
కలెక్టర్ పంపిన అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు పెడుతున్న వైద్యులు
నిర్మల్: నిర్మల్‌లోని జిల్లా ఆస్పత్రి, ప్రసూ తి ఆస్పత్రులతో పాటు భైంసాలోని ఏరియా ఆస్పత్రిలో వైద్యులు పక్కాగా సమయపాలన పాటిస్తున్నారు. కలెక్టరేట్ నుంచి ఈ మూడు ఆస్పత్రులకు రోజూ ఉదయం 9గంటలకు, మధ్యాహ్నం 2గంటలకు కలెక్టర్ ముషరఫ్ అలీ తన సిబ్బందిని పంపించి వైద్యుల హాజరుపై పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. వారి రిజిస్టర్‌లో విధుల్లో ఉన్న వైద్యు లతో స్వయం గా సంతకాలు పెట్టిస్తున్నారు. కలెక్టర్ చర్యల తో ఆస్పత్రుల్లో సమయానికి వైద్యులు వస్తుండటం, సేవలు అందుతుండటంతో జిల్లావాసు లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు దవా ఖానాల్లో వైద్యుల గైర్హాజరీపై ‘సాక్షి’పలుమార్లు కథనాలను ప్రచురించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment