Milk Warmer: బుజ్జాయిల పాల కోసం ఈ డివైజ్‌.. ధర ఎంతంటే! | Milk Warmer: How It Works And Price Details In Telugu | Sakshi
Sakshi News home page

Milk Warmer: బుజ్జాయిల పాల కోసం ఈ డివైజ్‌.. ధర ఎంతంటే!

Published Tue, May 17 2022 3:01 PM | Last Updated on Tue, May 17 2022 3:10 PM

Milk Warmer: How It Works And Price Details In Telugu - Sakshi

నెలల పసికందు దగ్గర నుంచి ఐదారేళ్ల పిల్లల దాకా.. వాళ్లకు ఎప్పుడు ఆకలేస్తుందో? ఎందుకు ఏడుస్తారో? అనేది ఊహించడం కష్టం. ఒకవేళ ఏ అర్ధరాత్రో వారికి ఆకలేసి ఏడిస్తే.. అప్పటికప్పుడు పాలు కాచి, చల్లార్చి తాగించాలంటే చాలా సమయం పడుతుంది. ఓ పక్క వాళ్ల ఏడుపు.. మరో పక్క మిగిలిన వారికి నిద్రాభంగం.. ఇలా అన్ని సమస్యలకు చెక్‌ పెడుతుంది ఈ మిల్క్‌ వార్మర్‌.

ఇందులో రెండు పాల బాటిల్స్‌ను కూల్‌గా ఉంచి, పాలు విరిగిపోకుండా స్టోర్‌ చేయడంతో పాటు ఐదే ఐదు నిమిషాల్లో గోరువెచ్చటి పాలను అందిస్తుంది. ఈ డివైజ్‌ను బెడ్‌ రూమ్‌లోనే పవర్‌ సాకెట్‌ దగ్గర అమర్చుకుని.. స్విచ్‌ ఆన్‌ చేసుకుని పెట్టుకుంటే చాలు. డివైజ్‌ వెనుకవైపు భాగం ప్రత్యేకమైన మూత కలిగి ఉంటుంది. దానిలో రెండు పాల బాటిళ్లను ఉంచితే ఏ కాలంలోనైనా చల్లగా నిలువ ఉంటాయి.

బిడ్డ ఏడవడం మొదలుపెట్టిన వెంటనే.. అందులోని ఒక పాల బాటిల్‌ను ముందువైపు చిత్రంలో ఉన్న విధంగా పెట్టు కోగానే.. 5 నిమిషాల్లో పాలు వేడెక్కుతాయి. భలే ఉంది కదూ? ఈ డివైజ్‌ బెడ్‌ రూమ్‌లో ఉంటే.. ఎప్పుడుపడితే అప్పుడు కిచెన్‌లోకి వెళ్లాల్సిన పనిలేదు. పిల్లలు పాలకోసం ఎక్కువ సేపు వేచి చూడాల్సిన అవసరమూ ఉండదు
ధర 107 డాలర్లు (రూ.8,249) 

చదవండి👉🏾Pasta Noodle Maker: పాస్తా, నూడుల్స్‌ ఇలా ఈజీగా.. ఈ డివైజ్‌ధర రూ. 1,990

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement