Sarpanch Attack On NREGA Technical Assistant With Petrol In Nirmal District - Sakshi
Sakshi News home page

దారుణం: ఉపాధి హామీ అధికారిపై పెట్రోల్‌తో సర్పంచ్‌ దాడి

Published Tue, Jul 13 2021 7:49 PM | Last Updated on Wed, Jul 14 2021 8:49 AM

Sarpanch Attack On NREGA Technical Assistant With Petrol In Nirmal - Sakshi

సాక్షి,  నిర్మల్‌: నిర్మల్ జిల్లాలోని కుబీర్‌ మండల కేంద్రంలోని జాతీయ ఉపాధి హామీ కార్యాలయంలో దారుణం చోటుచేసుకుంది. ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ రావుల రాజుపై పాత సావ్లీ గ్రామ సర్పంచ్ సాయినాథ్ పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. వెంటనే స్పందించిన తోటి ఉద్యోగులు మంటలను అర్పారు. ఈ దాడిలో రాజు తీవ్రంగా గాయపటంతో చికిత్స కోసం బైంసాకు తరలించారు.

ఉపాధి పనుల విషయంలో సంకతం చేయాలని సర్పంచ్ సాయినాథ్ కోరగా, రాజు నిరాకరించడంతో పెట్రోల్ పోసి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. పెట్రోల్ దాడిపై వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. సర్పంచ్ సాయినాథ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement