Hospital Doctors
-
పూణె పోర్షే కేసు: ఆస్పత్రి డీన్ ఎక్కడ?
ముంబై: పుణే పోర్షే కారు రోడ్డు ప్రమాదంలో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలుడికి సంబంధించి బ్లడ్ శాంపిళ్ల తారుమారు విషయంలో ఓ రాష్ట్ర మంత్రి, ఎమ్మెల్మే డాక్టర్లపై ఒత్తిడి చేశారని సాసూన్ హాస్పిటల్ డీన్ తెలిపారు. బుధవారం హాస్పిటల్ డీన్ వినాయక్ కాలే మీడియాతో మాట్లాడారు.‘‘మహారాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ మంత్రి హసన్ ముష్రిఫ్, ఎమ్మెల్యే సునీల్ తింగ్రే.. మెడికల్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ అజయ్ తవాడేను నియమించారు. వీరు అధికారపార్టీ ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి చెందిన నేతలు. వారు బ్లడ్ శాంపిళ్లను తారుమారు చేయించటం కోసం సోరెన్సిక్ డాక్టర్లపై ఒత్తిడి తీసుకువచ్చారు’’ అని డీన్ తెలిపారు. శాంపిళ్ల తారుమారుపై ఓ కమిటీని ఏర్పాటు చేసిన మంగళవారం ఈ వ్యవహారంపై రోజంతా విచారణ జరిపించామని హాస్పిటల్ డీన్ వినాయక్ కాలే తెలిపారు. తను కూడా ఈ విషయంపై పలు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.హాస్పిటల్ డీన్ మీడియా సమావేశం ముగిసిన కొన్ని గంటల్లోనే ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం సెలవుపై పంపటం గమనార్హం. ఈ కేసు విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు, సరైన నిర్ణయం తీసుకోనందుకే ఆయన్ను ప్రభుత్వం సెలవుపై పంపినట్లు తెలుస్తోంది.ఇక.. మైనర్ బాలుడి బ్లడ్ శాంపిళ్లు తారుమారు చేయటం కోసం ఇద్దరు డాక్టర్లు అజయ్ తవాడే, శ్రీహరి హర్నర్.. మధ్యవర్తి హాస్పిటల్ ప్యూన్ ద్వారా నిందితుడి కుటుంబ సభ్యుల వద్ద రూ.3 లక్షల లంచం తీసున్నారని తెలియటంతో వారిని పుణే క్రైం బ్రాంచ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. ఇక.. బ్లడ్ శాంపిళ్ల తారుమారుపై మహారాష్ట్ర ప్రభుత్వం సైతం దర్యాప్తుకు డాక్టర్ పల్లవి సపాలే నేతృత్వంలో ఓ కమిటి ఏర్పాటు చేసింది. ఈ కమిటిలో గ్రాంట్ మెడికల్ కాలేజీ, జేజే గ్రూప్ హాస్పిటల్ డీన్లు సభ్యులుగా ఉన్నారు.ఈ కేసులో ఓ ఎమ్మెల్యే కుమారుడికి సంబంధం ఉందని మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ నానా పటోల్ ఆరోపణలు చేశారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే ఆ ఎమ్మెల్యే.. పోలీసులతో టచ్‌లోకి వెళ్లారు. బ్లడ్ శాంపిళ్లను మార్చటం కోసం డాక్టర్లు కూడా ఫోన్ చేశారని పటోల్ ఆరోపణలు చేశారు. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇక.. ప్రముఖ బిల్డర్ అయన మైనర్ తండ్రి కూడా బ్లడ్ శాంపిళ్లను తారుమారు చేయించాలని డాక్టర్ తవాడేకు 14 సార్లు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది.ఇక.. ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మంగళవారం స్పందించారు. ‘ప్రమాదం జరిగినప్పటి నుంచి పుణే పోలీసు కమిషనర్‌తో నేను టచ్‌లో ఉన్నా. ఈ కేసులో ఎంతటివారు ఉన్నా చర్యలు తీసుకుంటాం. చట్టం ముందు అందరూ సమానులే. ఎవ్వరినీ వదిలిపెట్టం. నేను ఇప్పటికే ఈ కేసు విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు ఇచ్చాను’ అని తెలిపారు. -
ఐటీ ఉద్యోగం.. వర్క్‌ఫ్రం హాస్పిటల్!
ఇంట్లో ఏవరైనా చిన్నపిల్లలు, పెద్దవారికి లేదా తమకే ఆరోగ్యం బాగులేనపుడు ఆసుపత్రికి వెళ్లాల్సివస్తుంది. అయితే వీక్ డేస్‌లో అయితే ఫరవాలేదు. కానీ ఎమర్జెన్సీ పరిస్థితులు, ప్రత్యేకంగా డాక్టర్ అపాయింట్మెంట్ సందర్భాల్లో మాత్రం ఉద్యోగరీత్యా వెళ్లడం కుదరకపోవచ్చు. ఒకవేళ తప్పనిసరి వెళ్లాల్సివస్తే ఆ రోజు సెలవు పెట్టాల్సిందే. డాక్టర్ చూసేది కొద్దిసేపే అయినా అక్కడ గంటల తరబడి ఎదురుచూస్తూ ఖాళీగా కూర్చోవాల్సిందే. వర్క్‌ఫ్రంహోమ్ చేసే టెకీలకు ఇకపై ఈ ఇబ్బంది తీరనుంది. హాస్పిటల్స్‌లో ల్యాప్‌టాప్‌ల ద్వారా వర్క్ చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతో డాక్టరును సంప్రదించే సమయంలోనూ చేసే పనికి అంతరాయం కలగకుండా చూసుకోవచ్చు. ఉద్యోగుల ఇబ్బందులను గుర్తించిన కార్పొరేట్ ఆసుపత్రులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆసుపత్రిలోనే పనిచేసుకునేందుకు అవకాశం కల్సిస్తున్నారు. ఈ రోజుల్లో ఎక్కువ మంది ల్యాప్‌టాప్‌పైనే పనిచేస్తున్నారు. వీరు ఎక్కడి నుంచైనా పనిచేయవచ్చు. ఒక డెస్క్, వైఫై ఉంటే చాలు. అయితే వర్క్‌ఫ్రంహోం ద్వారా పని చేస్తున్న ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి అటెండర్లకు ఈ తరహా సౌకర్యాలు కల్పిస్తున్నాయి. సెలవు దొరక్కపోవడం వల్ల అనారోగ్యంతో బాధపడుతున్నా ఆసుపత్రికి వెళ్లడం కుదరక చాలామంది వాయిదా వేస్తుంటారు. ఇంట్లో పెద్దవాళ్లు, దీర్ఘకాల సమస్యలతో బాధపడేవారు తీవ్ర ఇబ్బంది పడుతుంటారు. పిల్లల ఉద్యోగాలు, సెలవుల వంటి పరిస్థితి చూసి వీరే సర్దుకుంటుంటారు. ఆసుపత్రుల్లో అందుబాటులోకి వస్తున్న సదుపాయాలతో రోగులు, వారి సహాయకులు ముఖ్యంగా టెకీలకు కొంత వరకైనా ఉపయోగకరంగా ఉండనుంది. WFH evolves - Work from Hospital 🏥. @YashodaHospital in Hitech City introduces desks for those needing to work while attending family treatments. Post-COVID, #WFH has surged, but does this hospital-work blend boost productivity, or is it just helping to fool companies?… pic.twitter.com/d1kouDDNfM — Ravi Korukonda (@RaviKorukonda) February 21, 2024 ఇదీ చదవండి: అక్రమ రుణయాప్‌లు.. యమపాశాలు! ఎలా మోసం చేస్తున్నారో తెలుసా.. ఐటీ కారిడార్లోనే ఓ ప్రముఖ ఆసుపత్రి అక్కడికి వచ్చే రోగులు, వారి సహాయకులు ఎవరైనా పనిచేసుకునేందుకు ‘వర్క్‌ఫ్రమ్ ఆసుపత్రి’ సదుపాయాలు కల్పిస్తుంది. అక్కడ పనిచేసుకునేందుకు వీలుగా వర్క్‌డెస్క్‌ను ఏర్పాటు చేసింది. -
శరత్ బాబుకు వెంటిలేటర్ పై కొనసాగుతున్న చికిత్స
-
ఇబ్రహీంపట్నంలో దారుణం..బాలికకు తెలియకుండా అబార్షన్
సాక్షి, రంగారెడ్డి: జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ఆసుపత్రికి చెందిన వైద్యులు పెళ్లికాని బాలికకు తెలియకుండా మత్తుమందు ఇచ్చి అబార్షన్ చేయడం కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నంలో రామరక్ష ఆసుపత్రి వైద్యులు బాలికకు తెలియకుండా మత్తుమందు ఇచ్చి అబార్షన్ చేశారు. విషయం తెలుసుకున్న యువతి తల్లి వైద్యాధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో అధికారులు ఆసుపత్రికి వచ్చి విచారణ చేపట్టారు. ఆసుపత్రిలో రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి నుంచి ఆసుపత్రిలో ఎలాంటి వైద్య సేవలు అందించరాదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఇక, ఈ ఘటనలో రంగంలోకి దిగిన పోలీసులు 417, 420, 312, 342, 376, పొక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు ఆసుపత్రిలో ఎంత మందికి అబార్షన్ చేశారు. ఎప్పుడు ఏ సమయంలో అబార్షన్స్ చేశారనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్టు పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: మహిళతో న్యూడ్ కాల్స్.. వాటిని రికార్డ్స్ చేసి! -
ఇక ఠంచనుగా ఆస్పత్రికి..
నిర్మల్: నిర్మల్‌లోని జిల్లా ఆస్పత్రి, ప్రసూ తి ఆస్పత్రులతో పాటు భైంసాలోని ఏరియా ఆస్పత్రిలో వైద్యులు పక్కాగా సమయపాలన పాటిస్తున్నారు. కలెక్టరేట్ నుంచి ఈ మూడు ఆస్పత్రులకు రోజూ ఉదయం 9గంటలకు, మధ్యాహ్నం 2గంటలకు కలెక్టర్ ముషరఫ్ అలీ తన సిబ్బందిని పంపించి వైద్యుల హాజరుపై పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. వారి రిజిస్టర్లో విధుల్లో ఉన్న వైద్యు లతో స్వయం గా సంతకాలు పెట్టిస్తున్నారు. కలెక్టర్ చర్యల తో ఆస్పత్రుల్లో సమయానికి వైద్యులు వస్తుండటం, సేవలు అందుతుండటంతో జిల్లావాసు లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు దవా ఖానాల్లో వైద్యుల గైర్హాజరీపై ‘సాక్షి’పలుమార్లు కథనాలను ప్రచురించిన సంగతి తెలిసిందే. -
కాబోయే అమ్మకు కరోనా టెన్షన్.. ఆసుపత్రికి వెళ్లని గర్భిణులు
సాక్షి, మంచిర్యాలటౌన్: ఏడాదిన్నరగా కరోనా మహమ్మారి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఇప్పటికే గర్భం దాల్చిన వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభించి ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. కరోనా వల్ల సరైన సమయంలో గర్భిణులు ఆసుపత్రులకు వెళ్లలేక పోతున్నారు. వైద్యులను ఫోన్లో సంప్రదించి వారికి ఉన్న సమస్యను వివరించి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. కానీ కొందరు ప్రసవానికి దగ్గర పడుతుండడం, కొందరికి కరోనా సోకడం వల్ల ఏమి చేయాలనేదానిపై ఎన్నో సందేహాలు వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవం అయ్యే వరకు గర్భిణులు, వారి కుటుంబ సభ్యులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై జిల్లా ఆసుపత్రి గైనకాలజిస్టు డాక్టర్ రాధిక పలు సూచనలు చేస్తున్నారు. అధైర్య పడొద్దు.. కరోనా రాకుండా ముందస్తుగానే గర్భిణులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ కరోనా వచ్చిన అధైర్యపడకుండా, వైద్యుల సూచనల మేరకు తగిన మందులను వాడితే సరిపోతుంది. ప్రసవం సమయంలో కోవిడ్ పాజిటివ్ వస్తే, అలాంటి వారికి ప్రత్యేకంగా సాధారణ ప్రసవం గానీ, ఆపరేషన్ ద్వారా ప్రసవం చేస్తున్నారు. ప్రైవేటులో కరోనా సోకిన వారికి ప్రసవం చేయడానికి ఇబ్బందులకు గురిచేస్తుండగా, జిల్లా ఆసుపత్రిలో కోవిడ్ పాజిటివ్‌తో వచ్చిన వారిలో 14 మందికి అక్కడ పనిచేస్తున్న గైనకాలజిస్టులు సిజేరియన్, సాధారణ ప్రసవాలను చేశారు. గర్భం దాల్చిన వారు కరోనా రాకుండా ఉండేందుకు బయటకు వెళ్లకుండా ఉంటూనే, ఇంట్లో కూడా మాస్క్‌ను తప్పనిసరిగా ధరించి, సరైన పౌష్టికాహారం తీసుకోవాలి. ఇంట్లో ప్రత్యేక గదిలోనే ఉంటూ, నీరు ఎక్కువగా తీసుకోవాలి. లక్షణాలు ఉంటే టెస్టు తప్పదు.. ఎవరికైనా కోవిడ్ వచ్చిందంటే జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు, వాంతులు, విరేచనాలు వంటివి వస్తే ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే మందులను కూడా వాడాలి. కరోనా నిర్ధారణ పరీక్ష చేసుకున్నప్పుడు, పాజిటివ్‌గా వస్తే వైద్యుల సూచన మేరకు మందులు వాడాలి. గర్భం దాల్చిన తరువా త 4 నెలలకు గానీ కరోనా వ్యాక్సిన్‌ను వేసుకోవద్దు. గర్భం దాల్చినట్లుగా తెలిసిన వెంటనే వైద్యుల సమక్షంలో చెకప్ చేసుకుని 7 నెలల వరకు నెలకు ఒకసారి, 7–9 నెలల మధ్యలో 15 రోజులకు ఒకసారి, 9 నెలలు పడ్డాక వారానికి ఒకసారి వైద్యులను సప్రదించాలి. ప్రస్తుత సమయంలో కోవిడ్ ఉండడం వల్ల తగిన జాగ్రత్తలు తీసుకుని ఆసుపత్రికి వెళ్లాలి. గర్భి ణులకు వైద్య పరీక్షలను చేయించడంలో ఆశ కార్యకర్తలదే కీలకపాత్ర. కరోనా వచ్చిన వారికి ప్రసవం చేసినా అందులోని బిడ్డకు కరోనా వచ్చేందుకు అవకాశం లేదు. గర్భిణులకు పాజిటివ్‌గా వస్తే మాత్రం వారిలో ఉన్న జ్వర తీవ్రతను బట్టి మందులు, యాంటీబాడీస్ ట్యాబ్లెట్లను వాడాలి. నాలుగు రోజు ల తరువాత కూడా జ్వరం ఉంటేనే కరోనా టెస్టుకు వెళ్లాలి. కరోనా వచ్చినా, రాకపోయినా, ధైర్యంగా ఉంటూ, పూర్తి పౌష్టికాహారం తీసుకోవాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. కోవిడ్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. గర్భిణుల్లో మాత్రం రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల వారిని తొమ్మిది నెలల పాటు ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. కోవిడ్ సోకిన వారు సైతం ఎలాంటి భయబ్రాంతులకు గురికాకుండా ఉండాలి. మంచి పౌష్టికాహారం తీసుకుంటూ, సరిపడా నీరు తాగాలి. – డాక్టర్ రాధిక, గైనకాలజిస్టు, జిల్లా ఆసుపత్రి వైద్య పరీక్షలు చేయిస్తున్నాం.. గర్భం దాల్చిన నాటి నుంచే వారికి పూర్తి అవగాహన కల్పించడంతో పాటు, వారికి 7 నెలలు నిండే వరకు స్థానిక పీహెచ్సీలో వైద్య పరీక్షలను నెలలో ఒకసారి చేయిస్తున్నాం. 7 నెలలు నిండగానే వారికి జిల్లా ఆసుపత్రిలో నెలలో ఒకసారి వైద్య పరీక్షలు చేయిస్తున్నాం. గర్భిణులను ప్రతి నెలా ఆసుపత్రులకు తీసుకెళ్లి, తీసుకురావడం ఇబ్బందిగా ఉన్నా, కరోనా సమయంలో అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నాం. – కృష్ణవేణి, ఆశ కార్యకర్త, లక్సెట్టిపేట్ మండలం చదవండి: ఇంట్లో ఒంటరిగా ముగ్గురు పిల్లలు; నిజమైన హీరోలు మీరే! -
Shocking: కాటేసిన పాముతో ఆసుపత్రికి పరుగు.. భయపడిపోయిన వైద్యులు..
సాక్షి, కంప్లి(కర్ణాటక) : మెట్రి పంచాయతీ పరిధిలోని ఉప్పారహళ్లి గ్రామంలో కాడప్ప అనే యువకుడికి ఆదివారం నాగుపాము కాటేసింది. దీంతో కంగారు పడకుండా కాడప్ప చాకచక్యంగా పామును పట్టుకుని మెట్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నాడు. అక్కడ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఓ యువకుడి సాయంతో ద్విచక్ర వాహనంలో కంప్లి ఆస్పత్రికి చేరుకున్నాడు. పాము చేతపట్టుకుని ఆస్పత్రికి వస్తున్న కాడప్పను చూసి ఆస్పత్రికి వచ్చిన వారు భయపడ్డారు. వైద్యులు హుటాహుటిన ప్రాథమిక చికిత్స చేసి బళ్లారి విమ్స్‌కు తరలించారు. చదవండి: మెట్రోలో సీటు కోసం.. ఎంత పని చేశాడు! వైరల్ వీడియో -
అయ్యో నా కూతురు చనిపోయింది సార్, మీకు డ్రామాలా ఉందా?
లక్నో:దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా కారణంగా ట్రీట్మెంట్ ఇచ్చేందుకు డాక్టర్లు సాహసం చేయడం లేదు.దీంతో పలువురు అమాయకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఓ ఐదేళ్ల చిన్నారికి కరోనా సోకిందనే అనుమానంతో ట్రీట్మెంట్ ఇచ్చేందుకు డాక్టర్లు చికిత్స చేయలేదు. సకాలంలో ట్రీట్మెంట్ చేయకపోవడంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఉత్తర్ ప్రదేశ్ బారాబంకి జిల్లాకు చెందిన గౌస్పూర్లో ఓ ఐదేళ్ల చిన్నారి ఆడుకుంటూ మంచం మీద నుంచి కిందపడింది. అయితే అత్యవసర చికిత్స కోసం ఆమె తల్లిదండ్రులు చిన్నారిని గౌస్ పూర్‌కు చెందిన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ చిన్నారికి వైద్యం చేసేందుకు డాక్టర్లు ముందుకు రాలేదు. చివరికి రెండు గంటల తర్వాత చనిపోయింది. దీంతో డాక్టర్లు తీరుపై ఆవేదన వ్యక్తం చేసిన బాధితురాలి తండ్రి మృతదేహంతో ఆస్పత్రి ఎదుట కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ హృదయ విదారకర దృశ్యాల్ని స్థానికులు వీడియోలు తీయడంతో ఈ విషాదం చర్చనీయంగా మారింది. డాక్టర్లుపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపించాయి.అయితే చిన్నారి మరణంపై బారాబంకి చీఫ్ మెడికల్ ఆఫీసర్ బికెఎస్ చౌహాన్ మాట్లాడుతూ.. చిన్నారి మంచం పై నుంచి కింద పడిందని తల్లిదండ్రులు చెప్పారు. ఆస్పత్రికి తీసుకొచ్చిన వెంటనే పారామెడికల్ సిబ్బంది, డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి మార్గం మధ్యలోనే చనిపోయినట్లు నిర్ధారించారు. ఆమె తండ్రి చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. వైద్యులు తీరు ఎలా ఉందో చూడండి? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో చిన్నారి మృతదేహంతో విలపిస్తున్న తండ్రి.. చూడండి సార్. కరోనా బాధితుల్ని తాకేందుకు ఎవరు ఇష్టపడడం లేదు. రెండుగంటల పాటు నా కుమార్తెకు ట్రీట్మెంట్ ఇచ్చేందుకు డాక్టర్లు ముందుకు రాలేదు. ఈ డాక్టర్లు తీరుతో నా పాప చనిపోయిందని వాపోయాడు. నా బిడ్డ చనిపోయింది సహనంతో ఉండాలా? డాక్టర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తండ్రిని ఓదార్చేందుకు స్థానికులు ప్రయత్నించారు. మీరు కొంచెం సహనంతో ఉండాలని సముదాయిస్తుంటే నా బిడ్డ చనిపోయింది. నేను సహనంతో ఉండాలా? అని ప్రశ్నించాడు. ఇది మీకు డ్రామాలా ఉందా? అదే ఆస్పత్రి భయట ఆందోళన చేస్తున్నచిన్నారి తండ్రిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఏం డ్రామాలు చేస్తున్నావా అంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో సార్ ఇది మీకు డ్రామాలా కనిపిస్తుందా? నా కూతురు చనిపోయింది సార్ అంటూ కన్నీటి పర్యంతరమయ్యాడు. చేసేది లేక అధికారులపై చర్యలు తీసుకుంటాం. మీరు స్టేషన్ లో ఫిర్యాదు చేయండని పోలీసులు చెప్పడం పై స్థానికులు మండిపడుతున్నారు. చదవండి : షాకింగ్: ఇంట్లో పాములు.. అద్దెకే దిక్కులేదన్న ఓనర్! -
'ఈటలను మంత్రి పదవి నుంచి తప్పించిన కెపాసిటీ నాది'
సాక్షి, హిమాయత్‌నగర్(హైదరాబాద్): కరోనా రోగులతో ఆసుపత్రి నిండిపోయింది.. ఇంకా బయటి నుంచి వస్తూనే ఉన్నారు. వైద్యులు, సిబ్బంది క్షణం తీరికలేకుండా సేవలు చేయడంలో మునిగిపోయారు.. ఆక్సిజన్ సకాలంలో అందక ముగ్గురు రోగులు చనిపోయిన ఉదంతం ఇంకా మరవలేదు.. అంతలోనే ఇద్దరు వ్యక్తులు ఆసుపత్రిలోకి వచ్చి హల్చల్ సృష్టించారు. వైద్యులను, సిబ్బందిని హడలెత్తించారు. చివరికి పోలీసులకు చిక్కి రిమాండ్ పాలయ్యారు. అసలు విషయమేమిటంటే... తస్కీన్, అమరేందర్ అనే ఇద్దరు వ్యక్తులు యూనిట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డివిజన్ (ఎన్సీఐడీ) పేరిట ఇన్వెస్టిగేషన్ అధికారులుగా అవతారమెత్తారు. ఆదివారం ఆసుపత్రిలో సకాలంలో ఆక్సిజన్ అందక ముగ్గురు రోగులు చనిపోయిన ఘటనను ‘సుమోటోగా స్వీకరించిన’వీళ్లు రెండు రోజులు ఆలస్యంగా మంగళవారం సాయంత్రం ఆ దవాఖాన వద్దకు వచ్చారు. వేర్ ఈజ్ యువర్ సూపరింటెండెంట్..? ఫ్లోర్ ఇన్చార్జ్ షాహీదా వద్దకు వెళ్లి ఆక్సిజన్ ప్లాంట్‌కు దారి అడిగారు. ‘వీ ఆర్ ఫ్రం ఎన్సీఐడీ. వేర్ ఈజ్ యువర్ సూపరింటెండెంట్ ఛాంబర్ అండ్ వేర్ ఈజ్ ఆక్సిజన్ ప్లాంట్’ అంటూ గద్దించారు. వీళ్లు నిజమైన సీఐడీ అధికారులుగా భావించిన ఆమె ప్లాంట్‌కు దారి చూపించారు. వారు తమ ఫోన్లతో అక్కడ ఫొటోలు, వీడియోలు తీశారు. అక్కడ నుంచి రిసెప్షన్ వద్దకు రాగా... అదే సమ యంలో ఓ మహిళా కోవిడ్ రోగి అడ్మిషన్ కోసం వచ్చారు. అయితే నిబంధనల ప్రకారం రోగి రక్తంలో ఆక్సిజన్ శాతం గణనీయంగా తగ్గిపోతేనే అడ్మిషన్ ఇవ్వాలి. ఆ మహిళలకు 85 శాతం ఉండటంతో ఆసుపత్రిలో చేర్చుకోవడం కుదరదంటూ సిబ్బంది చెప్పారు. ఇది చూసిన ఈ ఎన్సీఐడీ ద్వయం రెచ్చిపోయింది. అసలు ఈ ఆసుపత్రిలో ఏం జరుగుతోంది, ప్రతి చోటా లంచం తీసుకుం టున్నారు, డబ్బు ఇవ్వకపోతే అడ్మిట్ చేసుకోవట్లేదు.. అంటూ ఆరోపణలు చేసింది. ఐసీయూలో వైద్యురాలికి బెదిరింపు.. అనంతరం ఆ ఇద్దరు వ్యక్తులు ఐసీయూలోకి దూసుకుపోయి ఫొటోలు, వీడియోలు తీయడం మొదలెట్టారు.. అక్కడ విధుల్లో ఉన్న ఓ వైద్యురాలు వీరిని గమనించి ‘ఎవరండీ మీరు.. ఐసీయూలోకి ఎందుకు వచ్చారు? అంటూ ప్రశ్నించగా.. ‘ఎవతివే నువ్వు? ఉద్యోగం చెయ్యాలని ఉందా లేదా’అంటూ ఆమెపై రంకెలు వేశారు. మా సంగతి మీకు తెలీదంటూ బెదిరింపు.. ఈ హైడ్రామాతో దాదాపు రెండు గంటలపాటు వైద్యులు, సిబ్బంది హడలిపోయారు. దీనిపై సమాచారం అందుకున్న స్పెషల్ ఆఫీసర్ విజయేంద్ర బోయి అబిడ్స్ ఏసీపీ వెంకట్‌రెడ్డిని అప్రమత్తం చేశారు. ఆయనతోపాటు నారాయణగూడ ఇన్స్పెక్టర్ భూపతి గట్టుమల్లు తమ సిబ్బందితో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. పోలీసులను చూశాక కూడా ఆ ఇద్దరూ ‘మా సంగతి మీకు తెలీదు, మేం తలచుకుంటే ఇక్కడ ఎవ్వరూ ఉద్యోగాలు చేయ్యలేరంటూ’బెదిరింపు ధోరణిని ప్రదర్శించారు. వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు ఠాణాకు తరలించి విచారించగా ఎన్సీఐడీకి సంబంధించిన అసలు విషయం బయటపడింది. వైద్యులను దూషించినందుకు, దౌర్జన్యానికి దిగినందుకు కేసు నమోదు చేసి ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. హల్చల్ చేస్తున్న సమయంలో వీరి వెంట ఉన్నది ఎవరు? వీరితో సంబంధాలు ఏంటి? అనే అంశాలు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ద్వయం గతంలోనూ ఇలాంటి బెదిరింపుల దందాలు చేసిందా? అనేది ఆరా తీస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేయొద్దంటూ పోలీసుల లేఖ నారాయణగూడ పోలీసులు ఇరువురినీ అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. ఈ ద్వయం గతంలోనే తమ సంస్థను రిజిస్ట్రేషన్ చేయాలంటూ సంబంధిత రిజిస్ట్రార్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న నారాయణగూడ పోలీసులు వీరి వ్యవహారశైలిని వివరిస్తూ, రిజిస్ట్రేషన్ చేయవద్దంటూ రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు. అయితే హల్చల్ చేయడానికి వారు ఇలా యూసీఐడీలుగా అవతారమెత్తారని, ఇక్కడ ఎవరినీ డబ్బులు డిమాండ్ చేయలేదని పోలీసులు పేర్కొన్నారు. అసలు వీరెవరంటే... డబీర్పురకుచెందిన మహ్మద్ తస్కీన్ ఆలిండియా సీనియర్ స్పెషల్ ఆఫీసర్, ప్రెసిడెంట్‌గా, మెట్టుగూడ వాసి అమరేందర్ సెక్రటరీగా యూసీఐడీ సంస్థను ఏ ర్పాటు చేశారు. దీన్ని రిజిస్ట్రేషన్ చేయాలంటూ సంబంధిత రిజిస్ట్రార్‌కు పంపిన దరఖాస్తు ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఈలోపే విజిటింగ్ కార్డులు ముద్రించుకు న్న ఈ ద్వయం రోడ్లపైకి ఎక్కింది. ఇందు లో యూనిట్ అనే పదాన్ని చిన్నగా... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డివిజన్‌ను పెద్దగా ఎర్ర అక్షరాలతో ముద్రించారు. అందులోనే వర్కింగ్ ఎగైనెస్ట్ క్రైమ్ అని రాశారు. ఈటలను మంత్రి పదవి నుంచి తప్పించిన కెపాసిటీ నాది అట్నుంచి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రనాథ్ ఛాంబర్‌కు వీళ్లిద్దరూ వెళ్లారు. ఆ సమయంలో ఛాంబర్లో నోడల్ అధికారి డాక్టర్ మల్లిఖార్జున్, అడిషినల్ సూపరింటెండెంట్ డాక్టర్ జలజ వెరోనికా, ఆర్ఎంవో నీరజ ఉన్నారు. వారిని చూస్తూ రెచ్చిపోయిన ఎన్సీఐడీ ప్రెసిడెంట్, సెక్రటరీలు ‘ఆదివారం ఆక్సిజన్ అందక రోగులు ఎందు కు చనిపోవాల్సి వచ్చింది? ఆక్సిజన్ పూర్త య్యే వరకు మీరేం చేస్తున్నారు?’అంటూ చిందులేశారు. అక్కడున్న అధికారులు ‘మీరు ఎవరు?’అంటూ వీరిని ప్రశ్నించారు. దీంతో ‘ఏం సూపరింటెండెంట్.. నన్నే అడుగుతావా? నేను ఎవర్ని అనుకుంటున్నావ్. ఈటల రాజేందర్ లాంటి వాడినే మంత్రి పదవి నుంచి తప్పించిన కెపాసిటీ నాది. మైండ్ యువర్ వర్డ్స్.. నీ అంతుచూస్తా’అంటూ వారిలో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. -
Covid 19: ఓవైపు భర్త మరణం.. మరోవైపు అటెండర్ అసభ్య ప్రవర్తన
పట్నా: ‘‘వైద్యో నారాయణో హరిః’’ అన్నారు. ఓ వైపు కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. మరో వైపు డాక్టర్లు తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా..అంకితభావంతో ప్రజలకు వైద్యసేవలను అందిస్తున్నారు. అయితే కొంతమంది వైద్య సిబ్బంది మాత్రం రోగుల పట్ల బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. బీహార్‌లోని భాగల్పూర్లో ఓ ఆసుపత్రి సిబ్బంది మహిళ పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. గ్లోకల్ హాస్పిటల్ వైద్యులు, మరో ఇద్దరు సిబ్బంది లైంగిక వేదింపులకు పాల్పడినట్లు సదరు మహిళ పేర్కొన్నారు. నగరంలోని గ్లోకల్, మాయాగంజ్ ఆసుపత్రి సిబ్బంది తన భర్తకు చికిత్స అందించడానికి నిరాకరించారని 12 నిమిషాల వీడియోలో పేర్కొంది. ‘‘నేను, నా భర్త నోయిడాలో ఉంటాం. హోలి పండుగ జరుపుకోవడానికి బిహార్ వచ్చాం. ఏప్రిల్ 9న నా భర్త అనారోగ్యానికి గురయ్యాడు. తీవ్రమైన జ్వరం వచ్చింది. దాంతో రెండుసార్లు కరోనా టెస్ట్ చేయిస్తే నెగెటివ్ వచ్చింది. ఆర్టీపీసీఆర్ టెస్ట్ కోసం ప్రయత్నిస్తే.. నోయిడాలోని ఓ వైద్యుడు సీటీ స్కాన్ చేయించాలని సూచించారు. స్కానింగ్‌లో ఊపిరితిత్తులు 60శాతం దెబ్బతిన్నాయని తేలింది. మరుసటి రోజు నా భర్త, నా తల్లిని భాగల్పూర్ ఆసుపత్రిలో చేర్పించాం. నా తల్లి పరిస్థితి బాగుంది. కానీ ఆ సమయంలో నా భర్త మాట్లాడలేపోయారు. ఆసుపత్రి సిబ్బంది మాత్రం ఆక్సిజన్ అందించడానికి కూడా నిరాకరించారు. బ్లాక్ మార్కెట్లో ఆక్సిజన్ కొన్నా ఫలితం దక్కలేదు. గ్లోకల్ ఆసుపత్రిలో పనిచేసే అటెండర్ జ్యోతి కుమార్ అసభ్యంగా ప్రవర్తించాడు. చున్నీ పట్టుకుని లాగుతూ వికృతంగా నవ్వాడు. ఆ సమయంలో నాకు భయం వేసింది. కానీ నా భర్త గురించిన ఆలోచనే ఉంది. మా అమ్మ, భర్త ఉన్నారు కదా అని ధైర్యం చెప్పుకొన్నాను. నిజానికి ఆసుపత్రి సిబ్బంది కనీసం మంచంపై బెడ్ షీట్స్ మార్చడానికి అనుమతించ లేదు. కోవిడ్-19 చికిత్స కోసం ఉపయోగించే రెమ్‌డెసివిర్ మందును వృథా చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్ల నా భర్త ప్రాణాలు కోల్పోయారు ’’ అని ఆమె తన ఆవేదన వెళ్లగక్కింది. కాగా.. దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. కరోనా వల్ల ప్రభావితమైన రాష్ట్రాల్లో బిహార్ ఒకటి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 11,000 కేసులు నమోదు కాగా, 67 మంది మరణించారు. ఇప్పటి వరకు బిహార్‌లో 5.91 లక్షల కేసులు నమోదు కాగా..4.77 లక్షల మంది కోలుకోగా.. 3,282 మంది మరణించారు. ఇక దేశంలో 2.27 కోట్ల కరోనా కేసులు నమోదు కాగా..1.87 కోట్ల మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోవిడ కారణంగా 2.46 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. (చదవండి: కరోనా: ఆ టీకా ఒక్క డోసుతో 80 శాతం మరణాల రేటు తగ్గుదల!) -
ముంబై వొఖార్డ్ ఆసుపత్రి సీజ్
ముంబై: ముంబై సెంట్రల్‌లోని వొఖార్డ్ ఆసుపత్రికి చెందిన ముగ్గురు వైద్యులు, 26 మంది నర్సులు, పారామెడికల్ సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో ఆసుపత్రిలో వైద్యసేవలను నిలిపివేశారు. వీరికి వైరస్ సోకిందనే విషయాన్ని విచారిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఆసుపత్రిలో ఉన్న వారందరినీ క్వారంటైన్లో ఉంచారు. ముంబైలో సోమవారం నాటికి 490 పైగా కోవిడ్ కేసులు నమోదుకాగా 34 మంది మరణించారు. -
ఆస్పత్రి బయటే మహిళ ప్రసవం
సాక్షి, నాగార్జునసాగర్ : ఆస్పత్రి ఆరుబయటే ఓ మహిళ ప్రసవించింది. పురిటి నొప్పులతో ఆస్పత్రికి వచ్చిన గర్భిణికి ఇక్కడ కాన్పు చేయలేమని నల్లగొండకు తీసుకెళ్లాలని సిబ్బంది చెప్పడంతో.. వారు ఆసుపత్రి బయటకు రాగానే అక్కడే కాన్పు అయ్యింది. ఈ సంఘటన నాగార్జునసాగర్ కమలా నెహ్రూ ఆస్పత్రి వద్ద శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. తిరుమలగిరి మండలం జాల్‌తండాకు చెందిన విమోజకు శుక్రవారం రాత్రి పురిటి నొప్పులు రావడంతో శనివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు సాగర్ తీసుకొచ్చారు. డ్యూటీలో ఉన్న డాక్టర్ అరవింద్ ఆస్పత్రిలో గైనకాలజిస్ట్ లేడని.. గర్భిణి విమోజ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని నల్లగొండకు తీసుకెళ్లాలని రెఫర్ చేశాడు. ఆమె నొప్పి ఎక్కువగా ఉందని చెప్పినా.. డాక్టర్, సిబ్బంది పట్టించుకోకుండా నల్లగొండకు వెళ్లమని ఒత్తిడి చేశారు. వారు ఆస్పత్రి బయటకు వెళ్లగానే నొపులు ఎక్కువై అక్కడే కాన్పు అయ్యింది. మగబిడ్డకు జన్మనిచ్చింది. తండాకు చెందిన ఆడవాళ్లే కాన్పు చేశారు. అనంతరం తల్లీ బిడ్డను ఆస్పత్రిలోకి అనుమతించారు. పురిటి నొప్పులతో ఇబ్బందులు పడుతున్నా.. కనికరం చూపని డాక్టర్, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని భర్త మోతీలాల్ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై డాక్టర్ అరవింద్‌ను వివరణ కోరగా.. తల్లి వద్ద రక్తం సరిపోయేంత లేకపోవడంతో పాటు గైనకాలజిస్ట్ అందుబాటులో లేకపోవడంతోనే నల్లగొండకు రెఫర్ చేసినట్లు తెలిపారు. అంబులెన్స్ మాట్లాడి తీసుకెళ్లడం ఆలస్యం కావడంతో ఇక్కడే డెలివరీ అయ్యిందని ఆ సమయంలో మా సిబ్బందిని వారు దగ్గరకు రానివ్వలేదని పేర్కొన్నారు. -
డాక్టర్లు కాదు..ఛీటర్లు!
సాక్షి, కర్నూలు(హాస్పిటల్): వైద్యవృత్తి ఎంతో పవిత్రమైనది. వైద్య విద్యను అభ్యసించాలంటే చాలా కష్టపడాలి. కానీ కొందరు ఎలాంటి కష్టమూ లేకుండానే వైద్యుల అవతారం ఎత్తుతున్నారు. మెడలో స్టెతస్కోప్ వేసుకుని.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇలాంటి వారు జిల్లాలో తరచూ ఎక్కడో ఒకచోట పట్టుబడుతున్నారు. తాజాగా సోమవారం ఇంటర్మీడియట్ చదివి ఎంబీబీఎస్ డాక్టర్‌గా చలామణి అవుతున్న భరత్ అనే యువకుడు కర్నూలులోని అమ్మ హాస్పిటల్లో పనిచేస్తూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు పట్టుబడ్డాడు. అయినప్పటికీ ఇలాంటి వారిని సమూలంగా ఏరివేయడానికి వైద్య, ఆరోగ్య శాఖ ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదు. విజిలెన్స్ అధికారులు దాడులు చేసిన తర్వాత అక్కడికెళ్లి రికార్డులు రాసుకోవడంతోనే సరిపెట్టుకుంటోంది. ఆర్ఎంపీలే పెద్ద డాక్టర్లు! ఆదోని డివిజన్లోని అన్ని మండలాలు, కర్నూలు డివిజన్లోని వెల్దుర్తి, కృష్ణగిరి, డోన్ తదితర మండలాల్లో ఆర్ఎంపీలే పెద్ద డాక్టర్లుగా చలామణి అవుతున్నారు. కర్నూలు నగరంలోని బుధవారపేట, శరీన్‌నగర్, కృష్ణానగర్, వీకర్‌సెక్షన్ కాలనీ, కల్లూరు తదితర ప్రాంతాల్లోనూ ఆర్ఎంపీలే ‘ప్రధాన వైద్యులు’. వీరికి ఉన్న ‘ప్రాక్టీస్’.. నిపుణులైన, అర్హులైన వైద్యులకు కూడా లేదంటే అతిశయోక్తి కాదు. వచ్చీరాని వైద్యంతో రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఎలాంటి రోగమైనా సరే ముందుగా స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్, యాంటీ బయాటిక్స్ ఇవ్వడం, ఫ్లూయిడ్స్ ఎక్కించడం పరిపాటిగా మారింది. కొందరైతే ఏకంగా ప్రసవాలు, అబార్షన్లు చేస్తున్నారు. మరికొందరు కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, నందికొట్కూరు, పత్తికొండ తదితర ప్రాంతాల్లోని ప్రైవేటు ఆసుపత్రుల్లో డ్యూటీ డాక్టర్లుగా చలామణి అవుతున్నారు. సోమవారం కర్నూలులో పట్టుబడిన భరత్ అనే యువకుడు నగరంలోని అమ్మ హాస్పిటల్‌తో పాటు ఓమిని హాస్పిటల్లోనూ పనిచేస్తున్నట్లు అధికారుల వద్ద ఒప్పుకున్నాడు. క్యాజువాలిటీ, ఏఎంసీ, ఐసీయూల్లో డ్యూటీ డాక్టర్లుగా పనిచేసేందుకు ఎంబీబీఎస్ చేసిన వారు రాకపోవడంతో ఆర్ఎంపీలు, పీఎంపీలు, యునాని, ఆయుర్వేద వైద్యులను నియమించుకుంటున్నట్లు ఆసుపత్రి యాజమాన్యాలు అంగీకరిస్తున్నాయి. విజిలెన్స్ దాడుల్లో పట్టుబడిన వారు.. - ఈ నెల 19న వెల్దుర్తిలో శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్లినిక్‌లో డాక్టర్ మంగమ్మ అలియాస్ డాక్టర్ మంజులారెడ్డి పేరుతో ఓ మహిళ తన వద్దకు వచ్చిన రోగులకు అల్లోపతి, ఆయుర్వేద మందులు ఇవ్వడమే గాక గర్భిణులకు స్కానింగ్ కూడా చేస్తూ పట్టుబడింది. - గూడూరులో 15 ఏళ్లుగా ఎలాంటి అనుమతులు లేకుండా అనురాధ హాస్పిటల్‌ను నిర్వహిస్తున్న శ్రీరాములు అనే వ్యక్తిని గత ఏడాది విజిలెన్స్ అధికారులు దాడి చేసి పట్టుకుని, ఆసుపత్రిని సీజ్ చేశారు. ఎలాంటి విద్యార్హత లేని అతను 50 పడకల ఆసుపత్రిని నిర్వహించడంతో పాటు ఆయుర్వేదం, అల్లోపతి వైద్యం చేయడం, చిన్నపిల్లలకూ చికిత్స అందించడం గమనార్హం. అంతటితో ఆగకుండా గర్భిణులకు స్కానింగ్ చేసి లింగనిర్ధారణ కూడా చేసేవాడు. కాన్పులతో పాటు అబార్షన్లు చేయడంలోనూ అతను దిట్ట. అయినా అతని ఆసుపత్రి వైపు వైద్య ఆరోగ్యశాఖ కన్నెత్తి చూడలేకపోయింది. చివరకు విజిలెన్స్ రంగంలోకి దిగడంతో శ్రీరాములు పాపం పండింది. - కర్నూలులోని కొత్తబస్టాండ్ ఎదురుగా ఉండే జేపీ హాస్పిటల్స్‌ను ఇంటర్ చదివిన యువకులు ఎండీ డాక్టర్లుగా చలామణి అవుతూ నిర్వహించేవారు. విజిలెన్స్ అధికారులు ఈ విషయాన్ని గుర్తించి గత సంవత్సరం సీజ్ చేశారు. ఈ యువకులే ఆదోనిలో నిర్వహించే విజయగౌరి హాస్పిటల్‌పైనా దాడులు నిర్వహించి సీజ్ చేశారు. - నిబంధనలకు విరుద్ధంగా టైఫాయిడ్, జాండిస్ వ్యాక్సిన్లు వేస్తూ ప్రజలను మోసగిస్తున్న కర్నూలు నగరం నెహ్రూనగర్‌లో ఉన్న నకిలీ వైద్యున్ని గత ఏడాది విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఇతను 20 ఏళ్లుగా క్లినిక్ ఏర్పాటు చేసుకుని.. దర్జాగా వైద్యం చేస్తున్నా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. అనుమతి లేని ఆస్పత్రులు జిల్లాలో ఎక్కడైనా ఆసుపత్రి తెరవాలంటే వైద్య, ఆరోగ్య శాఖ వద్ద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించాలి. ఇప్పటి వరకు ప్రైవేటు ఆసుపత్రులు 400, స్కానింగ్ కేంద్రాలు 248 రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయి. వీటితో పాటు క్లినిక్‌లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు మరో 150 దాకా రిజిష్టర్ అయ్యాయి. అయితే.. వీటికి రెండింతలు ఎక్కువగా జిల్లాలో నడుస్తున్నాయి. రిజిస్ట్రేషన్ కోసం చేసుకున్న దరఖాస్తులు వైద్య, ఆరోగ్యశాఖలో పదుల సంఖ్యలో పెండింగ్ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ గడువు తీరడంతో రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్న ఆసుపత్రులూ మరో 30కి పైగా ఉన్నాయి. కానీ ఈ ఫైళ్ల వైపు చూసే తీరిక వైద్య,ఆరోగ్యశాఖ అధికారులకు లేకుండా పోయింది. ఇక్కడ పనిచేసే కొందరు ఉద్యోగులు ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్‌లు, స్కానింగ్ సెంటర్లకు వెళ్లి మామూళ్లు తెచ్చుకుంటూ వాటి అనుమతులు, రెన్యూవల్స్ గురించి పట్టించుకోవడం లేదు. -
స్వైన్‌ఫ్లూ కేసులు రెఫర్ చేయొద్దు
సాక్షి, అనంతపురం న్యూసిటీ: స్వైన్‌ప్లూ కేసులన్నీ కర్నూలుకు రెఫర్ చేయవద్దని సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ పల్మనాలజీ విభాగం హెచ్ఓడీ డాక్టర్ రామస్వామిని ఆదేశించారు. సోమవారం ‘సాక్షి’లో మందుల్లేవ్..మాస్కుల్లేవ్ అన్న కథనానికి ఆయన స్పందించారు. ఉదయం పల్మనాలజీ, మెడిసిన్, పీడియాట్రిక్ విభాగం వైద్యులతో సమావేశమయ్యారు. కేసులు ఎందుకు రెఫర్ చేయాల్సి వస్తోందని హెచ్ఓడీ రామస్వామిని ప్రశ్నించారు. వారి ఇష్టపూర్వకంగానే వెళ్తున్నారని హెచ్ఓడీ సమాధానమిచ్చారు. అందరూ ఆ విధంగా కర్నూలుకు ఎందుకు వెళ్తామంటారని సూపరింటెండెంట్ ప్రశ్నించారు. మార్గమధ్యంలో ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారన్నారు. మౌలిక సదుపాయాలు పుష్కలంగా ఉండి, ఏవిధంగా ఇతర ప్రాంతాలకు పంపుతారన్నారు. ఇది సరైన పద్ధతికాదని, ఉన్నతాధికారులకు తామేమి సమధానం చెప్పాలన్నారు. సూపరింటెండెంట్ నేనా.. పల్మనాలజీ హెచోడీనా? స్వైన్‌ప్లూ లక్షణాలు కన్పిస్తే, ఎలాంటి ఆలోచన చేయకుండా స్వైన్‌ఫ్లూ వార్డులో ఉంచాలన్నారు. చిన్నపిల్లల విభాగం హెచ్ఓడీ డాక్టర్ మల్లీశ్వరి పాజిటివ్ అయితేనే పంపమన్నారని చెప్పారు. సూపరింటెండెంట్ ‘నేనా.. డాక్టర్ రామస్వామినా’ అని డాక్టర్ మల్లీశ్వరిని ప్రశ్నించారు. తక్షణం కేసులను స్వైన్‌ప్లూ వార్డుకు మార్చాలని ఆదేశించారు. స్వైన్‌ప్లూ వార్డులో ఉండే కేసులు ఇతర విభాగాల వైద్యులు చూడాలంటే ఎలాగని డాక్టర్ రామస్వామిని సూపరింటెండెంట్ ప్రశ్నించారు. స్వైన్‌ప్లూ లక్షణాలు కాకుండా వేరే సమస్యలుంటే ఫాలోఅప్ చేస్తారని, రోజూ వారు రావాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. సమన్వయంతో పని చేసి రోగులకు మెరుగైన సేవలందించాలన్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఇన్చార్జ్ ఆర్ఎంఓ డాక్టర్ విజయమ్మ, మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాసులు, ఆస్పత్రి మేనేజర్ శ్వేత, తదితరులు పాల్గొన్నారు. -
మల్టీకేర్‌లో ఘరానా మోసం
పాలకోడేరు : నిరుపేదలకు ఖరీదైన వైద్యం అందించాలనే సదుద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీని ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవగా పేరుమార్చి అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా చేసింది. వివరాల్లోకి వెళ్తే.. పాలకోడేరు మండలం పెన్నాడ గ్రామానికి చెందిన పొదిలాపు రాంబాబు ఎఫ్‌సీఐలో హమాలీగా పనిచేస్తున్నాడు. ఫిబ్రవరి నెలలో సైకిల్‌పై వెళ్తుండగా వెనుక నుంచి మోటార్ సైకిలిస్ట్ ఢీకొట్టాడు. ఫలితంగా మెడ భాగంలో గట్టిగా దెబ్బ తగిలింది. మెడ కదల్చలేని స్థితిలో విశాఖ పట్టణంలోని ఆదిత్య మల్టికేర్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి మెడ భాగంలో పూసలు కొద్దిగా తప్పుకున్నాయని, ఫలితంగా నరాలు దెబ్బతిన్నాయని ఆపరేషన్ ద్వారా సరిచేయవచ్చని చెప్పారు. అందుకు రాంబాబు సరేనన్నారు. ఇక అక్కడ నుంచి శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమా మొదలైంది. న్యూరో సర్జన్ అసిస్టెంట్ ఫ్రొఫెసర్ గొల్లా రామకృష్ణ ఈ ఏడాది ఫిబ్రవరి 10న ఆపరేషన్ చేసి మందులిచ్చి పంపించేశారు. మందులు ప్రభావంతో కొద్ది రోజులు తగ్గినా మరలా పరిస్థితి మామూలుగా తయారయింది. రెండోసారి వెళ్లినప్పుడు కూడా మందులిచ్చి పంపేంచేశారు. ఈసారి పరిస్థితి సీరియస్‌గా మారింది. కాళ్లు, చేతులకు రక్త ప్రసరణ తగ్గి కదలికలు లేకుండా స్తంభించిపోయాయి. కేవలం ద్రవ ఆహారంపైనే ఆధారపడటంతో శరీరం క్షీణించి పోయింది. దాంతో విషయం తెలిసిన ఆర్టీఐ ప్రొటెక్షన్ కౌన్సిల్ జిల్లా కోఆర్డినేటర్ కె.శ్రీనివాస్ భీమవరంలోని ప్రైవేటు ఆస్పత్రిలో స్కానింగ్ తీయించగా ఆశ్చర్యకరమైన విషయం బహిర్గతమైంది. అసలు రాంబాబుకు ఆపరేషనే జరగలేదని పరీక్షల్లో తేలింది. ఇదే విషయమై విశాఖలోని ఆస్పత్రి వర్గాలను ప్రశ్నించినా స్పందన లేదని శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం మరో చోట వైద్యం చేయించుకుందామన్నా వైద్యసేవ కార్డు ఆస్పత్రి వర్గాల్లో క్లెయిమ్ చేయించుకున్నారని దాంతో పనికి రాకుండా పోయిందన్నారు. ప్రభుత్వమే స్పందించి బాధితునికి మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నారు. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
చివ్వెంల(సూర్యాపేట) : అనుమానాస్పదస్థితిలో వివాహిత మృతి చెందింది. ఈ ఘటన మండల పరిధిలోని జి.తిర్మలగిరిలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఆత్మకూర్(ఎస్) మండల పాతర్లపహాడ్ గ్రామానికి చెందిన ఉప్పుల బుచ్చిమల్లు కుమార్తె కొమ్ము సునీత(28)కు చివ్వెంల మండల పరిధి జి.తిర్మలగిరి గ్రామానికి చెందిన కొమ్ము వెంకన్నతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు కాగా మంగళవారం ఉదయం సునీత తీవ్ర అస్వస్థతకు గురకావడంతో చికిత్స నిమిత్తం సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టు అనంతరం వివరాలు వెల్లడిస్తామని ఎస్ఐ బి.ప్రవీణ్‌కుమార్ తెలిపారు. మృతురాలి తండ్రి బుచ్చిమల్లు ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన సూర్యాపేట క్రైం : వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే సునీత మృతిచెందిందని ఆరోపిస్తూ ఆమె బంధువులు సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. గాయపడిన సునీతను ఆస్పత్రిలో చేర్పిం చగా వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి చికిత్స అందించకపోవడంతోనే మృతిచెందిందని ఆరోపించారు. మరో ఆస్పత్రికి వెళ్తామని చెప్పినా తామే వైద్యం చేస్తామని నిర్లక్ష్యం చేసి నిండు ప్రాణాన్ని బలిగొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీ సులు ఘటన స్థలానికి చేరుకుని ఆందోళనను విరమింపజేశారు. -
కవలల కుటుంబం
- వంశపారంపర్యంగా అందరూ కవలలే - ఒకే కాన్పులో ముగ్గురు ఆడ శిశువులు జననం పి.ఎన్.కాలనీ: ఆ కుటుంబంలో కవలల పంట పండుతోంది. కవలల జననం వారసత్వంగా మారింది. వివరాల్లోకి వెళ్తే... పాలకొండ మండలం బాసూరు గ్రామానికి చెందిన ముంజేటి లక్ష్మణరావు భార్య సుజాత పట్టణంలోని మందుల మోహనరావు ఆస్పత్రిలో శుక్రవారం ముగ్గురు ఆడ శిశువులకు జన్మనిచ్చింది. ముగ్గురు బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. అయితే, కవలల జననం వంశపారంపర్యంగా రావడం గమనార్హం. లక్ష్మణరావు కూడా తన అన్నయ్య రాముతో కలసి కవలలుగా జన్మించాడు. అలాగే, లక్ష్మణరావు పెదనాన్న పిల్లలు కూడా కవలలే. గతంలో కూడా లక్ష్మణరావు దంపతులకు ఇద్దరు కవలలు పుట్టి మరణించారు. ఆ తరువాత ఒక మగబిడ్డకు జన్మనిచ్చారు. అయితే, వారసత్వంగా వస్తున్న కవలలు పుట్టి మరణించడం తమను ఎంతగానో బాధించిందని, మళ్లీ ఒకే కాన్పులో ముగ్గురు కవలలు జన్మించడంతో.. కుటుంబం మొత్తం కవలలతో కళకళలాడుతోందని దంపతులిద్దరూ ఆనందం వ్యక్తం చేశారు.