ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) లైసెన్స్ నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ నెంబర్ కింద A1, A2 పేరుతో పాలు, నెయ్యి లేదా పాల ఉత్పత్తులను విక్రయించడంపై స్పష్టతనిచ్చింది. అన్ని పాల ఉత్పత్తుల మీద ఏ1, ఏ2 క్లెయిమ్‌లను తొలగించాలని వెల్లడించింది.
ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు కూడా ఈ క్లెయిమ్‌లను వెంటనే తమ వెబ్‌సైట్‌ల నుంచి తొలగించాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. ఇప్పటికే ఈ లేబుల్స్ ముద్రించి ఉంటే.. అలంటి వాటిని తొలగించడానికి ఆరు నెలల గడువు కూడా ఇచ్చింది. లేబులింగ్స్ అనేవి కస్టమర్లను తప్పుదోవ పట్టించేవిధంగా ఉన్నాయని, ఇవి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006కు అనుకూలంగా లేదని స్పష్టం చేసింది.
ఏ1, ఏ2 పాలలో ప్రోటీన్లు వేరు వేరుగా ఉంటాయని పరిశోధనల్లో తేలింది. ఈ రెండు కేటగిరీల పాలలోని ప్రయోజనాలపై సరైన శాస్త్రీయ ఆధారాలు లేకపోవడం వల్ల ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి తప్పకుండా అందరూ ఈ నియమాలను పాటించాలని.. మళ్ళీ గడువు పొడిగించే ప్రసక్తి లేదని ఎఫ్ఎస్ఎస్ఏఐ స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment