
సాక్షి పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గోపాల్ మండల్ తన నియోజకవర్గంలోని ఓ వివాహ వేడుకలో డ్యాన్స్‌లు చేసి విమర్శల పాలయ్యాడు. ఈ మేరకు బీహార్ అసెంబ్లీలో భాగల్‌పూర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న గోపాల్ మండల్ ఫతేపూర్ గ్రామంలోని వివాహ వేడుకకు హాజరయ్యారు.
అయితే ఆయన అక్కడ ఒక యువతితో కలిసి డ్యాన్స్ చేయడమే కాకుండా ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తూ డబ్బు విసరడం వంటి పనులు చేశాడు. అంతేగాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది కూడా. దీంతో పార్టీ సభ్యలు గోపాల్‌కి చివాట్లు పెట్టడమే కాకుండా జనతాదళ్ పార్టీ గౌరవాన్ని దిగేజార్చేలా ప్రవర్తించకండి, పదవికి తగ్గట్టుగా ప్రవర్తించమంటూ మందలించారు.
కానీ గోపాల్ మాత్రం మ్యూజిక్ వింటూ ఆగలేనని, పైగా ఒక కళాకారుడి కళను ఎవరు ఆపలేరంటూ సమర్థించుకునేందుకు ప్రయత్నించడం గమనార్హం. ఐతే గోపాల్ ఈ విధంగా ప్రవర్తించడం తొలిసారికాదు. గతంలో కూడా ఓ వివాహ రిసెప్షన్‌లో బాలీవుడ్ పాటకి డ్యాన్స్ చేస్తూ విమర్శల పాలయ్యారు. అంతేగాదు ఆయన రైలు ప్రయాణంలో లోదుస్తులతో తిరుగుతూ వివాదస్పద వ్యక్తిగా వార్తల్లో నిలిచారు.
(చదవండి: ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే )