
సాక్షి, నిర్మల్ : జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీలో ఆదివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అకడమిక్ బ్లాక్ ఏబీ 1 క్లాస్‌రూమ్‌లో షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో క్లాస్‌రూమ్‌లోని ఫర్నీచర్, ప్రొజెక్టర్, సుమారు 60 నుంచి 70 వరకు చైర్లు, 21 టేబుల్స్ పూర్తిగా దగ్థం అయ్యాయి. క్యాంపస్ మొత్తం పొగతో కమ్మేసింది. కాగా షార్ట్ సర్య్కూట్‌పై అప్రమత్తమైన అధికారులు అగ్నిమాపకసిబ్బందికి సమాచారమందించారు. అధికారుల సమాచారంతో వెంటనే చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment