
మంటల్లో చిక్కుకున్న ఆటో
సాక్షి, నిర్మల్ : రోడ్డుపై వెళ్తున్న స్కూల్ ఆటోలో మంటలు చెలరేగిన ఘటనలో ఆటో డ్రైవర్ అప్రమత్తత వల్ల ఆటోలో ఉన్న విద్యార్థులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటన బుధవారం నిర్మల్ జిల్లాలోని అక్కాపూర్ వద్ద చోటుచేసుకుంది. 10మంది విద్యార్థులతో వెళ్తున్న ఓ స్కూల్ ఆటోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సరైన సమయానికి ఆటోడ్రైవర్ స్పందించి ఆటోలో ఉన్న పిల్లలను కిందకు దించేశాడు. అయితే మంటలు ఆర్పటానికి డ్రైవర్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆటో పూర్తిగా కాలిపోయినా అందులోని పిల్లలు క్షేమంగా బయటపడ్డారు.