Rajahmundry: కలకలం.. కల్తీపాలు తాగి ఇద్దరు మృతి | Sale Of Adulterated Milk Has Created A Stir In Lala Cheruvu Area Of Rajahmundry, Two Dead And Several Hospitalized | Sakshi
Sakshi News home page

Rajahmundry: కలకలం.. కల్తీపాలు తాగి ఇద్దరు మృతి

Feb 22 2026 7:18 PM | Updated on Feb 23 2026 11:01 AM

The sale of adulterated milk has created a stir in the Lala Cheruvu area of Rajahmundry

తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి లాలా చెరువు ప్రాంతంలో కల్తీ పాలు కలకలం సృష్టించాయి. కల్తీపాలు తాగి ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తుంది. ముృతులు కృష్ణవేణి (85,కనకరత్నం(70)గా పోలీసులు చెబుతున్నారు. మరణాలపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

స్థానిక పోలీసుల వివరాల మేరకు.. చౌడేశ్వరి నగర్‌లో పాలు తాగిన చిన్నారులు,వృద్ధులు అనారోగ్యానికి గురయ్యారు. అనారోగ్యానికి గురైన బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులు రాజమండ్రిలోని పలు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే, వీరిలో పలువురికి కిడ్నీలు పాడైనట్లు తెలుస్తోంది.

ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు కల్తీపాలే కారణమని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో బాధితులకు పాలు పోసిన వ్యక్తి గణేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement