rare operation
-
గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో అరుదైన ఆపరేషన్
-
మహిళ కడుపులో రెండున్నర కిలోల వెంట్రుకలు..
సాక్షి, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలో అరుదైన ఆపరేషన్ జరిగింది. ఓ మహిళ కడుపులో నుంచి రెండున్నర కిలోల వెంట్రుకలు బయటకు తీసిన వైద్యులు ఆమె క్షేమంగా ఉందని తెలిపారు. కాగా మానసిక స్థితి సరిగా లేని సదరు మహిళకు వెంట్రుకలు పీక్కొని తినే అలవాటుంది. దీంతో ఆమెకు ఈ మధ్య తరచూ కడుపు నొప్పి రావడం మొదలైంది. ఈ నేపథ్యంలో మరోసారి ఆమెకు తీవ్రంగా కడుపు నొప్పి రావంతో బంధువులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె కడుపులో వెంట్రుకలు ఉన్నాయని గుర్తించారు. వెంటనే శస్త్రచికిత్స చేసి కడుపులో నుంచి రెండున్నర కిలోల వెంట్రుకలను తీసివేశారు. శస్త్రచికిత్స విజయవంతం కావడంతో రోగి బంధువులు హర్షం వ్యక్తం చేశారు. (చదవండి: ‘విమానం’ మోత) -
ఇండో యూఎస్ ఆస్పత్రిలో అరుదైన చికిత్స
-
హైదరాబాద్‌లో వైద్యుల సరికొత్త రికార్డు
-
పసికందుకు అరుదైన శస్త్రచికిత్స
650 గ్రాముల బరువుతో పుట్టిన చిన్నారి సంజీవి ఆస్పత్రి వైద్యుల ఘనత కాకినాడ వైద్యం (కాకినాడ సిటీ) : తక్కువ బరువుతో పరిపక్వత లేకుండా జన్మించిన చిన్నారిని అత్యాధునిక చికిత్సతో కాకినాడలోని వైద్యులు సంపూర్ణ ఆరోగ్యవంతుడిని చేశారు. స్థానిక జయా రెసిడెన్సీలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంజీవి ఆస్పత్రి ఎండీ డాక్టర్ నెక్కంటి సూర్యప్రసాద్ ఈ కేసు వివరాలను ఇలా వెల్లడించారు. కాకినాడకు చెందిన బొండా నాగేశ్వరరావు, వీరలక్ష్మి దంపతులకు వివాహమైన ఎనిమిదేళ్ల తరువాత వీరలక్ష్మి గర్భం దాల్చింది. ఆలస్యంగా గర్భధారణ, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం తదితర కారణాలకు గర్భంలోని పిండంలోనే శిశువుకు ఎస్‌ఎల్‌ఈ వ్యాధి సోకింది. దీంతో పూర్తి స్థాయిలో ఎదుగుదల లోపించింది. పరిస్థితి విషమించడంతో ఆమెకు స్థానిక గాంధీనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో సిజేరియ¯ŒS చేశారు. కేవలం 650 గ్రాముల బరువు, ఊపిరితిత్తులు, ప్రేగులు, మెదడు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్న శిశువుకు ఆమె జన్మనిచ్చింది. ఈ పరిస్థితుల్లో, జనవరి 4న ఆమెను బంధువులు సంజీవి ఆస్పత్రిలో చేర్పించారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఆ శిశువుకు ప్రముఖ నియోనెటాలజిస్ట్ డాక్టర్ అంగర రవి ఆధ్వర్యంలో అత్యాధునిక వైద్య పరికరాలతో వైద్యం చేశారు. మూడు నెలల అనంతరం బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంగా సాధారణ స్థితికి చేరింది. ప్రస్తుతం ఈ శిశువు ఎలాంటి రుగ్మతలు, సైడ్ ఎఫెక్టులు లేకుండా పూర్తి ఆరోగ్యంతో రెండు కిలోల బరువుకు చేరుకున్నట్టు ఆయన వివరించారు. ఈ సమావేశంలో డాక్టర్ పి.సుబ్బారావు, డాక్టర్ రమ్య, డాక్టర్ కె.శ్రావణి, డాక్టర్ వి.శ్రీనివాస్, డాక్టర్ రామారావు, డాక్టర్ కిన్నెర, డాక్టర్ అనుపమ పాల్గొన్నారు. అరుదైన కేసు ఇది.. పలు సమస్యలతో అపరిపక్వతగా జన్మించిన ఈ బిడ్డకు తిరిగి సంపూర్ణ ఆరోగ్యంగా చేయడం అరుదైన సంఘటనని నియోనెటాలజిస్ట్ డాక్టర్ అంగర రవి అన్నారు. అయిదేళ్లలో తక్కువ బరువు ఉన్న చిన్నారులకు వైద్యం చేశానని, ఇంతటి సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్న శిశువుకి అరుదైన వైద్యం చేయడం ఇదే తొలిసారని చెప్పారు. తమ చిన్నారికి వైద్యుడు రవి ప్రాణదానం చేశారని తల్లిదండ్రులు నాగేశ్వరరావు, వీరలక్ష్మి దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. -
గాంధీ ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్
హైదరాబాద్: ఓ పదేళ్ల బాలుడు ఆడుకుంటూ పొరపాటున విజిల్ ను మింగాడు. దీంతో అతడి నోటి నుంచి వింతవింత శబ్దాలు రావడం మొదలైంది. ఈ శబ్దాలు విన్న తల్లిదండ్రులు బెంబేలెత్తిపోయారు. అతడు విజిల్ మింగిన విషయం తెలియక.. అతన్ని తీసుకొని ప్రైవేటు ఆస్పత్రులన్నింటి చుట్టూ తిరిగారు. అయినా, ఎంతకూ సమస్య పరిష్కారం కాకపోవడంతో గాంధీ ఆస్పత్రిని ఆశ్రయించారు. గాంధీ ఆస్పత్రి ఈఎన్టీ వైద్యులు బాలుడి ఊపిరితిత్తులలో విజిల్ ను గుర్తించారు. కష్టసాధ్యమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి.. బాలుడి ఊపిరితిత్తుల నుంచి విజిల్ ను బయటకు తీశారు. ప్రస్తుతం బాలుడు సురక్షితంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన గాంధీ వైద్యులపై ప్రశంసల జల్లు కురుస్తోంది. -
గాంధీ ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్
గాంధీ ఆస్పత్రి: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్ నిర్వహించారు. మహిళ చెవి పక్కన పెరుగుతున్న ఆరుకిలోల బరువుగల కణితిని విజయవంతంగా తొలగిం చారు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం పేరినసింగారం గ్రామానికి చెందిన నాగమ్మ (56) ఎడమచెవికి ఆనుకుని పెరుగుతన్న కణితితో 20 ఏళ్లుగా బాధపడుతోంది. పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చూపించినా ఫలితం లేకపోయింది. స్థానిక వైద్యుల సూచన మేరకు ఈనెల 12న గాంధీ ఆస్పత్రికి వచ్చింది. వైద్యపరీక్షలు నిర్వహించి ఇన్‌పేషెంట్‌గా చేర్చుకుని సర్జరీ వైద్యుడు ఆర్. రఘు ఆధ్వర్యంలో సోమవారం సుమారు రెండున్నర గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించి కణితిని తొలగించారు. దీనిని పేరోటిడ్ ట్యూమర్ అంటారని, 25 ఏళ్ల క్రితం శస్త్రచికిత్స చేసి ట్యూమర్‌ను తొలగించినా మళ్లీ పెరిగిందని డాక్టర్ రఘు తెలిపారు. రెండోసారి ఆపరేషన్ ప్రమాదంతో కూడుకున్నదైనప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకుని విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించామన్నారు. నాగమ్మ కోలుకుంటుందన్నారు. లక్షలాది రూపాయల వ్యయం అయ్యే అరుదైన ఆపరేషన్‌ను గాంధీ ఆస్పత్రిలో ఉచితంగా నిర్వహించామన్నారు. ఆపరేషన్ నిర్వహించిన వైద్యు లు ఆర్.రఘు, ఎల్.రమేష్, బాలాజీ, హరినాథ్, జ్యోతి, పీజీలు సురయ్య, రవీందర్‌ను ఆస్పత్రి సూపరింటెండెంట్ కె.ఎస్.అశోక్‌కుమార్, ప్రిన్సిపాల్ శ్రీలత అభినందించారు.