అనారోగ్యంగా ఉన్న పేషెంట్లు ముందుగా కోలుకునేంత వరకు బ్రెడ్‌లే పెడుతుంటారు. బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్ అయితే ఈజీ అని అందరూ దాన్నే ప్రిఫర్ చేస్తారు. పిల్లల కూడా జామ్, ఆమ్లెట్ వంటి వాటిని నొంచుకుని మరీ లాగిస్తుంటారు బ్రెడ్‌ల్ని. అయితే అవి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని వార్నింగ్ ఇస్తున్నారు వైద్యులు. ఆ బ్రెడ్‌లు ఆరోగ్యంపై తీవ్ర దుష్పరిణామాలను చూపిస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. ఇటీవల కాలంలో బ్రెడ్ ఎక్కువగా వినయోగించడం వల్లే ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
ఎందువల్ల ఇది ప్రమాదకారి అంటే..
►ఇంట్లో తయారు చేసే బ్రెడ్‌లో సాధారణమైన వాటినే కలుపుతాం. తాజాగా బ్రెడ్ తింటాం. అదే మార్కెట్లో లభించే బ్రెడ్ అయితే తాజాగా ఉండేందుకు సోడియం సల్ఫెట్, పోటాషియం మెటాబైసల్ఫైట వంటి వాటిని అధికమొత్తంలో కలుపుతారు. దీనివల్ల ఊబకాయం, జీవక్రియ రుగ్మతలు పెరిగే ప్రమాదం ఉంది. బ్రెడ్ మెత్తగా ఉండేందుకు వినియోగించే ఎమల్సిఫైయర్లు మైక్రోబయోమ్‌లు కారణంగా అధిక బరువు సమస్యను ఎదుర్కొనవల్సి వస్తుంది.
►నిల్వ ఉండేదుకు వాడే రసాయానాలు కారణంగా ఆస్తమా, శ్వాసకోస సంబంధిత సమస్యలు వస్తాయి. మార్కెట్లో లభించే బ్రెడ్‌లు స్వచ్ఛమైన గోధుమ పిండి లేదా మైదా పిండితో తయారవ్వవు. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది. దీని కారణంగా టైప్ 2 మధుమేహం వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి.
►మార్కెట్లో తయారయ్యే బ్రెడ్‌లో ఫైబర్ కంటెంట్ తక్కువుగా ఉంటుంది. దీని కారణంగా గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
కొన్ని బ్రెడ్‌లలో అధిక చక్కెర ఉంటుంది. ఇది ఊబకాయం, దంత క్షయం, ఇతర ఆరోగ్య సమస్య తలెత్తడమే గాక శరీరంలో అధిక కేలరీలు పెంచుతాయి.
►ఈ బ్రెడ్‌లకు కుత్రిమ రంగులు జోడించటం వల్ల ఆరోగ్య సమస్యలు మరింత తీవ్రతరం అయ్యే అవకాశాన్ని పెంచుతుంది.
గమనిక: ఎప్పుడూ బ్రెడ్ కొనేటప్పుడూ అందులో వాడే పదర్థాల మోతాదును చదివి ఎప్పుడూ తయారయ్యింది తదితర వివరాలు చదివిగానీ తీసుకోకండి. సాధ్యమైనంత మేర ఇంట్లో తయారయ్యే బ్రెడ్‌నే వినయోగించండి.
(చదవండి: ఆ వ్యాధి క్యాన్సర్ కంటే ప్రాణాంతకం! చికిత్స కూడా లేదు!)
Comments
Please login to add a commentAdd a comment