
లక్ష్మణచాంద: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు ఉద్యమకారుడని పాలన ఇస్తే ధనిక రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల ధ్వజమెత్తారు. తెలంగాణలో మాట మీద నిలబడే నాయకత్వం లేదని ఎద్దేవా చేశారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర 189వ రోజు నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలో మంగళవారం పర్యటించారు.
కనకాపూర్, నర్సాపూర్, ఒడ్డెపెల్లి, బోరిగాం గ్రామాల మీదుగా యాత్ర సాగింది. కనకాపూర్ గ్రామ కూడలిలో ఆమె మాట్లాడుతూ..నిలబెట్టుకోని హామీలు ఇవ్వడంలో సీఎం కేసీఆర్ దిట్ట అని, ఇచ్చిన మాట కోసం ప్రాణాలను ఇచ్చిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో దళితబంధు, గిరిజనబంధు అంటున్నారని, రాబోయే కాలంలో బీసీబంధు అని కూడా అంటారని ఎద్దేవా చేశారు
Comments
Please login to add a commentAdd a comment