పెళ్లి రిసెప్షన్‌లో డ్యాన్స్‌ చేస్తూ.. గుండె ఆగి.. | 19 Year Old Dies Of Cardiac Arrest While Dancing At Wedding Event In Nirmal | Sakshi
Sakshi News home page

పెళ్లి రిసెప్షన్‌లో డ్యాన్స్‌ చేస్తూ.. గుండె ఆగి..

Published Mon, Feb 27 2023 1:30 AM | Last Updated on Tue, Feb 28 2023 11:53 AM

19 Year Old Dies Of Cardiac Arrest While Dancing At Wedding Event In Nirmal - Sakshi

డ్యాన్స్‌ చేస్తున్న యువకుడు ముత్యం  

కుభీర్‌: మహారాష్ట్ర నుంచి వచ్చిన ఓ యువకుడు పెళ్లి రిసెప్షన్‌లో డ్యాన్స్‌ చేస్తున్నాడు.. బంధువులంతా చప్పట్లు కొడుతూ, ఈలలు వేస్తూ ఉత్సాహపరుస్తున్నారు. కానీ ఆ యువకుడు డ్యాన్స్‌ చేస్తూనే ఉన్నట్టుండి కుప్పకూలి పోయాడు. గుండెపోటుతో కన్నుమూశాడు. నిర్మల్‌ జిల్లా కుభీర్‌ మండలం పార్డి(కె) గ్రామంలో శనివారం రాత్రి జరిగిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది.

సరదాగా డ్యాన్స్‌ చేస్తూ..: పార్డి(కె) గ్రామానికి చెందిన నాయుడు రాజుకు భైంసా మండలం కామోల్‌ గ్రామానికి చెందిన యువతితో శుక్రవారం వివాహం జరిగింది. శని వారం సాయంత్రం పెళ్లికొడుకు నాయుడు రాజు ఇంటి వద్ద రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. నాయుడురాజు బంధువు, మహారాష్ట్రకు చెందిన తమ్మళ్ల ముత్యం (18) కూడా దీనికి హాజరయ్యాడు. రిసెప్షన్‌ కార్యక్రమం పూర్తికాగా.. బంధువులు సినిమా పాటలు పెట్టుకుని డ్యాన్స్‌ చేస్తున్నారు.  

ముత్యం కూడా డ్యాన్స్‌ చేయడం ప్రారంభించాడు. కాసేప టికి డ్యాన్స్‌ చేస్తూనే కుప్పకూలిపోయాడు. అతడు తిరిగి లేవకపోవడంతో బంధువులు వెంటనే భైంసాలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ముత్యం గుండెపోటుతో మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని ఆదివారం మహారాష్ట్రలోని స్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement