హడలెత్తించిన మొసళ్లు | Two Crocodiles Tension At Nirmal And Mulugu Districts | Sakshi
Sakshi News home page

రెండు చోట్ల హడలెత్తించిన మొసళ్లు

Published Sun, Sep 18 2022 4:24 PM | Last Updated on Mon, Sep 19 2022 8:09 AM

Two Crocodiles Tension At Nirmal And Mulugu Districts - Sakshi

ఎలగడపలో.. రామన్నగూడెంలో.. 

కడెం(ఖానాపూర్‌)/ఏటూరునాగారం: వేర్వేరు చోట్ల రెండు మొసళ్లు హడలెత్తించాయి. నిర్మల్‌ జిల్లా ఎలగడప గ్రామంలోకి శుక్రవారం అర్ధరాత్రి ఓ మొసలి ప్రవేశించి.. గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. గ్రామస్తుల సమాచారంతో అక్కడకు చేరుకున్న అటవీ సిబ్బంది మొసలిని చాకచక్యంగా తాళ్లతో బంధించి తీసుకెళ్లి కడెం ప్రాజెక్టులో వదిలారు.

అలాగే, ములుగు జిల్లా రామన్నగూడెం పుష్కరఘాట్‌ వద్ద శనివారం జాలర్ల వలకు ఓ మొసలి చిక్కింది. భయాందోళనకు గురైన జాలర్లు వెంటనే దానిని తిరిగి గోదావరి నదిలోకి వదిలేశారు. గోదావరిలోకి మొసళ్లు వచ్చాయని, స్నానాలకు వెళ్లే వారు జాగ్రత్తలు పాటించాలని స్థానికులు హెచ్చరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement