ఐటీ ఉద్యోగం.. వర్క్‌ఫ్రం హాస్పిటల్‌! | Telangana: Hyderabad Redefines Work From Hospital Trend | Sakshi
Sakshi News home page

ఐటీ ఉద్యోగం.. వర్క్‌ఫ్రం హాస్పిటల్‌!

Published Mon, Feb 26 2024 12:53 PM | Last Updated on Mon, Feb 26 2024 2:20 PM

Telangana Hyderabad Redefines Work From Hospital Trend - Sakshi

ఇంట్లో ఏవరైనా చిన్నపిల్లలు, పెద్దవారికి లేదా తమకే ఆరోగ్యం బాగులేనపుడు ఆసుపత్రికి వెళ్లాల్సివస్తుంది. అయితే వీక్‌ డేస్‌లో అయితే ఫరవాలేదు. కానీ ఎమర్జెన్సీ పరిస్థితులు, ప్రత్యేకంగా డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ సందర్భాల్లో మాత్రం ఉద్యోగరీత్యా వెళ్లడం కుదరకపోవచ్చు.

ఒకవేళ తప్పనిసరి వెళ్లాల్సివస్తే ఆ రోజు సెలవు పెట్టాల్సిందే. డాక్టర్‌ చూసేది కొద్దిసేపే అయినా అక్కడ గంటల తరబడి ఎదురుచూస్తూ ఖాళీగా కూర్చోవాల్సిందే. వర్క్‌ఫ్రంహోమ్‌ చేసే టెకీలకు ఇకపై ఈ ఇబ్బంది తీరనుంది. హాస్పిటల్స్‌లో ల్యాప్‌టాప్‌ల ద్వారా వర్క్‌ చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతో డాక్టరును సంప్రదించే సమయంలోనూ చేసే పనికి అంతరాయం కలగకుండా చూసుకోవచ్చు.

ఉద్యోగుల ఇబ్బందులను గుర్తించిన కార్పొరేట్‌ ఆసుపత్రులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆసుపత్రిలోనే పనిచేసుకునేందుకు అవకాశం కల్సిస్తున్నారు. ఈ రోజుల్లో ఎక్కువ మంది ల్యాప్‌టాప్‌పైనే పనిచేస్తున్నారు. వీరు ఎక్కడి నుంచైనా పనిచేయవచ్చు. ఒక డెస్క్‌, వైఫై ఉంటే చాలు. అయితే వర్క్‌ఫ్రంహోం ద్వారా పని చేస్తున్న ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి అటెండర్లకు ఈ తరహా సౌకర్యాలు కల్పిస్తున్నాయి.

సెలవు దొరక్కపోవడం వల్ల అనారోగ్యంతో బాధపడుతున్నా ఆసుపత్రికి వెళ్లడం కుదరక చాలామంది వాయిదా వేస్తుంటారు. ఇంట్లో పెద్దవాళ్లు, దీర్ఘకాల సమస్యలతో బాధపడేవారు తీవ్ర ఇబ్బంది పడుతుంటారు. పిల్లల ఉద్యోగాలు, సెలవుల వంటి  పరిస్థితి చూసి వీరే సర్దుకుంటుంటారు. ఆసుపత్రుల్లో అందుబాటులోకి వస్తున్న సదుపాయాలతో రోగులు, వారి సహాయకులు ముఖ్యంగా టెకీలకు కొంత వరకైనా ఉపయోగకరంగా ఉండనుంది.

ఇదీ చదవండి: అక్రమ రుణయాప్‌లు.. యమపాశాలు! ఎలా మోసం చేస్తున్నారో తెలుసా..

ఐటీ కారిడార్‌లోనే ఓ ప్రముఖ ఆసుపత్రి అక్కడికి వచ్చే రోగులు, వారి సహాయకులు ఎవరైనా పనిచేసుకునేందుకు ‘వర్క్‌ఫ్రమ్‌ ఆసుపత్రి’ సదుపాయాలు కల్పిస్తుంది. అక్కడ పనిచేసుకునేందుకు వీలుగా వర్క్‌డెస్క్‌ను ఏర్పాటు చేసింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement