసనలు.. మెట్రో స్టేషన్లకు నిప్పు
శాంటియాగో : చిలీలో ప్రజలు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. శుక్రవారం రోజున మొదలైన నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో పలువురు మరణించగా.. ఆందోళన చేపడుతున్న వందలాది మందిని అరెస్ట్ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. వివరాల్లోకి వెళితే.. మెట్రో చార్జీలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో.. జనాలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. వేల సంఖ్యలో ప్రజలు చిలీ రాజధాని శాంటియాగోలో ఆందోళనలకు దిగారు. రోడ్లపైకి వచ్చిన నిరసనకారులు మాస్క్‌లు ధరించి బీభత్సం సృష్టించారు. పలు చోట్ల బస్సులకు, మెట్రో స్టేషన్లకు, బ్యాంకులకు నిప్పు పెట్టారు. శాంటియాగోలో ఎక్కడ చూసిన మంటలు, దట్టమైన పొగలతో నిండిపోయింది. పలుచోట్ల నిరసనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. అలాగే బారీగా భద్రతా బలగాలను మోహరించారు. దీంతో ప్రభుత్వం కర్ఫ్యూ విధించడమే కాకుండా.. 15 రోజులపాలు ఎమర్జెన్సీ ప్రకటించింది. కాగా, చిలీలో నియంతృత్వ పాలన ముగిసిన తర్వాత ఇలాంటి హింసాత్మక ఆందోళన చోటుచేసుకోవడం ఇదే తొలిసారి. More subways trains are burning tonight in Chile; you don’t see police or firefighters in the video, oddly; @BorisvanderSpek reports the country’s President “announced he will not increase metro fares IF violent protests stop.” pic.twitter.com/cqNxK7aPZX — David Begnaud (@DavidBegnaud) October 19, 2019 -
సత్తాకు పరీక్ష సమయం
న్యూఢిల్లీ: ఏషియాడ్ బాక్సింగ్ పోటీల్లో ‘డ్రా’ కీలక పాత్ర పోషిస్తుందని, అయినా భారత బృందం విషయంలో దానికి పెద్దగా ప్రాధాన్యం లేదని భారత బాక్సింగ్ హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ శాంటియాగో నియెవా అన్నారు. అదే సమయంలో భారత బాక్సర్లకు వారి సత్తా తెలిసి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈనెల 18న మొదలయ్యే ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు బుధవారం ఇండోనేసియా పయనం కానున్న ఏడుగురు పురుషులు, ముగ్గురు మహిళలతో కూడిన బృందానికి భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ), స్పోర్ట్స్ ఇండియా మంగళవారం నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో శాంటియాగో మాట్లాడారు. ‘బలమైన ప్రత్యర్థులు ఎదురయ్యే ఈ పోటీ ప్రపంచంలో మనం ఏ స్థాయిలో ఉన్నామో తెలుసుకునేందుకు మంచి అవకాశం. వచ్చే ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్ ఉన్నందున ఓ రకంగా సత్తాకు పరీక్ష. పోటీ తేలికగా మాత్రం ఉండదు’ అని శాంటియాగో అన్నారు. బీఎఫ్ఐ అధ్యక్షుడు అజయ్ సింగ్ మాట్లాడుతూ... కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ క్రీడాకారులు బరిలో ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. అయినప్పటికీ కామన్వెల్త్ క్రీడల తరహాలో ప్రతి బాక్సర్ కనీసం ఒక పతకంతోనైనా రావాలని ఆయన ఆంకాక్షించారు. 75 కేజీల ఈవెంట్లో 2010 ఏషియాడ్‌లో స్వర్ణం, 2014లో కాంస్యం గెల్చుకున్న వికాస్ కృషన్... ప్రస్తుత బృందాన్ని అత్యుత్తమమైనదిగా అభివర్ణించాడు. ఇటీవలి కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం నెగ్గిన తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ (56 కేజీలు)... గతంలో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకాలు అందుకున్న శివ థాపా (60 కేజీలు), మహిళల విభాగంలో సర్జుబాలా దేవి (51 కేజీ), సోనియా (57 కేజీలు) ఇండోనేసియా వెళ్తున్నారు. మిగతా సభ్యులైన అమిత్ (49 కేజీలు), గౌరవ్ సోలంకి (52 కేజీలు), మనోజ్ (69 కేజీలు)లు సైతం కామన్వెల్త్లో పతకాలు కైవసం చేసుకున్నారు. ఏషియాడ్‌లో బాక్సింగ్ పోటీలు ఈ నెల 24న ప్రారంభమవుతాయి. పరిస్థితులకు అలవాటు పడేందుకు మన బృందం చాలా ముందుగానే బయల్దేరుతోంది. 2014 ఏషియాడ్‌లో భారత బాక్సర్లు ఒక స్వర్ణం, నాలుగు కాంస్యాలు... 2010లో రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, నాలుగు కాంస్యాలు నెగ్గారు. -
చిలీలో భూకంపం: రిక్టర్ స్కేల్ పై 6.4గా నమోదు
శాంటియాగో: దక్షిణ చిలీలోని తీర ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.4గా నమోదు అయిందని యూఎస్ జియోలాజికల్ సర్వీస్ శనివారం వెల్లడించింది. అయితే భూకంపం వల్ల ఎక్కడ ఆస్తి, ప్రాణ నష్టం కానీ జరగలేదని తెలిపింది. సునామీ వచ్చే అవకాశాలు లేవని ప్రకటించింది. రాజధాని శాంటియాగోకు 88 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించినట్లు జియోలాజికల్ సర్వే పేర్కొంది. ఈ భూకంపం శుక్రవారం రాత్రి సంభవించిందని తెలిపింది. -
నెయమార్ పై వేటు
సాంటియాగో:కోపా అమెరికా కప్‌లో భాగంగా కొలంబియాతో గురువారం జరిగిన మ్యాచ్ లో అనుచితంగా ప్రవర్తించిన బ్రెజిల్ స్టార్ ఆటగాడు, కెప్టెన్ నెయమార్ పై బహిష్కరణ వేటు పడింది. బ్రెజిల్ ఆడే తదుపరి నాలుగు మ్యాచ్ ల నుంచి నెయమార్ ను బహిష్కరిస్తున్నట్లు దక్షిణ అమెరికా ఫుట్ బాల్ గవర్నింగ్ బాడీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు క్రమశిక్షణా కమిటీ సభ్యులు శుక్రవారం నెయమార్ పై వేటు వేస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందే నెయమార్ ఒక ఎల్లో కార్డ్ బారిన పడటంతో.. అతనిపై వేటు తప్పలేదు. ఇటీవల కొలంబియాతో మ్యాచ్ లో బ్రెజిల్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. మ్యాచ్ ముగిశాక ఇరుజట్ల ఆటగాళ్లు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. కొలంబియా ఆటగాళ్లు రెచ్చగొట్టినా.. మ్యాచ్‌లో ఓపికగా ఉన్న స్టార్ ప్లేయర్ నెయ్మార్ మ్యాచ్ ముగిశాక అదుపుతప్పాడు. ఒక్కసారిగా గోల్ స్కోరర్ మురిలోను తలతో బాదాడు. దీంతో రెచ్చిపోయిన కొలంబియా ఆటగాళ్లు బ్రెజిల్ ప్లేయర్లపై తిరగబడ్డారు. ఇరుజట్ల ఆటగాళ్లు ఒకరినొకరు నెట్టుకున్నారు. సంఘటనకు కారకుడైన నెయ్‌మార్‌కు రిఫరీ రెడ్‌కార్డు ఇచ్చారు. -
బ్రెజిల్‌కు షాక్
సాంటియాగో: ప్రత్యర్థిపై వరుసగా 11 మ్యాచ్‌ల్లో విజయం... గత 24 ఏళ్లలో ఒక్కసారి కూడా ఓడని చరిత్ర.. ప్రస్తుత ఫామ్ పరంగా చూసినా తమదే పైచేయి... అయినా కోపా అమెరికా కప్‌లో ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ బ్రెజిల్‌కు ఊహించని షాక్ తగిలింది. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో కొలంబియా 1-0తో బ్రెజిల్‌పై విజయం సాధించింది. దీంతో గతేడాది జరిగిన ఫిఫా ప్రపంచ కప్ క్వార్టర్ఫైనల్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. కొలంబియా డిఫెండర్ జీసన్ మురిలో (36వ ని.) కొలంబియాకు ఏకైక గోల్ అందించాడు. ఆద్యంతం హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో బ్రెజిల్ మొరటుగా ఆడితే.. పక్కా ప్రణాళికతో కొలంబియా అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. 36వ నిమిషంలో రైట్ ఫ్లాంక్ నుంచి కడ్రాడో కొట్టిన ఫ్రీ కిక్ గోల్ పోస్ట్ ముందర డ్రాప్ అయ్యింది. అయితే అక్కడే ఉన్న మురిలో నేర్పుగా బంతిని అందుకుని లో షాట్‌తో గోల్ పోస్ట్‌లోకి పంపడంతో బ్రెజిల్ నివ్వెరపోయింది. రెండో అర్ధభాగంలోబ్రెజిల్ అటాకింగ్‌ను మరింత పెంచింది. చివరి వరకు గోల్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో బ్రెజిల్‌కు ఓటమి తప్పలేదు. నెయ్‌మార్‌కు రెడ్ కార్డ్ మ్యాచ్ ముగిశాక ఇరుజట్ల ఆటగాళ్లు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. కొలంబియా ఆటగాళ్లు రెచ్చగొట్టినా.. మ్యాచ్‌లో ఓపికగా ఉన్న స్టార్ ప్లేయర్ నెయ్మార్ మ్యాచ్ ముగిశాక అదుపుతప్పాడు. ఒక్కసారిగా గోల్ స్కోరర్ మురిలోను తలతో బాదాడు. దీంతో రెచ్చిపోయిన కొలంబియా ఆటగాళ్లు బ్రెజిల్ ప్లేయర్లపై తిరగబడ్డారు. ఇరుజట్ల ఆటగాళ్లు ఒకరినొకరు నెట్టుకున్నారు. సంఘటనకు కారకుడైన నెయ్‌మార్‌కు రిఫరీ రెడ్‌కార్డు ఇచ్చారు. కొలంబియా స్ట్రయికర్ బాకా కూడా రెడ్‌కార్డుకు గురయ్యాడు. -
ఎనిమిది నెలలు... ఇరవై కిలోలు!
పెద్ద పెద్ద బుగ్గలతో ఉన్న ఈ బాలభీముడిని చూశారా? తన తల్లి చేసిన తప్పిదం కారణంగా ఈ చిన్నారి బాబు కష్టాలు పడుతున్నాడు. ప్రపంచంలోనే అత్యంత బరువైన బేబీగా రికార్డు సృష్టించిన ఈ పిల్లవాడి పేరు శాంటియాగో మెండోజా. వయసు 8 నెలలు. బరువు దాదాపు 20 కిలోలు. బ్రిటన్‌కు చెందిన శాంటియాగో ప్రస్తుతం ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అతడి బరువును తగ్గించడానికి వైద్యులు తంటాలు పడుతున్నారు. లేకలేక పుట్టిన శాంటియాగో అంటే అతడి తల్లి యూనిస్‌కి పిచ్చి ప్రేమ. దాంతో కాస్త ఏడ్చినా తట్టుకోలేక పోయేదట. ఏడుపు ఆపడానికి వెంటనే పాలు పట్టడమో, ఉడికించిన బంగాళదుంప, కోడిగుడ్లు, బిస్కెట్లు లాంటివి పెట్టేసేదట. దాంతో ఇలా అయిపోయాడు శాంటియాగో. వెంటనే బాబు బరువును తగ్గించకపోతే ప్రాణానికే ప్రమాదమని వైద్యులు చెప్పడంతో... ‘ఇదంతా నా తప్పు వల్లే జరిగింది, నా బాబును కాపాడండి, మీరేం చెబితే అదే చేస్తాను’ అంటూ వేడుకుంటోందట యూనిస్. బిడ్డమీద ప్రేమ ఉండొచ్చు కానీ, వారిని ప్రమాదంలో పడేసేంత ఉండకూడదని ఆమెకిప్పటికి తెలిసివచ్చింది! -
