తలమడుగు, న్యూస్‌లైన్ :
మండలంలో ఇందిర జలప్రభ పథకం కింద రైతుల పొలాల్లో వేసిన బోర్లను ఇందిర జలప్రభ రాష్ట్ర అసిస్టెంట్ డెరైక్టర్ జి.నీలారెడ్డి, సీనియర్ అసిస్టెంట్ భానుప్రసాద్ మంగళవారం పరిశీలించారు. మండల కేంద్రంలో సర్వే చేసి వెళ్లారు గానీ ఇప్పటివరకు సిబ్బంది రాలేదని రైతులు ఎలుగు ఆనంద్, రాజన్న అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై ఏపీడీ కృష్ణారావు, ఏపీవో జగ్దేరావులను ప్రశ్నించగా.. నీటి లభ్యత లేకపోవడంతో తిరస్కరించామని తెలిపారు. నీటి లభ్యత ఉన్నట్లు దరఖాస్తు చేస్తే తిరిగి సర్వే చేస్తామని పేర్కొన్నారు.
నీలారెడ్డి, భానుప్రసాద్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గతంలో పదెకరాలకు ఒక బోరు వేశామని, ప్రస్తుతం ఐదెకరాలున్నా బోరు వేస్తామని తెలిపారు. మండలంలో ఎన్ని గ్రామాల్లో బోర్లు వేశారని ఏపీవోను అడిగి తెలుసుకున్నారు. కజ్జర్ల, లక్ష్మీపూర్, కుచులాపూర్, కప్పర్‌దేవి గ్రామాల్లో బోర్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. వారి వెంట టెక్నికల్ అసిస్టెంట్ లక్ష్మణ్, రవీందర్, పొచ్చన్న తదితరులు ఉన్నారు.
ఇందిర జలప్రభ బోర్ల పరిశీలన
Published Wed, Sep 18 2013 1:21 AM | Last Updated on Fri, Sep 1 2017 10:48 PM
Advertisement