Viral: ‘పంది పిల్లకు పాలిచ్చి, శునకం తల్లి ప్రేమను చాటింది’ | Small Pig Feed On Milk From Dog Video Viral At West Godavari District | Sakshi
Sakshi News home page

Viral: ‘పంది పిల్లకు పాలిచ్చి, శునకం తల్లి ప్రేమను చాటింది’

Published Wed, Oct 6 2021 12:59 PM | Last Updated on Wed, Oct 6 2021 4:51 PM

Small Pig Feed On Milk From Dog Video Viral At West Godavari District - Sakshi

సాధారణంగా అన్ని జీవాలకు ఆకలి బాధలు ఒకేలా ఉంటాయి. ఒక్కోసారి తీవ్రమైన ఆకలితో వాటికి జాతి వైరం కూడా గుర్తుకురాదు. అలా కొన్ని జంతువుల పిల్లలు.. ఇతర జంతువుల చెంతకు చేరి పాలు తాగి తమ ఆకలి తీర్చుకున్న సందర్భాలను చూశాం. తాజాగా ఓ చిన్న పంది పిల్ల ఆకలి వేయడంతో శునకం పాలు తాగింది.

ఆ పందిపిల్ల పాలు తాగుతున్న క్రమంలో శునకం మరో చోటుకి వెళ్లుతుంది. కానీ, పంది పిల్లకు ఎంత ఆకలి ఉందో? దాని వెంటనే పరుగెడుతూ మళ్లీ శునకం దగ్గరుకు వెళ్లీ పాలు తాగుతుంది. దీంతో శునకం అక్కడే ఉండి పంది పిల్ల ఆకలి తీర్చుతుంది. ఈ వింత ఘటన పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో మంగళవారం చోటుచేసుకుంది.

స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమీపంలోని వీధిలో శునకం పంది పిల్లకు పాలు ఇచ్చింది. దీన్ని ఆ ప్రాంత ప్రజలు ఆశ్చర్యంగా తిలకించారు. జాతి వైరం వీడి పంది పిల్లకు పాలిచ్చి, శునకం తల్లి ప్రేమను చాటిందని పలువురు పేర్కొన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement