
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలో అరుదైన ఆపరేషన్ జరిగింది. ఓ మహిళ కడుపులో నుంచి రెండున్నర కిలోల వెంట్రుకలు బయటకు తీసిన వైద్యులు ఆమె క్షేమంగా ఉందని తెలిపారు. కాగా మానసిక స్థితి సరిగా లేని సదరు మహిళకు వెంట్రుకలు పీక్కొని తినే అలవాటుంది. దీంతో ఆమెకు ఈ మధ్య తరచూ కడుపు నొప్పి రావడం మొదలైంది. ఈ నేపథ్యంలో మరోసారి ఆమెకు తీవ్రంగా కడుపు నొప్పి రావంతో బంధువులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె కడుపులో వెంట్రుకలు ఉన్నాయని గుర్తించారు. వెంటనే శస్త్రచికిత్స చేసి కడుపులో నుంచి రెండున్నర కిలోల వెంట్రుకలను తీసివేశారు. శస్త్రచికిత్స విజయవంతం కావడంతో రోగి బంధువులు హర్షం వ్యక్తం చేశారు. (చదవండి: ‘విమానం’ మోత)