చిలీలో భారీ భూకంపం : ఆరుగురి మృతి
శాంటియాగో(ఐఏఎన్ఎస్): దక్షిణ అమెరికా దేశం చిలీకి ఉత్తరాన పసిఫిక్ మహా సముద్రంలో మంగళవారం రాత్రి 11:46 గంటలకు భారీ భూకంపం సంభవించింది. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 4:30 గంటలకు రిక్టర్‌స్కేలుపై 8.2 త్రీవతతో ఈ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి రెండు మీటర్ల ఎత్తున సునామీ అలలు ఎగిసిపడుతూ చిలీ తీరాన్ని తాకాయి. సునామీ అలల వల్ల ఆరుగురు మరణించినట్లు చిలీ అధికారులు ప్రకటించారు. సముద్ర అలలు ఇంకా ఒక మీటరు ఎత్తున ఎగిసిపడుతున్నాయని, తీరప్రాంతంలోని సుమారు 6 లక్షల మందిని ఎతైన, సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు వెల్లడించారు. భూకంపం సుమారు రెండు నిమిషాల పాటు సంభవించింది. అనంతరం 10 గంటల తర్వాత కూడా ప్రకంపనలు వస్తున్నాయి. ఇప్పటిదాకా 17 సార్లు ప్రకంపనలు వచ్చాయని అధికారులు తెలిపారు. వందల సంఖ్యలో ఫిషింగ్ బోట్స్ దెబ్బతిన్నాయి. భూకంపం ధాటికి తీరప్రాంతంలోని పలు చోట్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. ప్రజలు ప్రాణభయంతో వీధుల్లోకి పరుగెత్తారు. పలుచోట్ల విద్యుత్ స్తంభించిపోయి అంధకారం అలుముకుంది. అయితే పెద్ద ఎత్తున ఆస్తినష్టం సంభవించలేదని విపత్తుల సహాయక సంస్థ వెల్లడించింది. ఉత్తర చిలీలోని ఇక్విక్ మైనింగ్ ఏరియాకు 86 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో 10 కిలో మీటర్ల లోతులోనే భూకంప కేంద్రం ఏర్పడినట్లు యూఎస్ జియోలజికల్ సర్వే వెల్లడించింది. కాగా చిలీ మధ్య, దక్షిణ ప్రాంతాల్లో 2010లో 8.8 తీవ్రతతో శక్తిమంతమైన భూకంపం సంభవించడంతో భారీ సునామీ ఏర్పడి పలు పట్టణాల్లో విధ్వంసమయ్యాయి. అప్పుడు సుమారు 500 మంది మరణించగా, 30 బిలియన్ డాలర్ల ఆస్తి నష్టం సంభవించింది. -
చిలీలో భూకంపం
చిలీ రాజధాని శాంటియాగోలోని మధ్య ప్రాంతంలో ఈ రోజు తెల్లవారుజామున భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే శుక్రవారం వెల్లడించింది. భూకంప తీవ్రత రిక్టార్ స్కేల్‌పై 6.6గా నమోదు అయిందని తెలిపింది. అయితే భూంకంపం వల్ల ప్రాణనష్టం కానీ ఆస్తినష్టం కాని సంభవించినట్లు ఇంకా తమకు సమాచారం అందలేదని పేర్కొంది. ప్రపంచంలో భూకంపం తరచుగా సంభవించే దేశాల్లో చీలి ఒకటని చెప్పింది. అయితే 2010లో సునామీ సందర్భంగా చిలీలో సంభవించిన భూకంపం వల్ల 500 మంది మృత్యువాత పడ్డారని అలాగే దాదాపు 2.5 లక్షల ఇళ్లు నేలమట్టమైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే ఈ సందర్భంగా గుర్తు చేసింది.