Marriage relationship
-
నా పెళ్లి సంబంధం చెడగొట్టారు.. యువతి సూసైడ్ నోట్ రాసి..
సాక్షి, నిర్మల్: జిల్లా కేంద్రంలోని రాంరావుబాకు చెందిన ఓ యువతి సూసైడ్ నోట్ రాసి ఇంట్లో నుండి వెళ్లి పోయిన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే నిర్మల్‌లోని ఓ కంప్యూటర్ సెంటర్లో యువతి ఉద్యోగం చేస్తోంది. దాని పక్కనే గల ఫోటో షాప్ యజమాని వంశీతో యువతికి పరిచయం ఏర్పడింది. అయితే గత నెల ఫిబ్రవరిలో యువతికి మరో వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిరి ఎంగేజ్మెంట్ తేదీని సైతం తేదీ ఖరారు చేశారు. వంశీ దంపతులు తనకు పెళ్లి కుదిరిన అబ్బాయికి ఫోన్ చేసి తనపై తప్పుడు మాటలు చెప్పి ఎంగేజ్‌మెంట్‌ను చెడగొట్టారని సూసైడ్ నోట్లో రాసి వెళ్లిపోయింది. తాను వెళ్లిపోవడానికి కారణం వంశీ దంపతులేనని, తన కుటుంబ సభ్యులు కాదని పేర్కొంది. దీంతో యువతి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతి వెళ్లిపోవడానికి కారణమైన వంశీని అదుపులోకి తీసుకున్నారు. తమ కుమార్తె ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం వంశీ దంపతులేనని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని తల్లి, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. చదవండి: బాలానగర్‌లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య -
క్రికెటర్ షమీ చుట్టూ కేసుల ఉచ్చు
-
షమీ చుట్టూ కేసుల ఉచ్చు
కోల్‌కతా: టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీ పరిస్థితి మరింత క్లిష్టంగా మారిపోయింది. వ్యక్తిగత, క్రీడా జీవితంపై అతడి భార్య హసీన్ జహాన్ ఆరోపణల ఉదంతం కేసుల నమోదు వరకు చేరింది. తన భర్త మోసగాడని, తీవ్రంగా హింసిస్తున్నాడని, పలువురు యువతులతో సంబంధాలున్నాయని, పాకి స్తానీ స్నేహితురాలి నుంచి డబ్బులు తీసుకున్నాడంటూ ఇప్పటికే జహాన్ మీడియాకెక్కింది. తాజాగా ఆమె ఫిర్యాదుతో శుక్రవారం కోల్‌కతా పోలీసులు షమీ సహా అతని కుటుంబ సభ్యులు నలుగురిపై కేసులు నమోదు చేశారు. సెక్షన్ 307 (హత్యాయత్నానికి పాల్పడటం), సెక్షన్ 498ఎ (గృహ హింస), సెక్షన్ 376 (లైంగిక దాడి)ల కింద నాన్ బెయిలబుల్, సెక్షన్ 323 (ఉద్దేశపూర్వకంగా గాయపర్చడం), సెక్షన్ 506 (నేరపూరిత బెదిరింపు)ల కింద జాదవ్‌పూర్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసినట్లు కోల్‌కతా జాయింట్ పోలీస్ కమిషనర్ (క్రైం) ప్రవీణ్ త్రిపాఠి తెలిపారు. వీటిలో సెక్షన్ 376 కింద కేసును షమి సోదరుడిపై పెట్టినట్లు పేర్కొన్నారు. ఏడాది క్రితం యూపీలో తన అత్తారింటికి వెళ్లినప్పుడు షమీ సోదరుడు షోయబ్ అహ్మద్ తనపై అత్యాచారం చేసినట్లు హసీన్ ఫిర్యాదులో పేర్కొంది. మరోవైపు షమీపై ఆరోపణల అనంతరం ఫేస్ బుక్‌లో తన ఖాతాను బ్లాక్ చేశారని హసీన్ ఆరోపించింది. ‘కొన్నేళ్లుగా వారు నన్ను తీవ్రంగా హింసించారు. ఆ కుటుంబంలో ఒక్కరు కూడా నాకు అం డగా నిలవలేదు. షమీ కుటుంబ సభ్యులు ఉత్తరప్రదేశ్‌లో నివసిస్తారు. నేనక్కడకు వెళ్లినప్పుడల్లా వేధించేవారు. వారంతా వేచి చూడాలని మాత్రమే చెప్పేవారు తప్ప షమీకి వ్యతిరేకంగా ఏమీ చేసేవారు కాదు’ అని ఆమె పేర్కొంది. వివాదం నేపథ్యంలో షమీకి రెండు రోజుల క్రితం ప్రకటించిన బీసీసీఐ కాంట్రాక్టుల్లో చోటుదక్కలేదు. అయితే... అతడికి ఊహించని విధంగా దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్ నుంచి మద్దతు లభించింది. షమిది కష్టపడే తత్వమని, కుటుంబ సమస్యలు ఉన్నట్లు తనకు తెలుసని కానీ అతడి భార్య ఇలాంటి ఆరోపణలకు దిగడం సరికాదని కపిల్ వ్యాఖ్యానించారు. ఒకవేళ ఇవన్నీ నిజమైతే షమీని ఎవరూ కాపాడలేరని పేర్కొన్నారు. -
భర్తను హత్య చేయించిన భార్య
బనశంకరి : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఏకంగా కట్టుకున్న భర్తనే హత్య చేయించిన సంఘటన రాజగోపాలనగర పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు...రాజగోపాలనగరలో నివాసం ఉంటున్న మధుసూదన్ (36), నీలా దంపతులకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇదే సమయంలో నీలా ప్రదీప్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వివాహేతర సంబంధానికి భర్త మధు అడ్డుగా ఉన్నాడని భావించిన నీలా తన ప్రియుడు ప్రదీప్, అతని స్నేహితులు హరిప్రసాద్, రంజిత్‌తో హత్యకు పథకం వేసింది. గతనెల 12న మధును క్యాంటర్‌లో ఎక్కించుకుని రాజ్‌కుమార్ సమాధి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ మద్యం తాపించి గొంతు నులిమి హత్య చేశారు. ఘటన చోటుసుకున్న మూడు రోజుల అనంతరం నీలా తన భర్త కనిపించలేదని రాజగోపాల నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నీలా ప్రవర్తన అనుమానం కలిగించడంతో ఆదివారం ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం బయటకువచ్చింది. దీంతో పోలీసులు నిందితులు ప్రదీప్‌తో పాటు అతని స్నేహితులు హరి, రంజిత్‌లను సోమవారం అరెస్ట్ చేశారు. -
అతడి కోసం ఆమె
హృదయం: ‘పాశ్చాత్యులకు ఎమోషన్స్ ఉండవు’, ‘వివాహ బంధాలకు పెద్దగా విలువ ఇవ్వరు’, ‘జీవిత భాగస్వామి కోసం త్యాగాలు చెయ్యరు’, ‘ఎవరి జీవితాలు వాళ్లవి’... ఇలాంటి అభిప్రాయాలు చాలానే ఉంటాయి మనకు. ఈ అభిప్రాయాలు నిజమే అవడానికి ఉదాహరణలు కూడా బోలెడు కనిపిస్తాయి. కానీ బ్రిటన్‌కు చెందిన జాన్ - నికోలాల కథ తెలుసుకున్నాక, మన అభిప్రాయాలన్నీ మార్చుకోవాల్సిందే. తొలి చూపులోనే ప్రేమ గురించి వింటుంటాం. కంటుంటాం! కానీ జాన్ - నికోలాలది తొలిచూపు ప్రేమ కాదు, తొలిచూపు పెళ్లి. ఎందుకంటే వాళ్లిద్దరూ ఒకరినొకరు చూసుకోగానే, తనే నా జీవిత భాగస్వామి అన్న అభిప్రాయానికి వచ్చేశారు. ‘ఐ లవ్యూ’ చెప్పుకోవడమే కాదు, మనిద్దరం పెళ్లి చేసుకుందాం అంటూ పరస్పర అంగీకారంతో నిర్ణయం కూడా తీసేసుకున్నారు. కొన్ని రోజులకే వాళ్లిద్దరి పెళ్లయిపోయింది. వెంటనే హనీమూన్‌కు వెళ్లిపోయారు. రెండు వారాలపాటు ప్రపంచాన్ని మరిచిపోయారు జాన్, నికోలా. రోజులు క్షణాల్లా గడిచిపోయాయి. జీవిత కాలానికి సరిపడా అనుభూతులతో ఇంటికి చేరుకున్నారు. ఇక ఆ తర్వాత దైనందిన జీవితం మొదలైంది. ఇంట్లోనూ రోజూ హనీమూన్లాగే గడిచింది. ఓవైపు ఎవరి పనుల్లో వాళ్లు ఉంటూనే ఒకరి కోసం ఒకరు సమయం కేటాయించుకుంటూ సంతోషంగా జీవితాన్ని సాగించారు. కానీ, ఆ సంతోషానికి రెండు వారాల్లోనే తెరపడింది. ఓ రోజు జాన్ రక్తపు వాంతులు చేసుకుని కుప్పకూలిపోయాడు. షాక్ తిన్న నికోలా అతణ్ని ఆసుపత్రికి తీసుకెళ్లింది. డాక్టర్ పిడుగులాంటి వార్త చెప్పాడు. జాన్‌కు ట్యూమర్ ఉందని. అది ముదిరి క్యాన్సర్‌గా మారిందన్నాడు. ఇద్దరూ నిలువునా కూలిపోయారు. కొన్ని రోజులు గడిచాక, జాన్ ఎక్కువ కాలం బతకడన్న చేదు నిజాన్ని కూడా చెప్పారు వైద్యులు. అయినా చికిత్స మొదలుపెట్టారు. జాన్, నికోలాలకు ఆసుపత్రే ఇల్లయింది. జాన్ మృత్యు పోరాటం మొదలైంది. జాన్‌కు కూడా తన పరిస్థితి అర్థమైంది. చికిత్స సాగుతుండగా నికోలాను పిలిచి, తన జీవిత కాల కోరిక గురించి చెప్పాడు. తండ్రి కావడమే ఆ కోరిక. ఒక్క క్షణం ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నికోలాకు. అయినా దాని గురించి తీవ్రంగా ఆలోచించింది. నిజానికి జాన్ పరిస్థితి చూస్తే, ఏ అమ్మాయీ తల్లి కావడం గురించి ఆలోచించదు. కానీ నికోలా జాన్ కోరిక తీర్చడానికి సిద్ధపడింది. ఎవరెంత వారించినా, వినకుండా తాను తల్లి కావాలన్న నిర్ణయానికి వచ్చేసింది. వైద్యులకు విషయం చెబితే, జాన్‌కు కీమోథెరపీ చేశాక పిల్లలు పుట్టే అవకాశం తక్కువని భావించి, అతడి వీర్య కణాలు తీసుకున్నారు. వాటితో నికోలాను తల్లిని చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. అది విజయవంతమైంది. ఆమె గర్భం దాల్చింది. స్కానింగ్ చేస్తే కడుపులో ఉన్నది కవలలని కూడా తేలింది. అయితే ఇంత సంతోషకరమైన వార్త తెలిసేసరికే జాన్ మృత్యువుకు మరింత చేరువైపోయాడు. కదల్లేని, మాట్లాడలేని స్థితికి చేరుకున్నాడు. అయినా భార్య ఆ సంగతి చెప్పగానే, చిన్న మూలుగు ద్వారా తన సంతోషాన్ని వెల్లడించాడు. అయితే ఆ వార్త వినడం కోసమే అన్ని రోజులు ఆగాడో ఏమో... అది తెలిసిన రెండో రోజుకే జాన్ ప్రాణాలు వదిలాడు. ప్రాణంలా ప్రేమించిన భర్త దూరమైనా, అతడి ఆఖరు కోరిక తీర్చడం కోసం గుండె దిటవు చేసుకుంది నికోలా. అతడి జ్ఞాపకాలతో కాలం గడిపేస్తూ కడుపులోని చిన్నారుల్ని క్షేమంగా బయటకు తీసుకురావడంపై దృష్టి పెట్టింది. ఐదు నెలలు గడిచాయి. అప్పుడామెకు ఆరో నెల. అంతా సవ్యంగా సాగిపోతుండగా, నికోలాకు వినికిడి సమస్య మొదలైంది. విపరీతమైన తలపోటు వచ్చింది. ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయిస్తే, మళ్లీ ఓ పిడుగులాంటి వార్త. ఆమెకు కూడా ట్యూమర్ ఉందన్నారు వైద్యులు. తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయింది నికోలా. అప్పటికే ఎంతో పోరాడిన తాను, ఇక పోరాటం చేయలేననుకుంది. కడుపులోని బిడ్డల్ని, జాన్‌ను తలుచుకుని కొన్ని రోజులపాటు ఏడ్చింది. దేవుణ్ని నిందించింది. కానీ చివరికి భర్త ఆఖరు కోరికను గుర్తుచేసుకుంది. కడుపును తడిమి చూసుకుంది. వాళ్లకోసమైనా బతకాలని నిర్ణయించుకుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, వైద్యులు అండగా నిలిచారు. అందరి సహకారంతో ట్యూమర్‌పై పోరాటం సాగించింది. ఆ పోరాటం సాగుతుండగానే, ఆమె ఇద్దరు పండంటి మగ కవలల్ని ప్రసవించింది. ఇప్పుడామెకు ప్రాణాపాయం తప్పింది. కానీ ట్యూమర్ నుంచి పూర్తిగా కోలుకోలేదు. పిల్లల్ని చూసుకున్నాక, ఆమెకు జీవితంపై మరింత ఆశ కలిగింది. జాన్ ఆలోచనలు తెలిసిన నికోలా... అతడి ఆశయాలకు అనుగుణంగా పిల్లల్ని తీర్చిదిద్దుకోవడమే లక్ష్యంగా జీవన పోరాటం సాగిస్తోంది. అంతేకాదు.. ట్యూమర్, క్యాన్సర్ బాధితులకు అండగా నిలిచేందుకు ఓ ట్రస్టు ఆరంభించి, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, విరాళాలు సేకరిస్తోంది. జాన్ తన ఆఖరు కోరిక గురించి చెప్పకపోయి ఉంటే... ఈపాటికి తాను కూడా మృత్యు ఒడికి చేరేదాన్నని, జాన్ కోసం, పిల్లల కోసం పోరాడటం వల్లే ఇప్పుడీ స్థాయిలో ఉన్నానని అంటుంది నికోలా. -
నాదే పొరపాటు!
వేదిక మొన్నీమధ్యే నాకో పెళ్లి సంబంధం వచ్చింది. అబ్బాయి బాగున్నాడు. ఉద్యోగం కూడా మంచిది. పెళ్లి చూపులయ్యాక ఇంటికెళ్లి ఫోన్ చేస్తామన్నారు. సంబంధం తెచ్చినాయనకు ఫోన్ చేసి అమ్మాయి వయసు కొంచెం ఎక్కువున్నట్లుంది అన్నారట. అంతే - ఆ సంబంధం క్యాన్సిల్ అయిపోయింది. విషయం తెలిసిన దగ్గర నుంచి అమ్మ డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. '‘ఆరోజు నీకు ఎంతగా నచ్చజెప్పినా వినలేదు. అంతా నా ఖర్మ’’ అంటూ అమ్మ నన్ను తిట్టనిరోజు లేదు. మొదట్లో అమ్మ మాటల్ని లెక్కచేసేదాన్ని కాదు. ఇప్పుడు నాకు కూడా భయం మొదలైంది. అమ్మ మాటలకు బాధేస్తోంది. అది గమనించిన అమ్మ తిట్టడం మానేసి తనలో తానే బాధపడడం మొదలెట్టింది. నేను చేసిన పొరపాటు ఏమిటంటే - నాకు ఉద్యోగం వచ్చిన కొత్తలో ఒక సంబంధం వచ్చింది. అబ్బాయి బాగున్నాడు. ఐదంకెల జీతం. అంతా బాగుంది. ‘‘ఇప్పుడే కదా ఉద్యోగంలో చేరాను. ఓ ఏడాది వరకూ పెళ్లి మాట ఎత్తకండి’’ అని అమ్మకూ, నాన్నకూ గట్టిగా చెప్పాను. నాన్న వెంటనే ఒప్పుకున్నారు. అమ్మ మాత్రం నన్ను ఒప్పించడానికి చాలా ప్రయత్నించింది. నేను ససేమిరా అన్నాను. ఏడాది తర్వాత వచ్చిన సంబంధాల్లో కొన్ని నాకు నచ్చలేదు. కొన్ని నాన్నకు నచ్చలేదు. అలా చూస్తుండగానే ఐదేళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు నా వయసు ముప్ఫైకి దగ్గరపడుతోంది. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరూ ‘అమ్మాయికి వయసెక్కువ’ అంటున్నారు. ఆ మధ్య వచ్చిన ఒక సంబంధం వారికి నేను బాగా నచ్చాను. కానీ, అబ్బాయి వయసు నలభై వరకు ఉంటాయి. దాంతో, ఆ సంబంధం వదులుకున్నాం. ‘‘ఎంచక్కా ఉద్యోగం వచ్చిన కొత్తల్లో పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండేది’’ అంటూ అందరి దగ్గరా అంటోంది మా అమ్మ. ఇప్పుడు నాకు కూడా నిజమేననిపిస్తోంది. నా నిర్ణయం కారణంగా అమ్మానాన్నలు కూడా ఇబ్బందిపడుతున్నారు. ఈ ‘వేదిక’ ద్వారా అమ్మాయిలకు నేను చెప్పేదేమిటంటే కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల మాట వినకపోతే చాలా నష్టపోతాం. - శ్రీలత, హైదరాబాద్