
నవ వధువు మౌనిక
సాక్షి, నిర్మల్: నిర్మల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కడెం మండలం పండవపూర్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నవ వధువు, కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న ఓ కారు అదువు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో నవ వధువు మౌనికతో పాటు ఆమె తండ్రి రాజయ్య మృతి చెందారు. మహారాష్ట్రలో పెళ్లి రిసెప్షన్ ముగించుకొని వస్తుండగా ఈ ప్రమాదానికి జరిగినట్లు తెలుస్తోంది. మృతులు కడెం మండలం మద్దిపడగ గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment