మెదక్: మెదక్ జిల్లాలో గుట్టుగా సాగుతున్న గంజాయి సాగును గురువారం పోలీసులు రట్టు చేశారు. నారాయణఖేడ్ సీఐ సైదానాయక్ కథనం ప్రకారం.. రేగోడ్ మండలం సిందోల్లో ప్రభాకర్‌రెడ్డి అనే వ్యక్తి తన ఎకరన్నర చేనులో గంజాయి పంటను సాగు చేస్తున్నాడు.
పొలంలో ఐదువేల మొక్కల్లో కొంత పంటను కోసి ఆరబెట్టాడు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కోతకు వచ్చిన గంజాయి మొక్కలను ధ్వంసం చేసి ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి పంట విలువ సుమారు రూ.కోటి వరకు ఉంటుంది. నిందితుడు ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రూ.కోటి విలువ చేసే గంజాయి పంట ధ్వంసం
Published Thu, Nov 5 2015 8:23 PM | Last Updated on Sun, Sep 3 2017 12:04 PM
Advertisement