వర్షాకాలంలో సైతం కొంతమంది చర్మం తేమలేక పొడిబారడమే గాక, మొటిమలతో విసిగిస్తుంటుంది. ఇటువంటి చర్మానికి తేనె, వేప, పాలతో తయారైన ఫేస్‌ప్యాక్ మంచి పరిష్కారం చూపుతుంది. వేప.. మొటిమలను తగ్గిస్తే... తేనె చర్మానికి తేమనిస్తుంది.
వారానికి మూడు సార్లు ఈ ప్యాక్ వేసుకుంటే!
రెండు టేబుల్ స్పూన్ల వేపాకు పేస్టులో టేబుల్ స్పూను తేనె, ఒకటిన్నర టేబుల్ స్పూన్ల పచ్చి పాలు పోసి పేస్టులా కలపాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఆరాక గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
వారంలో మూడుసార్లు ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల మొటిమలు పోయి ముఖం ఫ్రెష్‌గా కనిపిస్తుంది.
కాంతివంతమైన ముఖం కోసం..
ఒక స్పూను శనగపిండి, ఒక స్పూను పెరుగు, అర స్పూను తేనె కలిపి... ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఆరిన తర్వాత చన్నీటితో కడగాలి.
రోజూ ఇలా చేస్తే ముఖం కాంతివంతంగా ఉంటుంది.
దీనిని అన్ని రకాల చర్మతత్వాల వాళ్లూ పాటించవచ్చు. అయితే డ్రైస్కిన్‌కి మీగడ పెరుగు, ఆయిలీ స్కిన్ వాళ్లు మీగడ లేని పెరుగు వాడాలి.
చదవండి: Yami Gautam: నా బ్యూటీ సీక్రెట్ అదే! ఇలా చేస్తే చర్మం నిగనిగలాడుతుంది
Comments
Please login to add a commentAdd a comment