technical assistant
-
దారుణం: ఉపాధి హామీ అధికారిపై పెట్రోల్‌తో సర్పంచ్ దాడి
సాక్షి, నిర్మల్: నిర్మల్ జిల్లాలోని కుబీర్ మండల కేంద్రంలోని జాతీయ ఉపాధి హామీ కార్యాలయంలో దారుణం చోటుచేసుకుంది. ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ రావుల రాజుపై పాత సావ్లీ గ్రామ సర్పంచ్ సాయినాథ్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వెంటనే స్పందించిన తోటి ఉద్యోగులు మంటలను అర్పారు. ఈ దాడిలో రాజు తీవ్రంగా గాయపటంతో చికిత్స కోసం బైంసాకు తరలించారు. ఉపాధి పనుల విషయంలో సంకతం చేయాలని సర్పంచ్ సాయినాథ్ కోరగా, రాజు నిరాకరించడంతో పెట్రోల్ పోసి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. పెట్రోల్ దాడిపై వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. సర్పంచ్ సాయినాథ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండి!
హైదరాబాద్‌లోని సీఎస్ఐఆర్– నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఎన్జీఆర్ఐ).. టెక్నికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 38 ► పోస్టుల వివరాలు: టెక్నికల్ అసిస్టెంట్–21, టెక్నికల్ ఆఫీసర్–06, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్–1–07, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్–2–04. ► టెక్నికల్ అసిస్టెంట్: అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. వయసు: 28ఏళ్లు మించకూడదు. ► టెక్నికల్ ఆఫీసర్: అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/తత్సమాన, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణుల వ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ► సీనియర్ టెక్నికల్ ఆఫీసర్–1: అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. వయసు: 35 ఏళ్లు మించకూడదు. ► సీనియర్ టెక్నికల్ ఆఫీసర్–2: అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో ఐదేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 40 ఏళ్లు మించకూడదు. ► ఎంపిక విధానం: పోస్టులను అనుసరించి టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు షార్ట్‌లిస్టింగ్, ట్రేడ్ టెస్ట్, రాతపరీక్ష ఆధారంగా; సీనియర్ టెక్నికల్ ఆఫీసర్–1,2 పోస్టులకు షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 30.04.2021 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31.05.2021 ► వెబ్సైట్: www.ngri.org.in డబ్ల్యూడీసీడబ్ల్యూలో 42 అంగన్వాడీ టీచర్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ హైదరాబాద్ పరిధిలో గల ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న మెయిన్ అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 42 ► ప్రాజెక్టుల వారీగా ఖాళీలు: ఐసీడీఎస్, చార్మినార్–08, ఐసీడీఎస్, గోల్కొండ–10, ఐసీడీఎస్, ఖైరతాబాద్–10, ఐసీడీఎస్, నాంపల్లి–09, ఐసీడీఎస్, సికింద్రాబాద్–05. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 16.05.2021 ► వెబ్సైట్: http://wdcw.tg.nic.in SBI Recruitment 2021: బ్యాంకు ఉద్యోగాలు.. నెలకు 30వేల వేతనం -
ఏసీబీ వలలో వాటర్‌షెడ్ టీఏ
► ఇద్దరు రైతుల నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టివేత ► మార్కాపురం వాటర్‌షెడ్ పథకం కార్యాలయంలో ఘటన.. మార్కాపురం : ఇద్దరు రైతుల నుంచి లంచం తీసుకుంటున్న వాటర్‌షెడ్ పథకం టెక్నికల్ అసిస్టెంట్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సంఘటన పట్టణంలోని తర్లుపాడు రోడ్డులో ఉన్న వాటర్‌షెడ్ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. ఏసీబీ డీఎస్పీ ఆర్వీఎస్ఎన్ మూర్తి కథనం ప్రకారం.. మార్కాపురం మండలం బిరుదుల నరవకు చెందిన సీహెచ్ చిన్న సాల్మన్, పెద్దనాగులు ఈ ఏడాది మేలో తమ పొలంలో పంట సంజీవని పథకం కింద నీటి కుంటలు తొవ్వుకున్నారు. ఒక్కో కుంటకు 1.80 లక్షల రూపాయలతో వాటర్‌షెడ్ కార్యాలయంలో పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్ (కాంట్రాక్టు ఉద్యోగి) త్రిపురారెడ్డి అధికారులకు ప్రతిపాదనలు పంపారు. ఆరు నెలలు నుంచి బిల్లులు మంజూరు చేయకుండా రైతులను ఆయన ఇబ్బంది పెడుతున్నాడు. ఒక్కొక్కరు తనకు 20 వేల రూపాయలు ఇస్తేనే నిధులు మంజూరు చేయిస్తానని రైతులతో చెప్పాడు. ఈ నెల 13న సాల్మన్, పెద్ద నాగులు కలిసి ఒంగోలులోని ఏసీబీ అధికారులను సంప్రదించారు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు వాటర్‌షెడ్ కార్యాలయానికి చేరుకున్నారు. ముందుగా సిద్ధం చేసిన పది రూ.2 వేల నోట్లు మొత్తం రూ.20 వేలు బాధిత రైతులకు ఇచ్చారు. ఆ నగదు తీసుకున్న రైతులు నేరుగా త్రిపురారెడ్డి వద్దకు వెళ్లి ఇచ్చారు. ఆయన వెంటనే ఆ నగదును జేబులో పెట్టుకున్నాడు. ఆ వెంటనే ఏసీబీ డీఎస్పీ మూర్తి, సీఐ ప్రతాప్‌కుమార్‌ల ఆధ్వర్యంలో ఎస్ఐ కరీముల్లా, హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్‌లు లోపలికి వెళ్లి త్రిపురారెడ్డిని అదుపులోకి తీసుకుని రూ.20 వేలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆయనపై కేసు నమోదు చేశారు. తమను ఆరు నెలల నుంచి బిల్లులు ఇవ్వకుండా తిప్పుకోవడంతో విసిగి వేసారి ఏసీబీ అధికా>రులను ఆశ్రయించినట్లు బాధిత రైతులు తెలిపారు. ఈ వార్త పట్టణంలో క్షణాల్లో తెలిసి పోవడంతో ప్రభుత్వ కార్యాలయాల్లోని సిబ్బంది అలర్ట్ అయ్యారు. నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. -
ఉద్యోగినిపై ‘అధికార’ పెత్తనం
♦ ఎంపీడీఓపై కేసు ఉపసంహరించుకుంటే సరే... ♦ లేదంటే ఉన్న ఉద్యోగం ఊడుతుంది... ♦ టెక్నికల్ అసిస్టెంట్‌కు ఉన్నతాధికారి బెదిరింపులు ♦ ఆమేరకు సియూజీ సిమ్ కట్ చేసిన వైనం సాక్షి ప్రతినిధి, కడప : ‘ఆడబిడ్డలకు అండగా ఉంటాం. విధి నిర్వహణలో మహిళా ఉద్యోగులపై వేధింపులు సహించం.’ ఇవన్నీ ప్రస్తుత పాలకులు చెప్పే మాటలు. వాస్తవంలో అందుకు విరుద్ధమెన పరిస్థితులు నెలకొన్నాయి. వేధింపులకు ఎదురేగి పోరాటం చేస్తే అండగా నిలవాల్సిన ఉన్నతాధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. చెప్పినట్లు వినకపోతే ఉద్యోగం ఊడుతుందని హెచ్చరికలు జారీచేస్తున్నారు. విశ్వసనీయ వర్గాల కథనం మేరకు..ఉపాధి హామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా ఎం. మేరి ముద్దనూరులో విధులు నిర్వర్తిస్తున్నారు. ముద్దనూరు ఎంపీడీఓ మనోహర్‌రాజు వేధింపులు అధికమయ్యాయని ఆమె ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంది. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ మేరిపై అవినీతి ఆరోపణలు వచ్చాయంటూ సరెండర్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు. ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా సరెండర్ చేయడం వెనుక అసలు వ్యవహారం ఏమిటో విచారణ చేపట్టాల్సిందిగా అడిషనల్పీడీ విజయ్‌కుమార్ విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా ఏపీడీ మల్లేశ్వరరెడ్డిని నియమించారు. నివేదిక అనంతరం ఎంపీడీఓ సరెండర్‌ను రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈక్రమంలో ఎంపీడీఓ మనోహార్రాజు వేధింపులు భరించలేకున్నా, ఇక్కడి నుంచి బదిలీ చేయమని స్వయంగా పీడీ రమేష్‌కు మేరీ ఏప్రిల్ 21న రాతపూర్వకంగా కోరారు. ఆరు మండలాలను ఆప్షన్ ఇస్తూ ఏదో మండలానికి బదిలీ చేయాలని అభ్యర్థించారు. ‘ఎలాంటి తప్పు చేయలేదు, మీరేందుకు బదిలీ కావాలి, మేమున్నాం’ అంటూ ఉన్నతాధికారులు అప్పట్లో నోటిమాటలు చెప్పారు. ఉపాధి కూలీల నుంచి ఎలాంటి ఆరోపణలు లేకపోగా, ఉన్నతాధికారులు సైతం అండగా ఉండటంతో మేరీ విధులు నిర్వహిస్తూ వచ్చారు. అయితే వేధింపులు పునరావృతం కావటంతో ఆమె జేసీ శ్వేతను జూన్ 2న ఆశ్రయించినట్లు సమాచారం. ఎంపీడీఓ వేధింపులు భరించలేకున్నా, అక్కడి నుంచి బదిలీ చేయమంటే అధికారులు చేయడం లేదని మొరపెట్టుకున్నట్లు తెలుస్తోంది. వెంటనే స్పందించిన జేసీ ఎంపీడీఓకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. అయినప్పటీకీ ధోరణి మారకపోవడంతో జూన్ 24న ముద్దనూరు పోలీసుస్టేషన్లో మేరీ ఫిర్యాదు చేశారు. ఆమేరకు పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. ప్లేట్ ఫిరాయించిన ఉన్నతాధికారి గతంలో అండగా నిలిచిన ఉన్నతాధికారి ఒకరు ఉన్నట్లుండీ ప్లేట్ ఫిరాయించారు. జూన్ 24న మేరీ పోలీసులకు ఫిర్యాదు చేయగా, మరుసటిరోజు నుంచి వార్నింగ్‌లు మొదలయ్యాయి. కేసు ఉపసంహరించుకోకపోతే ఉద్యోగం చేయలేవని హెచ్చరికలు తీవ్రమయ్యాయి. విసిగిపోయిన మేరి వెనక్కి తగ్గేది లేదని గట్టిగా చెప్పినట్లు సమాచారం. మహిళగా మేరి తెగువను అభినందించాల్సి పోయి, శాఖాపరంగా వేధింపులు... అత్యున్నతాధికారి సమక్షంలో బెదిరింపులు పాల్పడటం రివాజుగా మారినట్లు సమాచారం. ఈక్రమంలోనే ఆమెకు ఇచ్చిన సియూజీని సైతం కట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా కేసు ఉపసంహారించుకోవాలని మేరీపై పెద్దఎత్తున ఒత్తిడి పెంచడం వెనుక ఓ ఎమ్మెల్యే సిఫార్సులే కారణంగా తెలుస్తోంది. అధికారపార్టీ కండువా కప్పుకున్న ఆ ఎమ్మెల్యే కేసు ఉపసంహరింపజేయాల్సిన బాధ్య త ఉన్నతాధికారిదేనని దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఆమేరకు తొలివిడతగా సియూజీ సిమ్ కట్ చేసినట్లు తెలుస్తోంది. రేపోమాపో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగం సైతం తొలగించేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. నిసిగ్గుగా అధికారుల ప్రవర్తన టెక్నికల్ అసిస్టెంట్‌పై వేధింపుల వ్యవహారంలో అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఒకరు సిఫార్సు చేశారని అత్యున్నతాధికారులు నిసిగ్గుగా ప్రవర్తిస్తున్నారని పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు అన్యాయం వైపు మొగ్గుచూపుతూ రాజకీయ నాయకులకు కొమ్ముకాయడాన్ని పలువురు చిరుద్యోగులు మండిపడుతుండటం విశేషం. -
ఏసీబీ వలలో ఐజేపీ టీఏ
బాన్స్వాడ: నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ మండలంలో ఇందిరజలప్రభ పథకం(ఐజేపీ)లో టెక్నికల్ అసిస్టెంట్ (టీఏ)గా పనిచేస్తున్న ఈశ్వర్ గౌడ్.. బోర్లు వేసే కాంట్రాక్టరు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కాడు. ప్రభుత్వ భూముల్లో సాగు సౌకర్యంకోసం ఇందిర జలప్రభ పథకం ద్వారా బోర్లు వేయిస్తారు.బిచ్కుందకు చెందిన మహమ్మదు అనే కాంట్రాక్టర్ మండలంలో తొమ్మిది బోర్లు వేశాడు. ఐదు బోర్లకు సంబంధించిన బిల్లు ఇప్పటికే అందాయి. మిగిలిన నాలుగు బోర్లకు సంబంధించిన బిల్లులకు సంబంధించి రూ. 98 వేలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ బిల్లు క్లియర్ చేయాలంటే రూ. 10 వేలు లంచం ఇవ్వాలని టీఏ ఈశ్వర్ గౌడ్ డిమాండ్ చేశాడు. దీంతో సదరు కాంట్రాక్టర్.. నిజామాబాద్ డీఎస్పీ నరేందర్‌రెడ్డిని ఆశ్రయించాడు. బుధవారం ఉదయం ఓ హోటల్ లో కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా టీఏను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఏసీబీ కేసు నమోదు చేసినట్లు తెలిసింది. -
‘ఉపాధి'కి ఎసరు?
బద్వేలు: ఉపాధి హామీ పథకం అమలుపై పలు సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ పథకాన్ని కొన్ని మండలాలకే పరిమితం చేసే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలోని 15 మండలాల్లో గ్రామీణాభివృద్ధి శాఖ తరుపున ఇటీవల ఉపాధి సిబ్బంది చేపట్టిన సమగ్ర సర్వే ఇందుకు బలం చేకూర్చుతోంది. ఆయా మండలాల్లో ఉపాధి హామీ ఏపీఓ, టెక్నికల్ అసిస్టెంట్ ఆధ్వర్యంలో స్థానిక ఫీల్డ్ అసిస్టెంట్‌తో పాటు విద్యావంతుడి తోడుగా ఈ సర్వే చేపట్టారు. జిల్లాలోని అట్లూరు, బి.కోడూరు, బి.మఠం, చక్రాయపేట, దువ్వూరు, గాలివీడు, కలసపాడు, లక్కిరెడ్డిపల్లె, పెండ్లిమర్రి, రాజుపాలెం, రామాపురం, సంబేపల్లి, కాశినాయన, వీరబల్లి, పెద్దముడియం మండలాల్లో ఈ సర్వే నిర్వహించారు. ఐదు విభాగాల్లో ఇంటింటి సర్వే చేపట్టి వివరాలు సేకరిస్తున్నారు. సర్వేలో మొదట కులం, జాబ్‌కార్డు, రేషన్‌కార్డు, ఇళ్లు తదితర వివరాలను నమోదు చేస్తున్నారు. దీంతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు, భూమి, ఇళ్లు, ఉపాధి, ఆస్తుల వివరాలను సేకరిస్తున్నారు. ఉపాధి కింద పని అవసరమా... లేదా, అవసరమైతే ఏయే రకాల పనులు కోరుతున్నారు అనే సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. ఇలా రాష్ట్రంలోని 655 మండలాలకు గాను 146 మండలాల్లో ఈ వివరాలను సేకరిస్తున్నారు. ఏళ్లతరబడి కరవుతో విలవిల్లాడే మండలాలను సర్వేకు ఎంపిక చేశారు. ఈ సర్వేతో అక్కడ ఏటా ఎందుకు కరవు చోటు చేసుకుంటోందో తెలిసే అవకాశముందని కేంద్రం భావిస్తోంది. ఉపాధి ఈ మండలాల్లోనేనా...! ఉపాధి పనులు ఈ మండలాల్లో మాత్రమే చేపట్టేందుకే సర్వేను ప్రారంభించారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నెల కిందట కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నితిన్‌గడ్కరి చేసిన వ్యాఖ్యలు దీన్ని బలపరుస్తున్నాయి. ఏళ్ల తరబడి ఉపాధి పనులు చేపట్టినా పలు ప్రాంతాల్లో ఎంతమాత్రం ప్రయోజనం లేదని, కొన్ని ప్రాంతాల్లో అవసరం లేకున్నా పనులు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఈ సర్వేను చేపట్టారు. ఏళ్ల తరబడి కరవు ఉన్న మండలాలను ఎంపిక చేయడం, పని అవసరమా... లేదా, ఏయే రకం పనులు అవసరమనే వివరాలు సేకరించడం కూడా ఈ ప్రాంతాల్లోనే పనులు చేపడతారనే అనుమానానికి బలం చేకూరుతోంది. జన్మభూమి తర్వాత ఎంపీడీఓలకు బాధ్యత ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో మండల స్థాయిలో ఎంపీడీఓలు, గ్రామస్థాయిలో గ్రామకార్యదర్శులకు కీలక బాధ్యతలు అప్పజెబుతూ గత నెల చివరివారంలో జీఓ విడుదల చేసింది. అయితే విధి విధానాలకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు వెలువడకపోవడంతో ఎంపీడీఓలు ఏమి చేయాలో తెలియక ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ బాధ్యతలకు సంబంధించి గత గురువారం రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ నుంచి ఆదేశాలు వచ్చాయి. డిజిటల్ సిగ్నేచర్ కీలను కూడా ఎంపీడీఓలకు అప్పజెప్పాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. జన్మభూమి తరువాత ఎంపీడీఓలు పథకం బాధ్యతలు చేపట్టే అవకాశముందని డ్వామా అధికారులు చెబుతున్నారు. -
కష్టఫలమేది?
పిట్లం, న్యూస్‌లైన్: ‘‘ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాలలో పనిలేని పేదలకు పనులు కల్పిస్తున్నాం.. ఇందుకు సంబంధిం చిన కూలి డబ్బులు వారంలోగా చెల్లిస్తున్నాం’’ అంటూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేస్తోంది. కానీ క్షేత్ర స్థాయిలో దానిని అమలు చేయడంలో విఫలమవుతోంది. అధికారుల పర్యవేక్షణ లోపమే దీనికి కారణం. ఫలితంగా ఉపాధి పనులు జరిగి నెలలు గడుస్తున్నా కూలీలకు డ బ్బులు అందడం లేదు. వారు అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరిగి, తిరిగి వేసారిపోతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు పిట్లం మండలంలోని వివిధ గ్రామాలలో ఉపాధి పనులు జరిగాయి. చాలా గ్రామాలలో కూలీల కు డబ్బులు చెల్లించారు. గోద్మేగాం, రాంపూర్ కలాన్, చిన్నకొడప్గల్, కారేగాం, మార్దండ గ్రామాల కూలీల కు మాత్రం ఇప్పటికీ కూలి డబ్బులు అందలేదు . అప్ప టి టెక్నికల్ అసిస్టెంట్ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ సమస్య ఏర్పడింది. ఈ ఐదు గ్రామాలలో సుమారు రెండు నుంచి మూడు వారాలపాటు పనులు జరిగాయి. కూలీలకు దాదాపు 70 లక్షల రూపాయలు రావాల్సి ఉంది. అప్పుడు టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేసిన జ్ఞానేశ్వర్ పనికి సంబంధించిన మస్టర్లు సక్రమంగా నమోదు చేయలేదు. దీంతో చెల్లింపులు నిలిచిపోయాయి. చెమటోడ్చి కష్టపడి పనిచేసిన కూలీలు మాత్రం లబోదిబోమంటున్నారు. అధికారులకు ఈ విషయం గురించి ఎన్నిసార్లు విన్నవించినా ప్రయోజనం లేకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. దాదాపు 220 బృందాలలో ఒక్కొక్కరికీ రూ. 1600 నుంచి రూ. 2వేల వరకు రావాల్సి ఉంది. ఒక్కో బృందంలో పది నుంచి ఇరవై మంది వరకు కూలీలు ఉన్నారు. ‘ఉపాధి’ చట్టం ఏం చెబుతోంది ఉపాధి హామీ పథకం చట్టం పకడ్బందీగానే ఉంది. ఉపాధి పనులు చేసిన కూలీలకు 15 రోజులలో కూలీ చెల్లించాలనే నిబంధనలున్నాయి. అధికారులు వీటిని తుంగలో తొక్కారు. కూలీల ఆశలపై నీళ్లు చల్లారు. దరఖాస్తు చేసుకున్నవారికి పని కల్పించడంలో విఫలమైతే 25 శాతం కూలీ చెల్లిస్తామన్న అధికారులు, ఈ విషయంలో ఎందుకు బిల్లులు చేయడం లేదని కూలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయలు పెండింగ్‌లో ఉంటే ఎలా జీవించాలని ఆవేదన చెందుతున్నారు. బాధ్యులపై చర్యలేవీ? అపుడు ఈ పనులను సంబంధించి మస్టర్లు తయారు చేసిన టెక్నికల్ అసిస్టెంట్ జ్ఞానేశ్వర్ ఆ తర్వాత ఉద్యోగం మానేశారు. ఈ పనులను పర్యవేక్షించాల్సిన అధికారులూ పట్టించుకోలేదు. బాధ్యులపై ఎలాంటి చర్యలూ లేవు. ఇపుడూ, అపుడూ అంటూ కాలయాపన చేస్తున్నారు తప్పితే, సమస్యను పరిష్కరించే దిశగా మాత్రం ఎవ్వరూ చొరవ చూపడం లేదు. డబ్బులు చెల్లిస్తం -అప్రీం, ఈజీఎస్ ఏపీఎం గతంలో పనిచేసిన టెక్నికల్ అసిస్టెంట్ పొరపాటుతో ఇలా జరిగింది. ఈ విషయాన్ని డ్వామా పీడీ, జిల్లా కలెక్టర్‌తోపాటు, ఈజీఎస్ రాష్ట్ర డెరైక్టర్ దృష్టికీ తీసుకెళ్లాం. త్వరలోనే కూలీలకు డబ్బులు చెల్లిస్తాం. వాళ్లకు ఇబ్బంది లేకుండా చూస్తాం. బైట పనులు చేసినా పైసలొచ్చేవి ‘ఉపాధి’ కూలి పైసలు తొందరగా వస్తాయనుకున్నం. పనులు జరిగి నెలలు కావస్తున్నా రావడం లేదు. దీని కంటే బయట పని చేసినా పైసలు వచ్చేవి. ఒక్క టెక్నికల్ అధికారి పొరపాటుకు మేం ఎన్ని రోజులు బాధలు భరించాలి. అధికారులు దృష్టి సారించాలి. - శ్రీరాముల రాములు, గౌరారం ఎప్పుడూ ఇట్ల జరగలేదు రాంపూర్ గ్రామ సర్పంచ్‌గా పని చేసిన నేను ఉపాధి కోసం పనులకు వెళ్లాను. గతంలో ఎన్నో పనులను చేయించినా ఇలా జరగలేదు. లేకనే కూలికి వెళ్తున్నాం. సమ యానికి డబ్బులు రాకపోతే, ఎంతమంచి పథకం ఉన్న ఏం ప్రయోజనం. ఇప్పటికైనా అధికారులు స్పందించి కూలీల డబ్బులు చెల్లించాలి. -సార నారాయణ, గౌరారం -
ఇందిర జలప్రభ బోర్ల పరిశీలన
తలమడుగు, న్యూస్‌లైన్ : మండలంలో ఇందిర జలప్రభ పథకం కింద రైతుల పొలాల్లో వేసిన బోర్లను ఇందిర జలప్రభ రాష్ట్ర అసిస్టెంట్ డెరైక్టర్ జి.నీలారెడ్డి, సీనియర్ అసిస్టెంట్ భానుప్రసాద్ మంగళవారం పరిశీలించారు. మండల కేంద్రంలో సర్వే చేసి వెళ్లారు గానీ ఇప్పటివరకు సిబ్బంది రాలేదని రైతులు ఎలుగు ఆనంద్, రాజన్న అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై ఏపీడీ కృష్ణారావు, ఏపీవో జగ్దేరావులను ప్రశ్నించగా.. నీటి లభ్యత లేకపోవడంతో తిరస్కరించామని తెలిపారు. నీటి లభ్యత ఉన్నట్లు దరఖాస్తు చేస్తే తిరిగి సర్వే చేస్తామని పేర్కొన్నారు. నీలారెడ్డి, భానుప్రసాద్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గతంలో పదెకరాలకు ఒక బోరు వేశామని, ప్రస్తుతం ఐదెకరాలున్నా బోరు వేస్తామని తెలిపారు. మండలంలో ఎన్ని గ్రామాల్లో బోర్లు వేశారని ఏపీవోను అడిగి తెలుసుకున్నారు. కజ్జర్ల, లక్ష్మీపూర్, కుచులాపూర్, కప్పర్దేవి గ్రామాల్లో బోర్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. వారి వెంట టెక్నికల్ అసిస్టెంట్ లక్ష్మణ్, రవీందర్, పొచ్చన్న తదితరులు ఉన్నారు.