నా పెళ్లి సంబంధం చెడగొట్టారు.. యువతి సూసైడ్‌ నోట్‌ రాసి.. | Woman Left The House After Write Suicide Note Nirmal District | Sakshi
Sakshi News home page

నా పెళ్లి సంబంధం చెడగొట్టారు.. యువతి సూసైడ్‌ నోట్‌ రాసి..

Published Sat, Mar 4 2023 5:04 PM | Last Updated on Sat, Mar 4 2023 5:22 PM

Woman Left The House After Write Suicide Note Nirmal District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

జిల్లా కేంద్రంలోని రాంరావుబాకు చెందిన ఓ యువతి సూసైడ్ నోట్ రాసి ఇంట్లో నుండి వెళ్లి పోయిన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే నిర్మల్‌లోని ఓ కంప్యూటర్ సెంటర్‌లో యువతి ఉద్యోగం చేస్తోంది.

సాక్షి, నిర్మల్: జిల్లా కేంద్రంలోని రాంరావుబాకు చెందిన ఓ యువతి సూసైడ్ నోట్ రాసి ఇంట్లో నుండి వెళ్లి పోయిన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే నిర్మల్‌లోని ఓ కంప్యూటర్ సెంటర్‌లో యువతి ఉద్యోగం చేస్తోంది. దాని పక్కనే గల ఫోటో షాప్ యజమాని వంశీతో యువతికి పరిచయం ఏర్పడింది. అయితే గత నెల ఫిబ్రవరిలో యువతికి మరో వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిరి ఎంగేజ్‌మెంట్‌ తేదీని సైతం తేదీ ఖరారు చేశారు.

వంశీ దంపతులు తనకు పెళ్లి కుదిరిన అబ్బాయికి ఫోన్ చేసి తనపై తప్పుడు మాటలు చెప్పి ఎంగేజ్‌మెంట్‌ను చెడగొట్టారని సూసైడ్ నోట్‌లో రాసి వెళ్లిపోయింది. తాను వెళ్లిపోవడానికి కారణం వంశీ దంపతులేనని, తన కుటుంబ సభ్యులు కాదని పేర్కొంది.

దీంతో యువతి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతి వెళ్లిపోవడానికి కారణమైన వంశీని అదుపులోకి తీసుకున్నారు. తమ కుమార్తె ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం వంశీ దంపతులేనని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని తల్లి, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.
చదవండి: బాలానగర్‌లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement