spoiled
-
భక్తులకు ప్రసాదంగా బూజ్ పట్టిన లడ్డూలు
-
భద్రాద్రి: భద్రాచలంలో బూజుపట్టిన లడ్డూలు.. భక్తుల కౌంటర్ నిరసన
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో మరోసారి బూజు పట్టిన లడ్డూల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్వామివారి దర్శనం అనంతరం లడ్డూ ప్రసాదం కొనుగోలు చేసిన కొందరు భక్తులకు షాక్ తగిలింది. లడ్డూలు వాసన వస్తుండడంతో సిబ్బందిని నిలదీశారు భక్తులు. బూజు పట్టిన లడ్డూలు ఎలా విక్రయిస్తారని కౌంటర్ సిబ్బందిని నిలదీశారు భక్తులు.ఈ క్రమంలో.. ‘ఇచ్చట బూజు పట్టిన ప్రసాదం లడ్డూలు ఇస్తారు’’ అని పేపర్ మీద రాసి లడ్డూ కౌంటర్‌కి అతికించి నిరసన వ్యక్తం చేశారు. గతంలో లడ్డూలు మాయం కావడంపై తీవ్ర దుమారం రేగి.. చర్చ నడిచి దర్యాప్తు దాకా వెళ్లింది. తాజా ఘటనతో.. లడ్డూల నాణ్యత వ్యవహారంపై చర్చ నడుస్తోంది. ఈ వ్యవహారంపై సిబ్బంది స్పందించాల్సి ఉంది. -
పాలు విరిగాయా? వర్రీ అవద్దు.. ఇలా ఉపయోగించండి!
Usage Of Spoiled Milk: ఇంట్లో ఒక్కోసారి పాలు విరిగిపోతుంటాయి. అయ్యో పాలు విరిగిపోయాయే! అని బాధపడక్కర్లేదు. ఎందుకంటే విరిగిన పాలను కూడా మనకు ఉపయోగపడే విధంగా మార్చుకోవచ్చు. చదవండి: తక్కువ ప్యాకేజీ.. జమ్మూ కశ్మీర్ వెళ్లొస్తారా..? ► చపాతి, రోటీ, పరోటాల కోసం పిండి కలిపేటప్పుడు విరిగిన పాలను దానిలో పోసి పిండిని ముద్దగా కలిపి చపాతీలు చేస్తే..చపాతీలు మృదువుగా, రుచిగా వస్తాయి. ► కూర చేసేటప్పుడు గ్రేవీకోసం నీళ్లుపోయకుండా విరిగిన పాలను పోసి ఉడికిస్తే కూర రంగు, రుచి కూడా బావుంటుంది. పోషకాలు కూడా పెరుగుతాయి. ► కేక్‌ల తయారీలో బేకింగ్ సోడాకు బదులు విరిగిన పాలను వాడటం వల్ల కేక్ సాఫ్ట్‌గా, టేస్టీగా వస్తుంది. చదవండి: Weight Loss: బరువు తగ్గాలా.. ‘గ్రీన్ కాఫీ’ ట్రై చేయండి! -
పచ్చళ్లు కొంటున్నారా.. క్షణం ఆలోచించండి
-
ఆశ చావక..
– వర్షాభావంతో ఎండిన వేరుశనగ పంట – గ్రాసమైనా మిగులుతుందని పక్వానికి రాకనే చెట్లు పీకివేస్తున్న రైతులు తీవ్ర వర్షాభావంతో వేరుశనగ పంట చేజారిపోయింది. ప్రభుత్వం రెయిన్గన్ల ద్వారా తడులు ఇచ్చేశాం.. అంటూ ఆర్భాటంగా ప్రకటనలు చేసింది గానీ ప్రయోజనం శూన్యమే. రైతుల్లో నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి. కనీసం ఉన్న కాస్త చెట్టు పశుగ్రాసానికైనా దక్కితే చాలని రైతులు భావిస్తున్నారు. పూర్తిగా ఎండిపోయే దశలో ఉన్న వేరుశనగ చెట్లను పక్వానికి రాకుండానే పీకేసేందుకు సిద్ధమయ్యారు. చిత్తూరు (అగ్రికల్చర్): వేరుశనగ రైతు ఆశలు ఎండిపోయాయి. ఎకరం పంటను కూడా ఎండనివ్వమని ముఖ్యమంత్రి, మంత్రులు హంగామా చేశారు. హడావుడిగా పర్యటించారు. కానీ ఫలితం శూన్యం. పంట పూర్తిగా ఎండిపోయింది. ఈ ఖరీఫ్ సీజను ప్రారంభంలో వర్షాలు బాగా కురవడంతో వేరుశనగ పంటపై రైతులకు ఆశలు చిగురించాయి. జిల్లాలోని 1.21 లక్షల హెక్టార్లలో వేరుశనగ పంట సాగు చేశారు. గత 40 రోజులుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులతో వేరుశనగ పంట పూర్తిగా దెబ్బతింది. ప్రభుత్వం పది రోజుల క్రితం రెయిన్ గన్ల ద్వారా ఎండిన వేరుశనగ పంటను తడులు ఇచ్చి కాపాడేస్తామంటూ హామీలు గుప్పించింది. జిల్లావ్యాప్తంగా రెయిన్ గన్ల ద్వారా పంటలకు చాలీచాలని తడులు ఇచ్చేసి, మొత్తం పంటను తడిపేశామంటూ ప్రకటించేసింది. మొదట ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించారు. తర్వాత నలుగురు మంత్రులు జిల్లాలో తిష్టవేసి వేరుశనగ పంటకు తడులు ఇవ్వడాన్ని పర్యవేక్షించారు. ఎకరాకు 4 ట్యాంకర్ల మేరకు మాత్రమే నీటిని సరఫరా చేసి తడులు ఇచ్చారు. ఈ చాలీచాలని తడులు ఏమాత్రం సరిపోలేదు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కనీసం ఉన్నకాస్త చెట్లయినా పశుగ్రాసంకు దక్కితే చాలని భావించి పంట మధ్య దశలోనే పీకేస్తున్నారు. బంగారుపాళ్యం మండలం బేరుపల్లికి చెందిన రైతు కృష్ణమందడికి 2 ఎకరాల మామిడి తోటలో అంతర పంటగా వేరుశనగ పంట సాగు చేశాడు. 40 రోజులుగా నెలకొన్న తీవ్ర వర్షాభావంతో పంట ఎండిపోయింది. పంట ఎండుముఖం పట్టిన సమయంలోనే రెయిన్గన్లతో తడులు అందించాలని అధికారులను ఆశ్రయించినా పట్టించుకోలేదు. ఎండిన చెట్లను పశుగ్రాసానికైనా ఉపయోగపడుతుందని ఆయన భావించాడు. గురువారం ఆయన కుమారుడు ధనంజయ, భార్య నవనీతమ్మ పంటకు బిందెలతో నీళ్లు పోసి తడిపి పంట పక్వానికి రాకనే చెట్లు పీకేశారు. తీవ్రంగా నష్టపోయాం వర్షాలు లేకపోవడంతో వేరుశనగ పంటలో తీవ్రంగా నష్టపోయాం. రెండెకరాల్లో వేరుశనగ పంట సాగుచేసేందుకు ఇప్పటికి రూ. 15 వేలు ఖర్చయింది. కనీసం పశువులకైనా తినేందుకు ఉపయోగపడుతుందని కాయలు కోసం ఎదురుచూడకుండా చెట్లు పెరుకుతున్నాం. – నవనీతమ్మ , మహిళారైతు , బేరుపల్లి -
రూ.కోటి విలువ చేసే గంజాయి పంట ధ్వంసం
మెదక్: మెదక్ జిల్లాలో గుట్టుగా సాగుతున్న గంజాయి సాగును గురువారం పోలీసులు రట్టు చేశారు. నారాయణఖేడ్ సీఐ సైదానాయక్ కథనం ప్రకారం.. రేగోడ్ మండలం సిందోల్లో ప్రభాకర్‌రెడ్డి అనే వ్యక్తి తన ఎకరన్నర చేనులో గంజాయి పంటను సాగు చేస్తున్నాడు. పొలంలో ఐదువేల మొక్కల్లో కొంత పంటను కోసి ఆరబెట్టాడు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కోతకు వచ్చిన గంజాయి మొక్కలను ధ్వంసం చేసి ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి పంట విలువ సుమారు రూ.కోటి వరకు ఉంటుంది. నిందితుడు ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.