Usage Of Spoiled Milk: ఇంట్లో ఒక్కోసారి పాలు విరిగిపోతుంటాయి. అయ్యో పాలు విరిగిపోయాయే! అని బాధపడక్కర్లేదు. ఎందుకంటే విరిగిన పాలను కూడా మనకు ఉపయోగపడే విధంగా మార్చుకోవచ్చు.
చదవండి: తక్కువ ప్యాకేజీ.. జమ్మూ కశ్మీర్ వెళ్లొస్తారా..?
► చపాతి, రోటీ, పరోటాల కోసం పిండి కలిపేటప్పుడు విరిగిన పాలను దానిలో పోసి పిండిని ముద్దగా కలిపి చపాతీలు చేస్తే..చపాతీలు మృదువుగా, రుచిగా వస్తాయి.
► కూర చేసేటప్పుడు గ్రేవీకోసం నీళ్లుపోయకుండా విరిగిన పాలను పోసి ఉడికిస్తే కూర రంగు, రుచి కూడా బావుంటుంది. పోషకాలు కూడా పెరుగుతాయి.
► కేక్‌ల తయారీలో బేకింగ్ సోడాకు బదులు విరిగిన పాలను వాడటం వల్ల కేక్ సాఫ్ట్‌గా, టేస్టీగా వస్తుంది.
చదవండి: Weight Loss: బరువు తగ్గాలా.. ‘గ్రీన్ కాఫీ’ ట్రై చేయండి!
Comments
Please login to add a commentAdd a comment