- 650 గ్రాముల బరువుతో పుట్టిన చిన్నారి
- సంజీవి ఆస్పత్రి వైద్యుల ఘనత
పసికందుకు అరుదైన శస్త్రచికిత్స
Published Sun, Apr 16 2017 12:16 AM | Last Updated on Tue, Sep 5 2017 8:51 AM
కాకినాడ వైద్యం (కాకినాడ సిటీ) :
తక్కువ బరువుతో పరిపక్వత లేకుండా జన్మించిన చిన్నారిని అత్యాధునిక చికిత్సతో కాకినాడలోని వైద్యులు సంపూర్ణ ఆరోగ్యవంతుడిని చేశారు. స్థానిక జయా రెసిడెన్సీలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంజీవి ఆస్పత్రి ఎండీ డాక్టర్ నెక్కంటి సూర్యప్రసాద్ ఈ కేసు వివరాలను ఇలా వెల్లడించారు. కాకినాడకు చెందిన బొండా నాగేశ్వరరావు, వీరలక్ష్మి దంపతులకు వివాహమైన ఎనిమిదేళ్ల తరువాత వీరలక్ష్మి గర్భం దాల్చింది. ఆలస్యంగా గర్భధారణ, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం తదితర కారణాలకు గర్భంలోని పిండంలోనే శిశువుకు ఎస్‌ఎల్‌ఈ వ్యాధి సోకింది. దీంతో పూర్తి స్థాయిలో ఎదుగుదల లోపించింది. పరిస్థితి విషమించడంతో ఆమెకు స్థానిక గాంధీనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో సిజేరియ¯ŒS చేశారు. కేవలం 650 గ్రాముల బరువు, ఊపిరితిత్తులు, ప్రేగులు, మెదడు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్న శిశువుకు ఆమె జన్మనిచ్చింది. ఈ పరిస్థితుల్లో, జనవరి 4న ఆమెను బంధువులు సంజీవి ఆస్పత్రిలో చేర్పించారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఆ శిశువుకు ప్రముఖ నియోనెటాలజిస్ట్ డాక్టర్ అంగర రవి ఆధ్వర్యంలో అత్యాధునిక వైద్య పరికరాలతో వైద్యం చేశారు. మూడు నెలల అనంతరం బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంగా సాధారణ స్థితికి చేరింది. ప్రస్తుతం ఈ శిశువు ఎలాంటి రుగ్మతలు, సైడ్ ఎఫెక్టులు లేకుండా పూర్తి ఆరోగ్యంతో రెండు కిలోల బరువుకు చేరుకున్నట్టు ఆయన వివరించారు. ఈ సమావేశంలో డాక్టర్ పి.సుబ్బారావు, డాక్టర్ రమ్య, డాక్టర్ కె.శ్రావణి, డాక్టర్ వి.శ్రీనివాస్, డాక్టర్ రామారావు, డాక్టర్ కిన్నెర, డాక్టర్ అనుపమ పాల్గొన్నారు.
అరుదైన కేసు ఇది..
పలు సమస్యలతో అపరిపక్వతగా జన్మించిన ఈ బిడ్డకు తిరిగి సంపూర్ణ ఆరోగ్యంగా చేయడం అరుదైన సంఘటనని నియోనెటాలజిస్ట్ డాక్టర్ అంగర రవి అన్నారు. అయిదేళ్లలో తక్కువ బరువు ఉన్న చిన్నారులకు వైద్యం చేశానని, ఇంతటి సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్న శిశువుకి అరుదైన వైద్యం చేయడం ఇదే తొలిసారని చెప్పారు. తమ చిన్నారికి వైద్యుడు రవి ప్రాణదానం చేశారని తల్లిదండ్రులు నాగేశ్వరరావు, వీరలక్ష్మి దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement