
నూతన సంవత్సరం సందర్భంగా చాలమంది పలురకాలుగా సెలబ్రేట్ చేసుకుంటారు. కొంతమంది ప్రజల హితం కోరి విన్నూతన పద్ధతుల్లో వేడకను జరుపుకుంటున్నారు. అచ్చం అలానే పుణేకి చెందిన వ్యక్తి కూడా న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా విచిత్ర వేషధారణలో మద్యం మానేయండి అంటూ విన్నూతనంగా ప్రచారం చేశాడు.
(చదవండి: డబ్బులు కోసం ఏకంగా 14 సార్లు కరోనా వ్యాక్సిన్లా?)
అసలు విషయంలోకెళ్లితే...పుణెకు చెందిన ఓ వ్యక్తి రావణుడి వేషధారణలో కొత్త సంవత్సరం సందర్భంగా నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద పాల ప్యాకెట్లు పంచి పెడుతూ మద్యానికి స్వస్తి పలకాలని ప్రజలను కోరారు. ప్రజలు మద్యం తాగి రావణుడిలా ప్రవర్తిస్తున్నారని అందుకే మీలోని రావడుడిని విడిచిపెట్టి మద్యానికి స్వస్తి పలకేందుకే తాను రావణుడి వేషం వేసుకున్నాని అరుణ్ ఓహర్ అన్నారు.
ఈ మేరకు అక్కడ స్థానిక నాయకుడు ఒకరు మాట్లాడుతూ.." సమాజంలో మద్యపాన వ్యసనం పెరుగుతోంది. దీని ఫలితంగా అనేక కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా మద్యపానాన్ని వదిలివేయమని ప్రజలను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నాం" అని అన్నారు. పైగా ఈ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా చాలామంది తాగి నానా రచ్చ చేస్తుంటారని కూడా చెప్పారు. ఈ వేడకను ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలనే చెప్పేందుకు తాను ఈ విధంగా రావణుడి వేషం ధరించి పాల ప్యాకెట్లు పంచిపెడుతున్నాను అని రావణ వేషధారి అరుణ్ ఓహర్ అన్నారు.
(చదవండి: అందంగా అలంకరించిన ఆ క్రిస్మస్ చెట్టే వాళ్లను జైలుపాలు చేసింది!!)
Comments
Please login to add a commentAdd a comment