
బనశంకరి : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఏకంగా కట్టుకున్న భర్తనే హత్య చేయించిన సంఘటన రాజగోపాలనగర పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు...రాజగోపాలనగరలో నివాసం ఉంటున్న మధుసూదన్ (36), నీలా దంపతులకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇదే సమయంలో నీలా ప్రదీప్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వివాహేతర సంబంధానికి భర్త మధు అడ్డుగా ఉన్నాడని భావించిన నీలా తన ప్రియుడు ప్రదీప్, అతని స్నేహితులు హరిప్రసాద్, రంజిత్‌తో హత్యకు పథకం వేసింది. గతనెల 12న మధును క్యాంటర్‌లో ఎక్కించుకుని రాజ్‌కుమార్ సమాధి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ మద్యం తాపించి గొంతు నులిమి హత్య చేశారు.
ఘటన చోటుసుకున్న మూడు రోజుల అనంతరం నీలా తన భర్త కనిపించలేదని రాజగోపాల నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నీలా ప్రవర్తన అనుమానం కలిగించడంతో ఆదివారం ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం బయటకువచ్చింది. దీంతో పోలీసులు నిందితులు ప్రదీప్‌తో పాటు అతని స్నేహితులు హరి, రంజిత్‌లను సోమవారం అరెస్ట్ చేశారు.